2025 లో 100 గజాలు ఇంటికి అయ్యే ఖర్సు ? 20lakhs లో మన ఇంటిని మనం ఎలా కట్టుకోవాలో step by step process!

2025 లో 100 గజాలు ఇంటికి అయ్యే ఖర్సు ? 20lakhs లో మన ఇంటిని మనం ఎలా కట్టుకోవాలో step by step process!

3bhk house construction
the best construction in vizag

2025 లో 100 గజాలు ఇంటికి అయ్యే ఖర్సు:

2025 లో 100 గజాలు ఇంటికి అయ్యే ఖర్సు: 2025 లో 100 గజాలు లేదా 1000sft లో మనం ఇల్లు కట్టుకోవాలి అంటే 2000000/ (20lakh ) వరకు అవుతుంది అది మన ఇళ్ళు మనం కట్టుకున్న లేదంటే కాంట్రాక్టర్ కి ఇచ్చిన అయ్యే cost 20lakh వరకు అవుతుంది  అలాగే మీరు మీ ఇంటికి cupboard work చేయించుకోవాలి అంటే (మధ్యరకంగా) అదనంగా 7 to 8 lakh అవుతూంది. అదే మనం కాంట్రాక్టర్ కి(మెటీరియల్ తో ) ఇచ్చినట్లు అయితే “SFT”  కి 2000/ RUPEES charge చేస్తారు. (no .1 ) మంచిక్వాలిటీ లో ఇల్లు కట్టించి ఇవ్వడానికి(SFT కి 2000/ తీసికుంటారు ఈ రేట్ కి ఒక cupboard work తప్ప అన్ని వర్క్స్ చేసి owner కి తాళాలు ఇచ్చేయవచు ఇంటిలోకి దిగడానికి ) అదే మెటీరియల్ మీరు చూసికొని ఓన్లీ labor and mastery  అయితే SFT కి  300/ to 350/ తీసికుంటారు. నేను ఇప్పుడు చెప్పినవన్నీఏరియా బట్టి మారవచ్చు(మన ఇంటిని మనం కట్టించుకుంటేనే బెటర్ ఒకవేళ మీకు అవ్వని యెడల కాంట్రాక్టర్ కి ఇచ్చి దగ్గరవుండి చేయించుకోవాలి) https://amzn.to/4k0KoYW

ఇల్లు కట్టుకొనే విధానం step by step process :

* ముందుగా స్థలాన్ని(ఇల్లు కట్టుకున్నప్లేస్)  శుభ్రం చేసికోవాలి (క్లీనింగ్ ) ఆ తరువాత 

* “soil” test చేసికోవాలి 6′ to 20′ వరకు మట్టిని(layer కి layer కి ఎర్రమట్టి మరియు తెల్లమట్టి ) చెకరించి టెస్టుకి పంపించాలి. site కి చుట్టువైపులా లేదంటే site ki ముందు వెనుక భాగం వరకు మట్టిని చెకరించి test కి పంపించాలి . “soil test” ఎందుకుఅంటే రిపోర్ట్ వచ్చినాక రిపోర్ట్ బట్టి గోతులు ఎంతలోతు తీయాలి ఎంత వెడల్పు తీయాలి ఎంత ఎంత కాంక్రేట్ వేయాలి,ఏ ఏ కాంక్రెట్ వాడాలి, ఎంత  ఎంత rod లు ఉపయోగించాలి ఇలా ప్రతి పాయింట్ (పని గురించి ) “soil test ” పైనా ఆధారపడుతుంది . ఎన్ని ఫ్లోర్స్ ( stair లు ) కట్టుకోవచ్చు అనేది కూడా తెలుస్తుంది . రిపోర్ట్ బట్టి work అనేది start చేయాలి.

* “Siddhanth” లేదా “engineer’ దగ్గర ప్లాన్ తీసికోవాలి, తరువాత సైట్ మొత్తం(ఇల్లు కట్టుకున్న ప్లేస్ ) కొలతలు తీసికొని సున్నము తో మార్కింగ్ చేసికోవాలి( మూలమట్టం సరిచూసికోవాలి ఇది చాల ఇంపార్టెంట్ )    

శంకుస్థాపన చేయాలి తరువాత work అనేది start చేయాలి (అవుతుంది )

* footings కోసం సున్నం తో మార్కింగ్ చేసికొని గుంతలు తీయాలి (గుంతలు అనేవి 4’*5′ లేదా 5’*5′ లేదా 5’*6′ తీసికోవాలి అలాగే వీటి mat 4*4 సైజు లో ఉండాలి . కొలతలు(మార్కింగ్ ) అనేవి చాల జాగ్రత్తగా చూసికోవాలి ఒకటికి పదిసార్లు, అలాగే  మూలమట్టాలు సరిచూసికోవాలి ఇది చాల ఇంపార్టెంట్ .

* ఈ శాన్యం లో బోర్ (pump ) వేయించుకోవాలి  

* తరువాత గుంతలో PCC work (40mm concrete) చేయాలి. తరువాత “పిల్లర్ కోసం” మార్కింగ్ చేసికోవాలి, pillars అనేవి మీ ఇంటి సైజు బట్టి 9″*9″ లేదా 9″*12′ వరకు తీసికోవాలి (గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు అయితే 9″*9″ లేదంటే ఇంటిపైన ఒకటి లేదా రెండు ఫ్లోర్స్ వేసినట్టులు అయితే 9″*12′ పిల్లర్లు  వేసికోవచ్చు), పిల్లర్స్ కి బాక్స్ లు అమెరిసికొని(పెట్టుకొని) నేలమట్టం వరకు (5′) పిల్లర్స్ వేసికోవాలి .    

* ఐరన్ రాడ్లు అనేవి mat కి 6mm లేదా 8mm వాడవచ్చు పిల్లర్స్ కి అయితే 10mm లేదా 12mm వాడవచ్చు (12mm బెటర్ అది మీ బడ్జెట్ బట్టి ) 

* ఆ తరువాత  ప్లింత్ భీం వేసికోవాలి కొంతమంది రెండు “plinth beam” లు వేసికుంటారు అది వాళ్ళ బడ్జెడ్ బట్టి (నేలమట్టం లోపల 4′ లేదా 3′ లోతు గొయ్యలు తీసి  పిల్లర్స్ చుట్టూ ఒకటి వేసికొని మట్టిపిల్ చేసికొంటారు  నేలమట్టం వచ్చినాక సెట్ బ్యాక్(setback) లని కలిపికొని రూమ్స్, bathrooms, హాల్స్, కిచెన్ కి, ప్రతి వాల్ కి  కలిపి ఒక “ప్లింత్ భీం” వేసికొని మట్టి పిల్ చేసికుంటారు).

* “ప్లింత్ భీమ్” వేసికోవాలి అంటే ముందుగా సువ్వలు (8mm లేదా 10mm ) కట్టుకోవాలి, అలాగే ఈ “ప్లింట్ భీమ్” ని కొంతమంది “iron bord” (సెంటరింగ్ చేసికొని ), మరికొంతమంది సువ్వలు చుట్టు బ్రిక్ (ఎర్ర ఇటుక ) పెట్టుకొని కట్తారు(బడ్జెట్ ఎక్కువ అవుతుంది strong ఉంటుంది), మరికొంతమంది చెక్కలు పెట్టి కట్తారు.

* ఈ “ప్లింత్ భీము” పైన చిన్న పాటి గీతాలు పెట్టుకోవాలి ఎందుకు అంటే ఇక్కడనుంచి ఇంటికి సంబంధించి వాల్స్ కట్టుకోవాలి కాబట్టి (ప్లింట్ భీమ్ కి వాల్స్ కి మధ్య గ్రిప్ కోసం లేదా పైన కట్టిన గోడకి బలం కోసం )

* ఇక్కడనుంచి “starter” లు పెట్టుకొని కొలతలు ఒకటికి పదిసార్లు చెక్ చేసికోవాలి చెక్ చేసికున్నాక “lintel  level” వరకు పిల్లర్స్ వేసికోవాలి (vibrate ఉపొయాగించాలి) .

* ఇక్కడనుంచి గోడలు కట్టుకోవాలి “లింటల్ లెవల్” (సన్ షేడ్ వరకు 7′) వరకు , కిటికీలు దగ్గర గ్యాప్ ఇచ్చి లింటల్ లెవెల్ వరకు గోడలు కట్టొకొవాలి .( outer walls 9″ మరియు inner walls 4″) అలాగే 9″ వాల్స్ కి ఐదు వరసలు తరువాత “సూదిరాయ్” వరుస కట్టుకోవాలి అదే 4″ వాల్స్ కి 3ఫీట్ కి లింటల్ ఇవ్వాలి, వీటివల్ల  గోడలు గట్టిగ ఉంటాయి.  

* గోడలకి ఎప్పడికప్పుడు లోపల బయట  “పాయింటింగ్” చేసికోవాలి, అలాగే క్యూరింగ్ (వాటరింగ్ )ఇంపార్టెంట్

* బేస్మెంట్ పైన దర్వాజాలు(గుమ్మాలు) పెట్టుకోవాలి , ఇంటికి ఎన్ని డోర్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో (సరిసంఖ్యలో ఉండాలి ) అన్ని దరవజాలు పెట్టుకోవాలి .

* ఆ తరువాత “సెప్టిక్ ట్యాంక్ ” తీసికొని “ప్లంబింగ్ వర్క్” కనెక్షన్స్ ఇచికోవాలి , చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి సహజం .

* “లింటల్ లెవెల్” వరకు గోడలు కట్టినాక లింటల్ పోసికోవాలి  ఆ తరువాత స్లాబ్ వరకు కట్టుబడి కట్టేయాలి   అలాగే లింటల్ వేసికున్నప్పుడే ఒక వరుస మెట్టులు (స్టెప్స్ ) లాండింగ్ కట్టుకోవాలి, తరువాత స్లాబ్ వేసినాక రెండవ వరుస మెట్టులు లాండింగ్ కట్టుకోవాలి 

* ఆ తరువాత స్లాబ్ కోసం సెంటరింగ్ పెట్టుకోవాలి, సెంటరింగ్ అనేది స్లాబ్ వేసినాక 15 to 20డేస్ తరువాత తీసికోవచ్చు. స్లాబుకి (8mm or 10mm ) రాడ్స్ ఉపయోగించవచ్చు, స్లాబ్ వేసినాక స్లాబ్ పైన ఒక వరుస బ్రిక్ వరుస రూమ్ రూమ్ కి కట్టుకోవాలి క్యూరింగ్ (water filling చేయాలి ) చేసినప్పుడు వాటర్ అనేది బయటకు పోకుండా ఉండడానికి (25 to 30days వాటరింగ్ చేయాలి స్లాబుకు),https://impresshomedesigners.com/how-to-build-3bhk-house-in-2025-3bhk-house-cost-and-estimation-in-2025/?preview_id=2012&preview_nonce=789b85f21f&post_format=standard&_thumbnail_id=2017&preview=true

* slab వేసినప్పుడే ఎలక్ట్రికల్ పైప్స్ స్లాబ్ పైన అవసరమైనవి పెట్టుకోవాలి అలాగే “Elect ration” ఉండాలి. స్లాబుకి సెంటరింగ్ తీసినాక అవసరమైన దగ్గర గోడలు కట్ చేసి ఎలక్ట్రికల్ & ప్లంబింగ్ వర్క్ స్టార్ట్ చేయాలి.స్లాబ్ పైన వాటర్ ట్యాంక్ పెట్టుకొని కనెక్షన్ పెట్టుకోవాలి 

* తరువాత ఇన్నర్ మరియు ఔటర్  ప్లాస్టరింగ్ చేసికోవాలి టైల్స్ వచ్చినదగ్గర rough work చేయాలి తరువాత కొంచెం గ్యాప్ తీసికొని వైట్ వాష్ (Birla) చేయంచాలి   

* ఇక్కడనుంచి మిగిలిన పనులు  రోజుకి ఎన్నయిన చేయించుకోవచ్చు  అంటే ఒక వైపు “ఎలేవేషన్” ఒక వైపు “ceiling”, ఒకవైపు putty(wall care putty పెట్టించికోవాలి) and painting,  తరువాత ఫ్లూరింగ్, తరువాత “tiles and  గ్రానైట్” వర్క్. ఇలా వర్క్స్ అన్ని ఒకదాని తరువాత ఒకటి చేయించికోవాలి .

* “windows” కి ముందుగా “safety grills” పెట్టుకోవాలి తరువాత UPVC windows install చేసికోవాలి (look కోసం UPVC better )

* ceiling  లోపల gypsum తో చేయించి బయట PVC ceiling చేయించుకోవాలి look బాగుంటుంది 

* టైల్స్ వర్క్ అయినాక polish చేయించాలి అలాగే స్టెప్స్ కి గ్రానైట్ వేయించాలి look కోసం.http://What is GP Layout? GP Layout అంటే ఏమిటి ? వీటి ఉపయోగము ఏంటి ? https://impresshomedesigners.com/what-is-gp-layout-gp-layout-%e0%b0%85%e0%b0%82%e0%b0%9f%e0%b1%87-%e0%b0%8f%e0%b0%ae%e0%b0%bf%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%b5%e0%b1%80%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%89%e0%b0%aa%e0%b0%af%e0%b1%8b%e0%b0%97/

* కాంపౌండ్ వాల్ డిజైన్ చేయించి గేట్ పెట్టుకోవాలి అలాగే స్టెప్స్ కి “ss railing” అలాగే ఎలేవేషన్ కి “గ్లాస్ వర్క్” చేయించుకోవాలి ఇంతటితో ఇల్లు ఫినిష్ అయిపోతుంది ……..thank you

 

modern home theatre setup
best home theatre setup in home