How to Use Fridge? ఫ్రిజ్ ఎందుకు పేలుతుంది? ఏ జాగ్రత్తలు తీసికోవాలి ?
How To Use Fridge : ఇప్పుడు అందరు ఇంటిలో ఫ్రిజ్ అనేది కామన్ గా ఉంటుంది. చల్లని నీటికోసం, ఆహారపదార్దాలు, కూరగాయలు పాడవకుండా ఉండడానికి తమ స్తోమతను బట్టి ఫ్రిజ్ కొంటున్నారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు పండ్లు, పాలు వంటి పదార్దాలు ఎక్కువకాలం నిలువ ఉండడం కోసం ఫ్రిజ్ వాడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఫ్రిజ్ పేలింది అనే వార్తలు ఎక్కువుగా వింటున్నాం.
ఫ్రిజ్ పేలడం అనేది చాల అరుదుగా జరుగుతుంటుంది. ఫ్రిజ్ వాడకంలో కొన్ని పొరపాటలు వల్ల ఫ్రిజ్ పేలే అవకాశం ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. ఫ్రిజ్ అనేది పేలడం వలన కొన్నిసార్లు ఆస్తినష్టం ప్రాణనష్టం సంభవించవచ్చు. కావున అలాంటి ప్రమాదాలు జరగకుండా వుండాలి అంటే ఫ్రిజ్ వాడకంలో చాల జాగ్రత్తలు తీసికోవాలి.
ఫ్రిజ్ పేలడానికి కారణాలు:
ఫ్రిజ్ ప్రధానంగా కంప్రెసర్ వల్ల పేలుతుంది, రెఫ్రిజిరేటర్ లో కంప్రెసర్ ఎంతో ముఖ్యమైనది ఇది ఫ్రిజ్ వెనుకభాగంలో ఉంటుంది.కంప్రెసర్ లో పంపు, మోటార్ ఉంటుంది. ఈ మోటార్ పంపు ద్వారా రెప్రెజెరెంట్ వాయవును కాయిల్స్ కి పంపుతుంది. ఈ వాయవు చల్లబడి ద్రవంగా మారిన వెంటనే, అది రెఫ్రిజిరేటర్ నుంచి వేడిని సంగ్రహిస్తుంది. దానివల్ల లోపల ఉంచిన ప్రతి దాన్ని చల్లబరుస్తుంది.
ఒకవేళ కంప్రెసర్ ఎక్కువ వేడిఎక్కిన, బ్లాక్ అయినా, ఎక్కువగాలి పేరుకుపోతుంది. దీనివల్ల ఒత్తిడి పెరిగి పేలుడు సంభవించును. దానిలోని కండెన్సర్ కాయిల్ కుచించుకుపోతే గ్యాస్ బయటకు రావడం కుదరదు. అలాంటప్పుడు పేలుడు సంభవిస్తుంది. ఈ ప్రమాదం ఎక్కువుగా పాత (8 to 10years )ఫ్రిజ్ లో జరుగుతుంది. పవర్ సప్లై లో లోపాలు ఫ్యాన్ మోటర్లో సమస్య వల్ల కూడా ప్రమాదం జరగవచ్చు.
ముఖ్యమైన కారణాలు :
ఫ్రిజ్ లో ఉపయోగించే రిఫ్రిజరంట్ గ్యాస్ లీకయితే అది ఫ్రిజ్ లోపలి భాగంలో లేదా ఫ్రిజ్ చుట్టూ ఉండిపోతుంది ఆ సమయంలో ఏదయినా మంట తగిలిన, ఎలక్ట్రిక్ సమస్య ఏర్పడితే ఆ వాయవు నుండి పేలుడు సంభవించును అని గ్రహించాలి ఇది ఎక్కువ పాత ఫ్రిజ్ లో ఈ ముప్పు ఎక్కువ.
కొన్ని సార్లు విద్యుత్ ఓల్డేజ్ ఎచ్చుతగ్గులు, ఎలక్ట్రికల్ వైరింగ్ లోపం, పవర్ ప్లగ్, పవర్ సప్లై కార్డులో లోపం, ఫ్యాన్ మోటార్ లేదా కంప్రెసర్ ఫ్యాన్ లో ప్రాబ్లెమ్, ఫ్రీజర్ కెపాసిటిర్ లో లోపాలు తలెత్తిన ఫ్రిజ్ పేలే ఛాన్స్ ఉంటుంది.
జాగ్రత్తలు How To Use Fridge:
ఫ్రిజ్ ను గోడకు మరి దగ్గరకు ఉంచకూడదు. గోడ నుంచి కనీసం 6 to 10 అంగుళాలు దూరము వుండేలా చూసికోవాలి. ఎందుకు అంటే ఫ్రిజ్ వెనుక వున్న కంప్రెసర్ కి గాలి సరిగా తగులుతుంది. ఫ్రిజ్ డోర్ ను ఎక్కువచేపు తెరిసి ఉంచడం, ఎక్కువసారులు తెరవడం, మూయడం చేయకూడదు. కంప్రెసర్ లో ఏదయినా సమస్య వుంది అనిపిస్తే మెకానిక్ కి సంప్రదించాలి. అలాగే విద్యుత్ ఓల్డేజ్ ఎచ్చుతగ్గులు కోసం ఫ్రిజ్ కి స్టెబిలైజర్ ఉపయోగించడం మంచిది.
కాయిల్ నీ ఎప్పడికి అప్పుడు శుభ్రం చేస్తూఉండాలి. ఫ్రిజ్ లో ఏదయినా సమస్య ఉందానిపిస్తే వెంటనే టెక్నీషియన్ కి చూపించాలి. మీ ఫ్రిజ్ గోడకు దగ్గరగా ఉంటే ఫ్రిజ్ త్వరగా వేడెక్కితుంది. దీని వల్ల కంప్రెసర్ పైన వత్తిడి పెరిగి ప్రమాదం జరిగే అవకాశం వుంది.

ఫ్రిజ్ కెమెరా :
ప్రస్తుతకాలంలో ప్రతీ వస్తువు స్మార్ట్ గా మారిపోయింది.ఆటోమేటిక్ సెన్సర్లు స్మార్ట్ పరికరాల పనితీరును మరింత సులభతరం చేస్తున్నాయ్. తాజాగా మరో స్మార్ట్ పరికరం అందుబాటులోకి వచ్చేసింది. అదే ఫ్రిజ్ కెమెరా. ఇది ఎందుకుఅంటే ….కాలంతో పాటు ఫ్రిజ్ పరిమాణం కూడా బాగా పెరిగిపోయింది. కొంతమంది ఏకంగా వెయ్యి లీటర్లు రిఫ్రిజిరేటర్లు వాడుతున్నారు. వాటిలో అవసరానికి మించి వస్తువులను పెట్టేస్తున్నారు తరువాత వాటిగురించి మరిసిపోతున్నారు తీరా చూస్తే పోయేవిపోతున్నాయ్ ఉండేవి ఉంటున్నాయి.
ఎలా ఫని చేస్తుంది How To Use Fridge:
ఇలా కాకుండా వుండాలి అంటే ఈ కెమెరాని ఫ్రిజ్ డోర్ కి పెట్టేస్తే చాలు. ముందుగా ఈ కెమెరాని ఫోన్ కి కనెక్ట్ చేయాలి. ఏవైనా ఆహారపదర్ధాలు ఫ్రిజ్ లో పెట్టేముందు వీటి బార్ కోడ్ స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్కాన్ చేసి పెట్టుకోవడం వలన ఆయా పదార్దాల వివరాలు….ఎక్సపీర్ డేట్ వివరాలు నమోదు చేసికుంటుంది. ఎక్సపీర్ డేట్ దగ్గరకు పడేకొలది ఫోన్ కి అలెర్ట్ మెసేజ్ పంపుతుంది, దీనిని అలెక్స,..గూగుల్ అసిస్టెంట్ తో కనెక్ట్ చేసి వాయిస్ తోను దీనిని కంట్రోల్ చేయవచ్చు…USB ద్వారా ఈ కెమెరాని సులువుగా ఛార్జ్ చేయవచ్చు…
ఫ్రిజ్ క్లీన్ చేస్తున్నారా How To Use Fridge:
ఎండాకాలం వచ్చింది అంటే చాలు ఫ్రిజ్ ని ఎడాపెడా వాడేస్తుంటారు. చల్ల చల్లగాతినాలి అని తాగాలి అని ఫ్రిజ్ లోఅన్ని పెట్టేస్తాం. కానీ దానిని శుభ్రం చేయము వీటివల్ల చాల దుర్వాసనలు,..ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి కొన్ని టిప్స్ పాటించి ఫ్రిజ్ ని శుభ్రం చేసికోవచ్చు.
* ఫ్రిజ్ డోర్ లో చిన్న నిమ్మకాయ ముక్కకాని, బొగ్గు కానీ ఉంచడం వలన దుర్వాసనల్ని పీల్సికుంటాయ్.
* వేడినీళ్లలో కాస్త బ్లీచ్ వేసి తుడిసిన రెఫ్రిజిరేటర్ తేలిగ్గా శుభ్రం అవుతుంది.
* ఆహారం నిల్వ ఉండడం వలన వచ్చే వాసనలు పోవాలంటే వెనిలా ఎసెన్స్ లో దూది ఉండల్ని ముంచి ఫ్రిజ్ అరల మూలల్లో ఉంచండి. ఎలాంటి దుర్వాసనాలైన పోతాయ్.
* ముందుగ ట్రేలు, అరలు అన్ని తొలిగించాక కప్పు నీటిలో చెంచా బేకింగ్ సోడాని కలపాలి, చిన్న బ్రష్ పట్టుకొని మూలలు సులభంగా శుభ్రం చేయవచ్చు.
* వేడి నీటిలో టిస్యూలను ఉంచి వాటిని మరకలు, ఫుడ్ కలర్ అంటుకున్న చోట అతికిస్తే అవి సులభంగా తొలిగిపోతాయి.
* ప్రస్తుతం మన ఇంట్లో గడిపే ప్రతి రోజునూ వంటగదిలో కనిపించే ముఖ్యమైన వస్తువు ఏదైనా ఉందంటే, అది ఫ్రిడ్జ్. ఇది తినే పదార్థాలను శుభ్రంగా, శీతలంగా, పొడిగా ఉంచడానికి మరియు ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ఉపయోగపడుతుంది.
ఫ్రిడ్జ్ రకాలు
బజార్లో అనేక రకాల ఫ్రిడ్జ్‌లు లభిస్తాయి. అవి:
1. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్
ఇవి చిన్న కుటుంబాలకు అనువైనవి. చిన్న ఫ్రీజర్ భాగం కలిగి ఉంటుంది.
2. డబుల్ డోర్ ఫ్రిడ్జ్
రెండు భాగాలు – ఒకటి ఫ్రీజర్, మరొకటి రెఫ్రిజిరేటర్. మధ్యస్థ కుటుంబాలకు సరిపోతుంది.
3. సైడ్-బై-సైడ్ ఫ్రిడ్జ్
ఈ డిజైన్‌లో రెండు డోర్లు పక్కపక్కనే ఉంటాయి. పెద్ద కుటుంబాల కోసం సరైన ఎంపిక.
4. ఫ్రెంచ్ డోర్ ఫ్రిడ్జ్
ఇవి మోడర్న్ డిజైన్‌తో, రెండు పై డోర్లు (ఫ్రిడ్జ్), క్రింది భాగం ఫ్రీజర్. విస్తృత నిల్వ సామర్థ్యం కలిగి ఉంటుంది.
5. మినీ ఫ్రిడ్జ్
చిన్న సైజులో ఉండి, హోటళ్లు, ఆఫీసులు లేదా బాచిలర్ రూమ్‌లకు ఉపయోగపడతాయి.
6. స్మార్ట్ ఫ్రిడ్జ్
ఇవి టచ్ స్క్రీన్, ఇంటర్నెట్ కనెక్షన్, వాయిస్ కంట్రోల్ వంటి ఫీచర్లతో వస్తాయి.
ఫ్రిడ్జ్ ఉపయోగాలు How TO Use Fridge:
ఫ్రిడ్జ్ అనేది కేవలం పాలు, కూరగాయలు ఉంచే బాక్స్ మాత్రమే కాదు. దీని ఉపయోగాలు విస్తృతంగా ఉన్నాయి:
1. ఆహార నిల్వ

తక్కువ ఉష్ణోగ్రతలు బాక్టీరియా వృద్ధిని ఆపి, ఆహారాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేస్తాయి.
2. పానీయాల చల్లదనం
వాటర్ బాటిల్స్, జ్యూస్, సాఫ్ట్ డ్రింక్స్ తదితరాలను చల్లగా ఉంచుతుంది.
3. ఫ్రీజింగ్
మీట్స్, ఐటమ్స్ , ఫ్రోజన్ ఫుడ్లను ఫ్రీజర్‌లో నిల్వ ఉంచవచ్చు.
4. ఔషధ నిల్వ
హాస్పిటల్స్, క్లినిక్స్‌లో కొన్ని ఔషధాలు మరియు టీకాలు శీతల స్థితిలోనే ఉండాలి.
5. సౌందర్య ఉత్పత్తులు
కొన్ని ఫేస్ క్రీమ్‌లు, సీరమ్స్ వంటివి చల్లగా ఉంచడం వల్ల ఎక్కువ రోజులు నిలుస్తాయి.
ఫ్రిడ్జ్ సమర్థవంతంగా వాడే చిట్కాలు
-
మితంగా నిల్వ ఉంచండి – గాలి ప్రసరణకు చోటివ్వాలి.
-
డోర్ ఎక్కువసేపు తెరిచి పెట్టవద్దు – చల్లదనం తగ్గుతుంది.
-
తగిన ఉష్ణోగ్రత పెట్టండి – ఫ్రిడ్జ్: 3-4°C, ఫ్రీజర్: -18°C.
-
నిరంతరం శుభ్రపరచండి – బాక్టీరియా, వాసన నివారించవచ్చు.
-
డోర్ గాస్కెట్ చెక్ చేయండి – చల్లదనం బయటకు పోకుండా చూడాలి.
-
వెచ్చని ఆహారం ఉంచవద్దు – గాలి వేడిగా మారుతుంది.
-
వేడి ఉత్పత్తులు పక్కన ఉంచవద్దు – ఫ్రిడ్జ్‌ను స్టవ్, ఓవెన్ పక్కన పెట్టవద్దు.
ఆధునిక ఫీచర్లు
నేటి ఫ్రిడ్జ్‌ల్లో ఉన్న కొత్త సాంకేతికతలు:
-
ఇన్వర్టర్ టెక్నాలజీ: విద్యుత్ పొదుపు
-
మల్టీ ఎయిర్ ఫ్లో: సమాన చల్లదనం
-
డిజిటల్ డిస్ప్లే: టెంపరేచర్ కంట్రోల్
-
వాటర్ & ఐస్ డిస్పెన్సర్: బయట నుంచే అందుబాటులో
-
స్మార్ట్ కనెక్టివిటీ: మొబైల్ యాప్ ద్వారా నియంత్రణ
ఫ్రిడ్జ్ అనేది మన రోజువారీ జీవితం లో తప్పనిసరి భాగంగా మారిపోయింది. మన ఆరోగ్యాన్ని, ఆహార నాణ్యతను కాపాడే అద్భుత పరికరం ఇది. శాస్త్రీయంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ మన జీవితాలను మరింత సులభతరం చేస్తోంది.
ఇది కేవలం ఓ యంత్రం కాదు, అది మన జీవిత శైలికి అద్దం. మీరు మీ ఇంటికి మంచి ఫ్రిజ్ తీసికోవాలి అనుకుంటే https://amzn.to/4m7vemN

