Chimney VS Exhaust fan| ఎగ్జాస్ట్ ఫ్యాన్ అంటే ఏమిటి? చిమ్నీఅంటే ఏమిటి?How to Use ?

Chimney VS Exhaust fan| ఎగ్జాస్ట్ ఫ్యాన్ అంటే ఏమిటి? చిమ్నీఅంటే ఏమిటి?How to Use ?

Chimney VS Exhaust Fan:

Chimney For Kitchen: చిమ్నీ అంటే వేడి గాలి ని బయటకు పంపేది. చిమ్నీ అనేది ఇప్పుడు వున్నా పరిస్థితుల్లో చాల అవసరం అయిపొయింది ఎందుకంటే ఇప్పుడు ప్రతిఒక్కరు cupboard తో కిచెన్ డిజైన్ చేసికుంటున్నారు ఒకరకంగా చెప్పాలి అంటే లుక్ పరంగా బాగుంటుంది అలాగే cupboards అనేవి oil మరకలు పడకుండ కాపాడుతుంది అలాగే stove ఎంత సైజు ఉందొ చిమ్నీ అనేది అంతే సైజు ఉండేటట్లు చూసికోవాలి అలాగే stove కి chimney కి మధ్య distance minimum 30″ ఉండాలి కొంతమంది చిమ్నీ పెట్టుకోకపోతే exit fan పెట్టుకుంటారు. Modular kitchen కీ చిమ్నీ బాగా use అవుతుంది. ఇది కిచెన్‌లో పొగ, నూనె, వాసన, దుమ్ము వంటి వాటిని తొలగించి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. https://amzn.to/3Lpwzrn

చిమ్ని ఉపయోగాలుChimney For Kitchen :

ప్రస్తుతకాలంలో చిమ్ని అనేది వంటగదిలో తప్పనిసరి వస్తువు అయ్యిపోయింది. ఇది వంటచేసినప్పుడు వంటగదిలో వేడిని బయటకు పంపిస్తుంది.అలాగే వంటచేసి సమయంలో పొగ,నూనె కణాలు , ఇతర దూళికణాల్ని బయటకు పంపిస్తుంది.అయితే దీన్ని నిత్యము మనం వాడడం వలన జిడ్డుగా మారుతుంది .దీని వల్ల చిమ్ని సామర్థ్యం తగ్గిపోతుంది.దీనిని ఎప్పటికిఅప్పడు క్లీన్ చేసికోవాలి లేకపోతె అందులో ఫిల్టర్ పోతుంది అలాగే కిచెన్ మొత్తం ఆయల్ మరకలతో అపరిసుబ్రాంగా కనిపిస్తాయి .

చిమ్నిని శుబ్రపరిసే ముందు దాని స్విచ్ ఆఫ్ చేయాలి.తరువాత చిమ్ని లోని  అన్నిభాగాలను వేరు చేయాలి. చిమ్ని లో ముఖ్యమైన భాగం ఫిల్టర్ ఇందులో ఎక్కువ మురికి వుంటుంది కాబట్టి పిల్టరుని వేరుచేసి డిటర్జెంట్ లేదా వెనిగర్ వేసిన వేడినీటిలో అరగంట చేపు వుంచాలి ఆ తరువాత బ్రష్ తో శుభ్రం చేయాలి.తరువాత నీటితోసుభ్రం చేయాలి మిగిలిన భాగాలను స్పాంజ్ తో శుభ్రం చేయాలి. అన్నిభాగాలను ఎండలో ఎండబెట్టినాక అమర్చాలి .

చిమ్నీ నిర్వహణ చిట్కాలు:

ఫిల్టర్‌ను నెలకు కనీసం ఒకసారి శుభ్రం చేయండి.మోటార్ నాయిస్ వస్తే సర్వీస్ చేయించండి.లైట్ లేదా బటన్ పనిచేయకపోతే టెక్నీషియన్‌ను పిలవండి.చిమ్నీపై దుమ్ము పేరుకుండా కవర్ వాడండి.సంవత్సరానికి ఒకసారి సర్వీస్ చేయించండి.
ఇప్పుడు ప్రతి ఆధునిక ఇంట్లో చిమ్నీ ఒక ప్రధాన అవసరం.స్మార్ట్ చిమ్నీలు ఇప్పుడు Wi-Fi ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు.కొన్ని మోడల్స్ మొషన్ సెన్సార్ ద్వారా ఆటోమేటిక్‌గా ఆన్/ఆఫ్ అవుతాయి.సగటున కరెంటు 200–250 వాట్లే వినియోగం ఉంటుంది.వీటి యొక్క జీవితకాలం 10–12 సంవత్సరాల వరకు పనిచేస్తుంది.15 రోజులకు ఒకసారి లేదా నెలకు ఒకసారి చేయాలి.ఆటో క్లీనింగ్ చిమ్నీ తీసికోవాలి ఇది టైమ్ సేవ్ చేస్తుంది మరియు మెయింటెనెన్స్ సులభం చేస్తుంది.

ఆటో క్లీనింగ్ చిమ్నీ అంటే ఏమిటి?

ఆటో క్లీనింగ్ చిమ్నీ లో హీట్ టెక్నాలజీ ఉంటుంది.దీని ద్వారా లోపల పేరుకుపోయిన నూనె కణాలు వేడి కారణంగా కరిగి, ఒక చిన్న కంటైనర్‌లో చేరతాయి.ఫిల్టర్ ఎక్కువకాలం పనిచేస్తుంది.శుభ్రం చేయడం సులభం.సమయం ఆదా అవుతుంది.ఇల్లు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలి అని ప్రతిఒక్కరు కోరుకుంటారు.అందుకే ప్రతివిషయంలో శ్రద్ద తీసికుంటారు కానీ వంటగది విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుంటారు, అలాగే వంటగదికి చాలామంది ప్లేస్ తక్కువ ఉంచుకుంటారు. మోడరన్ గా డిజైన్ చేసికోవాలంటే కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంచవలిసిందే ఎందుకంటే, ప్రస్తుతం వున్నా ట్రెండ్ బట్టి రెఫ్రిజిరేటర్ పెట్టుకోవాలన్న, డిష్ వాషెర్ వాడకం క్రమేపి పెరుగుతుంది అందువలన ప్లేస్ అనేది ఎక్కువ వుండేటట్లు చూసికోవాలి . 

చిమ్నీ ఎలా పనిచేస్తుంది?

Chimney VS Exhaust Fan:

వంట సమయంలో పొగ, ఆవిరి పైకి ఎగురుతుంది.చిమ్నీ హుడ్ ఆ పొగను పీల్చుతుంది.ఫిల్టర్ ద్వారా నూనె కణాలు, దుమ్ము ఫిల్టర్ అవుతాయి.మోటార్ / బ్లోవర్ ఆ గాలిని పీల్చి డక్ట్ ద్వారా బయటకు పంపుతుంది లేదా శుద్ధి చేసి తిరిగి గదిలోకి పంపుతుంది (డక్ట్‌లెస్ మోడల్‌లో).దీంతో గది పరిశుభ్రంగా, చల్లగా, మరియు వాసన లేకుండా ఉంటుంది.

చిమ్నీ రకాలు | Types of Chimneys in Telugu

కిచెన్ చిమ్నీ (Kitchen Chimney)

వంట సమయంలో పొగ, ఆవిరి, నూనె కణాలు బయటకు పంపుతుంది.ఇంటి వంటగదులలో ఎక్కువగా ఉపయోగిస్తారు. 

ఇండస్ట్రియల్ చిమ్నీ (Industrial Chimney)

ఫ్యాక్టరీలలో వాడే పెద్ద చిమ్నీలు.కెమికల్ పొగ, వేడి వాయువులు బయటకు పంపుతాయి.

ఫైర్‌ప్లేస్ చిమ్నీ (Fireplace Chimney)

గృహాలలో ఉన్న ఫైర్‌ప్లేస్‌కి పొగ బయటకు పంపడానికి.పాత ఇళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది.

డక్టెడ్ చిమ్నీ (Ducted Chimney)

పొగను డక్ట్ ద్వారా నేరుగా బయటకు పంపుతుంది.ఎక్కువ వంట చేసే వారికి ఇది సరైన ఎంపిక.

డక్ట్‌లెస్ చిమ్నీ (Ductless Chimney)

పొగను ఫిల్టర్ ద్వారా శుద్ధి చేసి గదిలోకి తిరిగి పంపుతుంది.ఇన్‌స్టాలేషన్ సులభం. చిన్న కిచెన్‌లకు అనువైనది.


డిజైన్ ఆధారంగా చిమ్నీ రకాలు

వాల్ మౌంటెడ్ చిమ్నీ (Wall Mounted)

స్టవ్ గోడకు దగ్గరగా ఉన్నప్పుడు వాడతారు.భారతీయ ఇళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది.

కోర్నర్ మౌంటెడ్ చిమ్నీ (Corner Mounted)

స్టవ్ మూలలో ఉంటే ఉపయోగిస్తారు.

ఇస్లాండ్ చిమ్నీ (Island Chimney)

 స్టవ్ మధ్యలో ఉంటే, చిమ్నీ సీలింగ్ నుండి కిందకు వస్తుంది.ఆధునిక కిచెన్‌లకు అనువైనది.

బిల్ట్-ఇన్ చిమ్నీ (Built-in Chimney)

క్యాబినెట్‌లో దాచిన డిజైన్.చిన్న స్థలానికి సరైనది.

Exhaust fan for kitchen| ఎగ్జాస్ట్ ఫ్యాన్ అంటే ఏమిటి?

Exhaust fan for kitchen:  మన ఇళ్లలో వంట, స్నానం, ఇస్త్రీ, వంటి పనుల వల్ల గదుల్లో పొగ, ఆవిరి, తేమ, దుర్వాసన, గాలి వేడి ఏర్పడుతుంది.ఈ గాలి బయటకు వెళ్లకపోతే గోడలు తడిగా అవుతాయి, పెయింట్ ఊడిపోతుంది, మోల్డ్, ఫంగస్ పెరుగుతాయి.ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారం — ఎగ్జాస్ట్ ఫ్యాన్ (Exit Fan).
ఎగ్జాస్ట్ ఫ్యాన్ కిచెన్ లేదా బాత్రూమ్‌లో ఉన్న పొగ, తేమ, వేడి గాలిని పీల్చి బయటకు పంపుతుంది. దీని వలన గదిలో తాజా గాలి ప్రవాహం ఏర్పడుతుంది, మరియు ఆరోగ్యకరమైన వాతావరణం కలుగుతుంది.https://amzn.to/3L957y5

How to Use in Home?

ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ప్రతీ ఇంటికి అవసరమైన పరికరం.బాత్రూం, కిచెన్, గ్యారేజ్, లేదా లివింగ్ రూం – ఏ ప్రదేశమైనా సరే అవసరం ఉంటుంది. తక్కువ వంటలు అయితే ఎగ్జాస్ట్ ఫ్యాన్ బెటర్. అదే ఎక్కువ వంటలు చేసిన,…కిచెన్ లో కప్బోర్డు వర్క్ చేసినట్లు అయితే చిమ్నీ బెటర్.Exhaust fan for kitchen

ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉపయోగించే ప్రాంతాలు:

కిచెన్ – వంట సమయంలో పొగ, నూనె గాలి, వేడి గాలి తొలగించడానికి……బాత్రూం / టాయిలెట్- తేమ, వాసన, ఫంగస్ నివారణకు……లివింగ్ రూం / బెడ్‌రూం-గాలి ప్రసరణకు…..గ్యారేజ్ / వర్క్‌షాప్- పొగ, కెమికల్ వాసనలు బయటకు పంపేందుకు ఉపయోగపడుతుంది.అవును, తేమ, పొగ, వాసన తొలగించటానికి మరియు గాలి ప్రసరణ కోసం అవసరం.

వాల్ మౌంటెడ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ (Wall Mounted):

వాల్ మౌంటేడ్ అంటే గోడలో ఇన్‌స్టాల్ చేస్తారు(చేయడం). ఎక్కువగా బాత్రూం, కిచెన్‌లలో వాడతారు.సరైన మోడల్ ఎంచుకుంటే మీరు సౌకర్యవంతమైన వాతావరణాన్ని పొందగలరు.మలిన గాలి ని నేరుగా బయటకు పంపుతుంది.

విండో మౌంటెడ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ (Window Mounted):

విండో మౌంటెడ్ అంటే కిటికీ గాజులో అమర్చే ఫ్యాన్.ఇన్‌స్టాలేషన్ సులభం.చిన్న గదులకు అనుకూలం.

సీలింగ్ మౌంటెడ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ (Ceiling Mounted):

ఈ సీలింగ్ మౌంటేడ్ అంటే సీలింగ్‌లో ఫిట్ చేసేది. గాలి డక్ట్ ద్వారా బయటకు వెళ్తుంది.పెద్ద గదులకూ, రెస్టారెంట్‌లకూ సరిపోతుంది.Exhaust fan for kitchen:

డక్ట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ (Duct Type):

పొడవైన పైప్ ద్వారా గాలి బయటకు పంపుతుంది.AC గదులు, ఆఫీసులు, హోటల్ కిచెన్‌లలో వీటిని వాడతారు.

ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇన్‌స్టాలేషన్:Exhaust fan for kitchen:

గదిలో గాలి బయటకు వెళ్ళేలా గోడ లేదా కిటికీ వద్ద ప్రదేశం ఎంచుకోండి.సరైన వోల్టేజ్ (230V) కలిగిన కనెక్షన్ సిద్ధం చేయండి.గోడలో ఫ్యాన్ సైజు కంటే కొద్దిగా పెద్ద రంధ్రం త్రవ్వండి.ఫ్యాన్‌ను బ్రాకెట్లతో బలంగా ఫిక్స్ చేయండి.పవర్ లైన్ కనెక్ట్ చేసి, టెస్టింగ్ చేయండి. ప్రొఫెషనల్ ఎలక్ట్రిషియన్ ద్వారా ఇన్‌స్టాల్ చేయించుకోవడం మంచిది .

ఎగ్జాస్ట్ ఫ్యాన్ శుభ్రం చేసే విధానం:

Chimney VS Exhaust Fan:

పవర్ ఆఫ్ చేయండి.ఫ్యాన్ కవర్, బ్లేడ్‌లు తీసేయండి.సబ్బు నీటిలో 15 నిమిషాలు ఉంచండి….సాఫ్ట్ బ్రష్‌తో శుభ్రం చేయండి….తుడిచి డ్రై చేయండి.తిరిగి అమర్చండి.సరైన నిర్వహణతో 8–10 సంవత్సరాల వరకు పనిచేస్తుంది.

ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడడంలో జాగ్రత్తలు:

Exhaust fan for kitchen: ఫ్యాన్‌ను నీటితో కడగకండి.ఎక్కువ తేమ ఉన్నప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేయవద్దు.వైర్లను చెడగొట్టవద్దు.పీడకలలు లేదా దుమ్ము పేరుకుండా కవర్ వాడండి.షట్టర్ సిస్టమ్ ఉన్న ఫ్యాన్ తీసుకోండి – ఇది బయట దుమ్ము రాకుండా కాపాడుతుంది.వంట లేదా స్నానం ప్రారంభించే ముందు ఆన్ చేసి, పూర్తయ్యాక 5–10 నిమిషాల పాటు ఆన్‌లో ఉంచాలి.

ఎగ్జాస్ట్ ఫ్యాన్ పరిమాణాలు (Sizes):

బాత్రూం- 8” (200mm) లేదా 10” (250mm)……కిచెన్- 12” (300mm) లేదా 15” (380mm)…..
లివింగ్ రూం- 18” (450mm) లేదా అంతకు పైవి ఉపయోగిస్తారు.

ఎగ్జాస్ట్ ఫ్యాన్ ధరలుExhaust fan for kitchen:

బాత్రూం ఎగ్జాస్ట్ ఫ్యాన్- ₹800 – ₹2,000
కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్- ₹1,500 – ₹3,500
హెవీ డ్యూటీ ఇండస్ట్రియల్ ఫ్యాన్- ₹5,000 – ₹25,000
ఆటో షట్టర్ ఎగ్జాస్ట్ ఫ్యాన్- ₹2,000 – ₹4,000.

ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇన్‌స్టాలేషన్ హైట్:

Exhaust fan for kitchen: కిచెన్- కిచెన్లో స్టవ్‌కి పైన 7 అడుగుల ఎత్తు కి అమర్చాలి 
బాత్రూం-బాత్రూములో  షవర్‌కి పైన 6 అడుగుల ఎత్తు లో ఉండాలి 
లివింగ్ రూం- లివింగ్ రూములో  సీలింగ్‌కి దగ్గరగా అమర్చాలి.

మా construction company సర్వీసెస్ :

*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును . మా phone number  ;7989312152 , 9989456907.