swing for home! ఉయ్యాల వల్ల లాభాలు ఏమిటి?ఉయ్యాల రకాలు?హోమ్ స్వింగ్ ఎందుకు అవసరం?
swing for home:

swing for home: ఉయ్యాలను చూడగానే పిల్లల నుంచి పెద్దవారి దాక ప్రతి ఒక్కరు ఆనందపడతారు.దాన్ని ఉగాలని ఉత్సాహం చూపిస్తారు.చిన్నప్పుడుఅయితే ఈ ముచ్చట తీర్చికోవడానికి వాకిట్లోని చెట్టుకో,ఇంటి దూలానికో తాడు కట్టించుకొని ఆడుకొనేవారు.ప్రస్తుతం వినియోగదారుల అభిరుషిలని,సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో రకాల ఉయ్యాలలు ఫర్నిచర్ షాపుల్లో కొలువుతీరాయ్.ఇవి కేవలం మన సరదా తీర్షికోవడమే కాదు.ఇంటికే కొత్త అందాన్ని తీసికొస్తున్నాయ్.ప్రస్తుతం ఉయ్యాలను చెక్కతో కాకుండా ఫాబ్రిక్,కేన్ వంటి పలు రకాల మెటీరియల్ తో తయారుచేస్తున్నారు.కూర్చోవడానికి సౌకార్యాయంగా ఉండాలంటే వాటిపై సోఫాసెట్ మాదిరిగా మెత్తటి కుషన్స్ అమర్చితే చూడడానికి కూడా ఆకర్షిణీయంగా కనిపిస్తాయి.వీటిలో అనేక రకాలు ఉన్నాయి.కేవలం ఒక్కరే ఊగేలా ఉండేవాటితో పాటు,ఉయ్యాలా బళ్లతో పాటు వెనకవైపు ఒరిగి కూర్చోవడానికి వీలుగా రెండు పక్కలకు రెండు హ్యాండిల్స్ ఉండేలా తయారుచేస్తున్నారు.దింతో ఈ రకం ఉయ్యాలలు మరింత సౌకర్యవంతంగా ఉంటున్నాయి.అలాగే ఈ ఉయ్యాలలు పరిమాణాన్ని బట్టి వీటిలో నలుగురు కూర్చోవడానికి వీలుగా ఉంటున్నాయి.ఇవే కాకుండా రౌండ్‌గా పరుపులా వచ్చే ఉయ్యాలలు కూడా ఉన్నాయ్.వీటిలో సౌకర్యవంతంగా పడుకోవడానికి వీలు ఉంటుంది.
ఉయ్యాల వల్ల ఉపయోగం:
మనసుకు ప్రశాంతత కలుగుతుంది
ఒత్తిడి తగ్గుతుంది
పిల్లలకు వినోదం
ఇంటి అందం పెరుగుతుంది
రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది..
తెలుగు సంస్కృతిలో ఉయ్యాల:swing for home
తెలుగు జానపద గీతాల్లో, సినిమాల్లో ఉయ్యాలకి ప్రత్యేక స్థానం ఉంది. “ఉయ్యాల జంపాల” వంటి పదాలు చాలా ప్రసిద్ధి. శ్రీకృష్ణుడిని కూడా ఉయ్యాలలో ఊపే సంప్రదాయం ఉంది.శ్రావణ మాసంలో గ్రామాల్లో అమ్మాయిలు చెట్లకు ఉయ్యాలలు కట్టి పాటలు పాడుతూ ఊగడం ఒక ఆనందమైన సంప్రదాయం.ఉయ్యాల అనేది ఆనందం, ఆరామం మరియు సంప్రదాయానికి ప్రతీక. చిన్నపిల్లల ఆట నుండి పెద్దల విశ్రాంతి వరకు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుంది. ఆధునిక కాలంలో కూడా ఉయ్యాలలు ఇంటి అందాన్ని పెంచే ముఖ్యమైన ఫర్నిచర్‌గా మారాయి.
హోమ్ స్వింగ్ అంటే ఏమిటి/swing for home?
హోమ్ స్వింగ్ అనేది ఇంట్లో విశ్రాంతి కోసం ఉపయోగించే ఊయల తరహా సీటింగ్ వ్యవస్థ. ఇది పైకప్పు నుంచి గొలుసులతో వేలాడదీసే విధంగా లేదా స్టాండ్‌తో తయారు చేస్తారు. కొంతమంది దీనిని బాల్కనీ, హాల్, గార్డెన్ లేదా టెర్రస్‌లో ఉంచుతారు.ఇది కేవలం కూర్చునే వస్తువు మాత్రమే కాదు..ఇంటి డెకరేషన్లో కూడా ముఖ్యమైన భాగంగా మారింది. స్వింగ్‌పై కూర్చుని పుస్తకం చదవడం, టీ తాగడం లేదా రిలాక్స్ అవ్వడం చాలా మందికి ఇష్టం.ఇప్పటి వేగవంతమైన జీవితంలో ప్రతి ఒక్కరికీ కొంత రిలాక్స్ టైమ్ అవసరం. అలాంటి సమయంలో స్వింగ్ మనసుకు ప్రశాంతత ఇస్తుంది.ఇంటికి స్టైలిష్ లుక్ వస్తుంది..రిలాక్సేషన్ కోసం ఉపయోగపడుతుంది..పిల్లలకు వినోదంన్నీ ఇస్తుంది.పెద్దవారికి ఒత్తిడిని తగ్గిస్తుంది..కుటుంబ సభ్యులు కలిసి కూర్చునేందుకు బాగుంటుంది..బాల్కనీ లేదా గార్డెన్ అందాన్ని పెంచుతుంది.
home swing types:swing for home
చెక్క స్వింగ్:
చెక్కతో తయారయ్యే ఊయలలు చాలా క్లాసిక్ లుక్ ఇస్తాయి. సంప్రదాయ మరియు మోడ్రన్ డిజైన్లలో అందుబాటులో ఉంటాయి.ఇవి బలంగా ఉంటాయి.ఎక్కువకాలం మన్నుతాయి.లగ్జరీ లుక్ ఇస్తాయి.అయితే కొంచెం ధర ఎక్కువ మరియు బరువు ఎక్కువ.నీరు ఎక్కువగా తగలకుండా జాగ్రత్త వహించాలి.అప్పుడు అప్పుడు పాలిష్ చేయాలి.
మెటల్ స్వింగ్:
ఇవి స్టీల్ లేదా ఐరన్‌తో తయారు చేస్తారు. ఆధునిక ఇళ్లలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తున్నారు.తక్కువ ధర ఉంటుంది.స్టైలిష్ డిజైన్లు కలిగివుంటుంది.వీటి నిర్వహణ సులభం.తుప్పు వచ్చే అవకాశం ఎక్కువ.అలాగే ఎక్కువ బరువు ఉంటుంది మోయలేకపోవచ్చు.తుప్పు రాకుండా జాగ్రత్త వహించాలి అలాగే క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.
రాటన్ లేదా కేన్ స్వింగ్:
ఇవి చాలా ట్రెండీగా ఉంటాయి. బాల్కనీ లేదా గార్డెన్ కోసం ఇవి బాగా సరిపోతాయి. అందమైన డిజైన్ కలిగి ఉంటుంది.తేలికగా ఉంటాయి.కంఫర్ట్ ఎక్కువ.అయితే ఎక్కువ బరువుకు అనుకూలం కాదు కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించాలి.
ఎగ్ స్వింగ్:
ఇది ప్రస్తుతం చాలా ట్రెండింగ్‌లో ఉన్న మోడల్. గుడ్డు ఆకారంలో ఉండే ఈ స్వింగ్ యువతకు బాగా నచ్చుతుంది.మోడ్రన్ లుక్ ఉంటుంది.ఫోటోలకు దిగేందుకు బాగుంటుంది.రిలాక్స్ ఫీలింగ్‌ని ఇస్తుంది.
హ్యాంగింగ్ చైర్ స్వింగ్/swing for home:
ఒక్క వ్యక్తి కూర్చునేందుకు ఉపయోగించే చిన్న స్వింగ్. చిన్న ఇళ్లకు ఇది బెస్ట్.
ఇండోర్ స్వింగ్ vs అవుట్డోర్ స్వింగ్
అంశం ఇండోర్ స్వింగ్ అవుట్డోర్ స్వింగ్
ఉపయోగం హాల్, బెడ్రూమ్ గార్డెన్, బాల్కనీ
మెటీరియల్ చెక్క, ఫాబ్రిక్ మెటల్, రాటన్
వాతావరణ ప్రభావం తక్కువ ఎక్కువ
డిజైన్ ఎలిగెంట్ స్ట్రాంగ్
ఇంట్లో స్వింగ్ ఎక్కడ అయితే బాగుంటుంది:
హాల్లో చెక్క స్వింగ్ పెట్టితే ఇంటికి రాయల్ లుక్ వస్తుంది.అదే బాల్కనీలో అయితే టీ లేదా కాఫీ తాగుతూ రిలాక్స్ కావడానికి బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు.అదే గార్డెన్లోప్రకృతి మధ్యలో కూర్చోవడానికి అందాలను అసర్వదించడానికి బాగుంటుంది .టెర్రస్ అయితే సాయంత్రం టైం లో గాలి ఆస్వాదించడానికి ఉపయోగపడుతుంది.
హోమ్ స్వింగ్ ధరలు:
స్వింగ్ ధరలు మెటీరియల్ మరియు డిజైన్ ఆధారంగా మారుతాయి.
స్వింగ్ రకం ధర
చిన్న హ్యాంగింగ్ స్వింగ్ ₹3,000 – ₹8,000
మెటల్ స్వింగ్ ₹8,000 – ₹20,000
చెక్క స్వింగ్ ₹15,000 – ₹60,000
ఎగ్ స్వింగ్ ₹10,000 – ₹30,000
లగ్జరీ స్వింగ్ ₹50,000 పైగా ఉంటుంది.
చిన్న ఇళ్లకు ఏ స్వింగ్ బెస్ట్?
చిన్న ఇళ్లలో పెద్ద ఊయలలు పెట్టడం కష్టం. అలాంటి సందర్భంలో..హ్యాంగింగ్ చైర్..ఫోల్డబుల్ స్వింగ్..సింగిల్ ఎగ్ స్వింగ్.వంటి మోడల్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
పిల్లల కోసం స్వింగ్:
పిల్లలకు ఊయల అంటే చాలా ఇష్టం. కానీ భద్రత చాలా ముఖ్యం.కాబట్టి సాఫ్ట్ కుషన్స్ ఉండాలి..పదునైన భాగాలు ఉండకూడదు..స్ట్రాంగ్ రోప్స్ లేదా గొలుసులు ఉండాలి.
వృద్ధుల కోసం స్వింగ్:
వృద్ధులకు స్వింగ్ చాలా రిలాక్స్ ఫీలింగ్ ఇస్తుంది. అయితే బ్యాక్ సపోర్ట్ ఉండాలి..ఎత్తు తక్కువగా ఉండాలి..సులభంగా కూర్చునే విధంగా ఉండాలి ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి.
హోమ్ డెకర్‌లో స్వింగ్ పాత్ర:
ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్‌లో స్వింగ్ ఒక ట్రెండ్‌గా మారింది. సరైన డిజైన్ ఎంపిక చేస్తే ఇంటి అందం మరింత పెరుగుతుంది.
డెకరేషన్ ఐడియాలు:
ఫెయిరీ లైట్స్
రంగురంగుల కుషన్స్
చిన్న చిన్న మొక్కలు
వుడ్ బ్యాక్‌డ్రాప్..ఇవి ఉపయోగిస్తే స్వింగ్ ప్రాంతం చాలా అందంగా కనిపిస్తుంది.
ఆన్లైన్లో స్వింగ్ కొనవచ్చా:
ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో ఫర్నిచర్ కొనుగోలు చేస్తున్నారు.ఎందుకుఅంటే ఎక్కువ డిజైన్లు ఉంటాయి.మంచి మంచి డిస్కౌంట్లు…ఇంటికే డెలివరీ వస్తుంది అయితే కొన్ని జాగ్రత్తలు పాటించాలి అవి ఏంటి అంటే రివ్యూలు చదవాలి..వారంటీ ఉందో లేదో చూడాలి..మెటీరియల్ వివరాలు తెలుసుకోవాలి..

హోమ్ స్వింగ్ ట్రెండ్స్ 2026:https://amzn.to/3R3aaTP
ప్రస్తుతం మార్కెట్లో కొన్ని ట్రెండింగ్ మోడల్స్:
మినిమలిస్టిక్ స్వింగ్స్
ఎగ్ చైర్ స్వింగ్స్
LED లైట్ స్వింగ్స్
బోహో స్టైల్ స్వింగ్స్
మాక్రేమే స్వింగ్స్….పండుగల సమయంలో లేదా ఆన్లైన్ సేల్ సమయంలో కొనుగోలు చేస్తే మంచి ఆఫర్లు లభిస్తాయి.దసరా సేల్..దీపావళి సేల్..న్యూ ఇయర్ ఆఫర్లు..ఆన్లైన్ ఫెస్టివల్ సేల్స్.https://impresshomedesigners.com/inverter-ac-vs-non-inverter-ac/?preview_id
my services:
*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును..my whatsup no ;7989312152
