Real Estate Investing Tips? రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ప్రయోజనాలు?రియల్ ఎస్టేట్ లో పెట్టుబడితో భవిష్యత్తును సురక్షితం చేసుకోండి!
Real Estate Investing Tips:
Real Estate Investing Tips: ఈ పెట్టుబడుల ప్రపంచంలో రియల్ ఎస్టేట్ ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుంది. బంగారం, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడులతో పోలిస్తే రియల్ ఎస్టేట్ స్థిరమైన ఆస్తిగా పరిగణించబడుతుంది. కాలక్రమేణా భూమి మరియు ఆస్తుల విలువ పెరగడం వల్ల పెట్టుబడిదారులు మంచి లాభాలను పొందగలుగుతారు.ప్రస్తుతం భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో భూములు మరియు గృహాలపై డిమాండ్ పెరుగుతోంది. అయితే సరైన అవగాహన లేకుండా పెట్టుబడి పెడితే నష్టాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు సరైన ప్రణాళికతో చేస్తే సంపద సృష్టించడానికి అత్యుత్తమ మార్గాలలో ఒకటి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మార్కెట్‌ను విశ్లేషించడం, సరైన లొకేషన్‌ను ఎంపిక చేయడం, చట్టపరమైన పత్రాలను ధృవీకరించడం మరియు దీర్ఘకాలిక దృష్టితో ముందుకు సాగడం చాలా ముఖ్యం.https://amzn.to/3S1yTZ3
పెట్టుబడి లక్ష్యాన్ని నిర్ణయించుకోండి:
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టే ముందు మీ లక్ష్యం ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి.దీర్ఘకాలిక పెట్టుబడా?నెలవారీ అద్దె ఆదాయం కోసమా?భూమి విలువ పెరిగిన తర్వాత అమ్మాలనుకుంటున్నారా?భవిష్యత్తులో ఇంటి నిర్మాణం కోసమా?మీ లక్ష్యాన్ని బట్టి మీరు ఎలాంటి ఆస్తిని కొనుగోలు చేయాలో నిర్ణయించుకోవచ్చు.

సరైన లొకేషన్‌ను ఎంచుకోండి:Real Estate Investing Tips:
రియల్ ఎస్టేట్‌లో “లొకేషన్” అత్యంత ముఖ్యమైన అంశం అని చెప్పవచ్చు .మంచి లొకేషన్లో ఉన్న ఆస్తులు భవిష్యత్తులో వేగంగా విలువ పెరుగుతాయి. అందువల్ల అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కొనుగోలు చేయడం ద్వారా ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది.
*ప్రధాన రహదారులకు దగ్గరగా ఉందా?లేదా
*విద్యాసంస్థలు ఉన్నాయా?
*ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయా?
*రైల్వే స్టేషన్ లేదా ఎయిర్‌పోర్ట్‌కు సమీపమా?
*అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయా? ఇవన్నీ ఫ్యూచర్ గ్రోతింగ్ చాల అవసరం.
మార్కెట్ రీసెర్చ్ చేయండి:Real Estate Investing Tips:
పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి.మార్కెట్ ట్రెండ్‌ను అర్థం చేసుకుని పెట్టుబడి పెడితే రిస్క్ తగ్గుతుంది.ముక్యంగా ఈ విషయాలను పరిశీలించకోవాలి. గత 5 సంవత్సరాల ధరలు.ప్రస్తుత ఇప్పుడున్న మార్కెట్ విలువ.అలాగే భవిష్యత్తు లో ఆ ప్రాంతంలో అభివృద్ధి అవకాశాలు ఎంతమేరకు వున్నాయ్.ఆ ప్రాంతంలో డిమాండ్ ఎంత వుంది.
చట్టపరమైన పత్రాలను పరిశీలించండి:
భూమి లేదా ప్లాట్ కొనుగోలు చేసే ముందు అన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి.అవసరమైతే న్యాయవాది సహాయం తీసుకోవడం మంచిది.
తప్పనిసరిగా చెక్ చేయాల్సిన పత్రాలు:
*టైటిల్ డీడ్
*ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్
*లేఅవుట్ అనుమతులు
*RERA నమోదు
*పన్ను రసీదులుచట్టపరమైన పత్రాలను పరిశీలించండి
RERA ఆమోదం పొందిన ప్రాజెక్టులను ఎంచుకోండి:
RERA (Real Estate Regulatory Authority) నమోదు ఉన్న ప్రాజెక్టులు పెట్టుబడిదారులకు ఎక్కువ భద్రతను అందిస్తాయి.
ప్రయోజనాలు:
*పారదర్శకత
*సమయానికి ప్రాజెక్ట్ పూర్తి
*మోసాల నుండి రక్షణ
*చట్టపరమైన భద్రత కలిగి ఉంటుంది కాబట్టి RERA ఆమోదం ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వండి.
బడ్జెట్‌ను సరిగ్గా ప్లాన్ చేయండి/Real Estate Investing Tips:
చాలామంది పెట్టుబడిదారులు తమ ఆర్థిక స్థోమతకు మించి పెట్టుబడులు పెడతారు.ఇది భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడికి కారణమవుతుంది.బడ్జెట్ ప్లానింగ్‌లో వీటిని పరిగణనలోకి తీసుకోవాలి
*డౌన్ పేమెంట్
*రిజిస్ట్రేషన్ ఛార్జీలు
*స్టాంప్ డ్యూటీ
*మెయింటెనెన్స్ ఖర్చులు
*లోన్ EMIలు
బ్యాంకు లోన్ ను పరిశీలించండి/Real Estate Investing Tips:
హోమ్ లోన్ లేదా ప్లాట్ లోన్ తీసుకునే ముందు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చండి.తక్కువ వడ్డీ ఉన్న లోన్ ఎంపిక చేయడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది.చూడవలసిన అంశాలు
*వడ్డీ రేటు
*ప్రాసెసింగ్ ఫీజు
*లోన్ కాలపరిమితి
*ముందస్తు చెల్లింపు ఛార్జీలు

భవిష్యత్తు అభివృద్ధిని అంచనా వేయండి/Real Estate Investing Tips:
భవిష్యత్తులో అభివృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించడం విజయవంతమైన పెట్టుబడిదారుల లక్షణం.ఉదాహరణకు
*కొత్త ఎయిర్‌పోర్టులు
*ఇండస్ట్రియల్ కారిడార్లు
*ఐటీ పార్కులు
*పోర్టులు
*మెట్రో ప్రాజెక్టులు
*వంటి ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాల్లో భూమి విలువ వేగంగా పెరుగుతుంది.చాలామంది స్నేహితులు లేదా బంధువుల మాటలు విని పెట్టుబడి పెడతారు.కానీ నిర్ణయం తీసుకునే ముందు.మార్కెట్ విశ్లేషణ.రిస్క్ అంచనా.లాభాల అంచనా.వీటి అన్నిటిని పరిశీలించాలి.
అద్దె ఆదాయం అవకాశాలను పరిశీలించండి:https://amzn.to/3S1yTZ3
అపార్ట్మెంట్ లేదా కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేస్తే అద్దె ద్వారా నెలవారీ ఆదాయం పొందవచ్చు.అద్దె పెట్టుబడికి అనుకూలమైన ప్రాంతాలు.
*ఐటీ హబ్‌లు
*విద్యాసంస్థల ప్రాంతాలు
*నగర కేంద్రాలు
*పరిశ్రమల సమీప ప్రాంతాలు.మొత్తం డబ్బును ఒకే ప్రాపర్టీలో పెట్టవద్దు.డైవర్సిఫికేషన్ చాలా ముఖ్యం.ఉదాహరణకు
*ఒక ప్లాట్
*ఒక అపార్ట్మెంట్
*ఒక కమర్షియల్ ప్రాపర్టీ.ఇలా విభజించడం ద్వారా రిస్క్ తగ్గుతుంది.
ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ చేయండి:https://amzn.to/3S1yTZ3
కొనుగోలు ముందు తప్పనిసరిగా ప్రాపర్టీని సందర్శించాలి.చూడవలసిన అంశాలు
*రోడ్డు సౌకర్యం
*నీటి వసతి
*విద్యుత్ సౌకర్యం
*డ్రైనేజ్
*పరిసర ప్రాంత అభివృద్ధి.ఫోటోలు చూసి నిర్ణయం తీసుకోవద్దు.
రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ప్రయోజనాలు:
1. స్థిరమైన ఆస్తి
భూమి ఎప్పటికీ(భూమి విలువ ఎప్పటికి స్థిరంగా ఉంటుంది) విలువైన ఆస్తిగా ఉంటుంది.
2. విలువ పెరుగుదల
కాలక్రమేణా ఆస్తి ధరలు పెరుగుతాయి.
3. అద్దె ఆదాయం
నెలవారీ పాసివ్ ఇన్కమ్ పొందవచ్చు.
4. ద్రవ్యోల్బణానికి రక్షణ
ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఆస్తి విలువ కూడా పెరుగుతుంది.
5. వారసత్వ సంపద
భవిష్యత్తు తరాలకు విలువైన ఆస్తిని అందించవచ్చు.

గమనిక:
*రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు పట్ల జాగ్రత్తవహించాలి.చౌక ధరలకు మోసపోవద్దు.
నమ్మకమైన డెవలపర్లను ఎంచుకోండి.అడ్వాన్స్ చెల్లించే ముందు పరిశీలించండి.
*నిపుణుల సలహాలు తీసుకోండి.రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు, న్యాయవాదులు, ఆర్థిక సలహాదారుల సూచనలు తీసుకోవడం మంచిది.వారి అనుభవం వల్ల సరైన నిర్ణయం తీసుకోవచ్చు.
*దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి పెట్టండి.రియల్ ఎస్టేట్‌లో ఒక్క రాత్రిలోనే భారీ లాభాలు రావు.సాధారణంగా .5 నుండి 10 సంవత్సరాలు..10 నుండి 15 సంవత్సరాలు పట్టవచ్చు.కాబట్టి దీర్ఘకాలం వేచి ఉంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.
Why is RERA Registration important:
రియల్ ఎస్టేట్ పనులు , కన్స్ట్రక్షన్ పనులు కానివ్వండి,ఫ్లాట్స్, లేఔట్స్ ,విల్లాస్ కానివ్వండి వీటిన్నిటికి ఒక act తీసికోవచ్చింది “సెంట్రల్ గవర్నమెంట్” ఇది 2016 ఆమోదం పొందింది (మార్చి ) కానీ మే 2017 నుంచి ఇంప్లిమెంటు చేసారు.రియల్ ఎస్టేటుకి సంబంధించి ఆక్టివిటీ చేయాలంటే వీటిలో మెంబెర్ అయివుండాలి. ఎవరైనా తీసికోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసికోవచ్చు .ప్రతి బిల్డర్ ప్రతి దేవలోపెర్ ఎవరైనా సరే RERA లో రెజిస్ట్రేషన్ అయి వుంటేనే ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ తీసికోవాలి అప్రూవల్ రావాలంటే రేరా అనేది ఉండాలి. ప్రతి స్టేటుకి (state) రేరా వెబ్సైట్ ఉంటుంది. వీటి ముఖ్యఉద్దేశం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టేవారిని మోసాలనుంచి రక్షించడం .తప్పుడు సమాసారం ఇచ్చినట్లుఅయితే చట్టపరమయినా యాక్షన్ తీసికుంటారు .
వివరణ :
రేరాని తెలుగులో “స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థ” అనికూడా అంటారు రేరా అనేది రియల్ ఎస్టేట్ నియంత్రణ ఆబిరుది చట్టం ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన నియంత్రణ చట్టం . రేరా రాకముందు ప్రతి బిల్డర్ వారికీ ఇష్టం వచ్చినట్లు కట్టేవారు(ఒకటి చెప్పి ఇంకొకటి కట్టేవారు ) వీటివల్ల ప్రాజెక్ట్స్ ఆగిపోవడం చాల కంప్లైంట్స్ వచ్చేవి చాల గొడవలు జరిగేవి చాల మోసాలు జరిగేవి ఇవన్నీ కట్టడిచేయడానికి కేంద్రప్రభుత్వం 2016 ఈచట్టం తీసికొనివచ్చింది ఇప్పుడు తప్పుదారి పెట్టేంచే క్లెయిమ్స్ తగ్గించబడ్డాయి ఈజీగా కొంటున్నారు ఇన్వెస్ట్ చేస్తున్నారు .
రేరా ఉపయోగాలు :
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్సకతను పెంచడం, ఇంటికొనొగోలుదారులు హక్కులను కాపాడడం , రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి అయ్యేలా చూడడం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించడం వివాదాలు వేగంగా పరిష్కరించడం రేరా చట్టం గృహ కొనుగోలు దారులు మరియు రియల్ ఎస్టేట్ దేవలోపేర్స్ హక్కుల్ని రక్షిస్తుంది .
ఈ చట్టంద్వారా దేవలోపేర్స్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను నమోదు చేసికోవాలిసి ఉంటుంది తద్వారా కొనుగోలుదారులకు project గురించి పూర్తి సమాసారం లభిస్తుంది మరియు ప్రాజెక్ట్ పూర్తి అయ్యేవరకు వారి హక్కులను రక్షింపబడతాయ్.
రేరా ప్రాజెక్ట్ రెజిస్ట్రేషన్ :
ప్రతి ప్రాజెక్టు రేరాలో రిజిస్టర్ అయివుండాలి, ప్రాజెక్ట్ రేరాలో రిజిస్టర్ అవ్వాలంటే 500sqm ల్యాండ్ అయ్యివుండాలి (వీటికంటే ఎక్కువవుండచ్చు తక్కువ ఉండకూడదు) లేదా 8flats అయినా ఉండాలి . ఆల్ రెసిడెన్సియల్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ వీటికంటే తక్కువవుంటే రేరా అవసరం లేదు. alternation చేసే హక్కు బిల్డర్‌కి లేదు buyer పెర్మిషన్ ఉండాలి .
ప్రతి ప్రోజెక్టుదగ్గర display boards ఉండాలి మనంకట్టే ప్రాజెక్ట్ ఏంటి కార్పెట్ ఏరియా ఎంత , ఏఏ స్పెసిలిటీస్ ఇస్తారు , లొకేషన్ ఎక్కడ ఇలా total details display బోర్డు మీద ఉండాలి (తప్పుడు సమాసారం ఇస్తే రేరా రద్దు అయిపోతుంది ). ప్రతి 3months కి ఒకసారి అప్డేట్ ఇవ్వాలి కన్స్ట్రక్షన్ ప్రోజెక్టుకోసం వర్క్ ఎంతవరకు వచ్చింది , ఏమైనా మార్పులు చేర్పులు చేసారా ఏమైనా అప్ప్రోవల్స్ వచ్చాయా డాక్యూమెంటుతో సహా చూపించాలి.
ESCROW ACCOUNT:
బిల్డర్ లేదా ప్రమోటర్ లేదా developer కానివ్వండి buyer కట్టే అమౌంట్ లో 70% escrow account లో వేయాలి దీనివల్ల వేరే ప్రాజెక్టుకి money diverts చేయడం కుదరదు దీనిలో వచ్చిన డబ్బులు ఆ ప్రాజెక్టుకి మాత్రమే ఉపయోగించాలి. వీటిలో డబ్బులు డ్రా చేయాలి అంటే ఇంజీనీర్ మరియు additurs పర్మిషన్ తీసికోవాలి. కార్పేట్ ఏరియా కి మాత్రమే తీసికోవాలి ఎమౌంట్ అంటే నాలుగుగోడలు మధ్యన ఉన్న ఏరియా మనం వాడుతున్న ఏరియా (utility, balcony, common area, కారిడార్ కానీ కార్పేట్ ఏరియా లోకి రావు )
SALE AGREEMENT STANDARDIZATION:
ప్రాజెక్ట్ కాస్ట్ లో 10% మాత్రమే అడ్వాన్స్ తీసికోవాలి 10% దాటకూడదు అలాగే 5years సర్వీస్ చేయాలి ఎటువంటి ప్రాబ్లెమ్ వచ్చిన బిల్డర్ responsibility తీసికోవాలి , మొదటి 5ఇయర్స్ ఉసిత కాస్ట్ సేవల్ని అందించాలి , ఆలస్యం జరిగితే 2% చెల్లించాలి (property cost లో) 120 days లో సమస్యల్నిపరిష్కరించాలి. టైం కి ప్రాజెక్ట్ ఇవ్వకపోతే ఆయినా కట్టిన అమౌంట్ కి నెలకి ఇంట్రెస్ట్ రూపంలో చెల్లించాలి .
ఒకవేల వరదలు తూఫాన్లు మొదలైన ప్రకృతి వైఫల్యాలు వల్ల ప్రాజెక్ట్ డెలివరీ జాప్యం జరిగితే లేదా ముడిసరుకు సరఫరా కొరతకాని కూలీలా కొరతకాని మొదలైనవి వుంటే developer తన తప్పేమి లేదని సమర్ధించుకోవాలి అయితే developer రేరా అథారిటీ కి రాతపూర్వకంగా తెలియజేయాలి అయితే ఆలస్యం అనేది one year కంటే ఎక్కవ ఉండకూడదు
GRIEVANCE REDRESSAL:
వీటిద్వారా కంప్లైంట్ ఇచ్చికుంటారు buyer బిల్డర్ మీద కానీ బిల్డర్ buyer పైన కానీ కేసు ఫైల్ చేసికోవచ్చు 60days లో ప్రాబ్లెమ్ solve అవుతుంది ఒకవేళ clearance రాకపోతే మల్లి అప్పీల్ చేసికోవచ్చు, tribunal court లో సొల్యూషన్ దొరక్కపోతే హైకోర్టు కి వెళ్ళవచ్చు ఇక్కడకూడా సొల్యూషన్ దొరక్కపోతే “సుప్రీంకోర్టు” కి వెళ్ళవచ్చు .

my services: Real Estate Investing Tips:https://impresshomedesigners.com/wp-admin/post.php?post
*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును..my WhatsApp no ;7989312152

