Chimney for kitchen| Chimney అంటే ఏమిటి? How to Use in Kitchen:
Chimney For Kitchen: చిమ్నీ అంటే వేడి గాలి ని బయటకు పంపేది. చిమ్నీ అనేది ఇప్పుడు వున్నా పరిస్థితుల్లో చాల అవసరం అయిపొయింది ఎందుకంటే ఇప్పుడు ప్రతిఒక్కరు cupboard తో కిచెన్ డిజైన్ చేసికుంటున్నారు ఒకరకంగా చెప్పాలి అంటే లుక్ పరంగా బాగుంటుంది అలాగే cupboards అనేవి oil మరకలు పడకుండ కాపాడుతుంది అలాగే stove ఎంత సైజు ఉందొ చిమ్నీ అనేది అంతే సైజు ఉండేటట్లు చూసికోవాలి అలాగే stove కి chimney కి మధ్య distance minimum 30″ ఉండాలి కొంతమంది చిమ్నీ పెట్టుకోకపోతే exit fan పెట్టుకుంటారు. Modular kitchen కీ చిమ్నీ బాగా use అవుతుంది. ఇది కిచెన్‌లో పొగ, నూనె, వాసన, దుమ్ము వంటి వాటిని తొలగించి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. https://amzn.to/3Lpwzrn
చిమ్ని ఉపయోగాలుChimney For Kitchen :
ప్రస్తుతకాలంలో చిమ్ని అనేది వంటగదిలో తప్పనిసరి వస్తువు అయ్యిపోయింది. ఇది వంటచేసినప్పుడు వంటగదిలో వేడిని బయటకు పంపిస్తుంది.అలాగే వంటచేసి సమయంలో పొగ,నూనె కణాలు , ఇతర దూళికణాల్ని బయటకు పంపిస్తుంది.అయితే దీన్ని నిత్యము మనం వాడడం వలన జిడ్డుగా మారుతుంది .దీని వల్ల చిమ్ని సామర్థ్యం తగ్గిపోతుంది.దీనిని ఎప్పటికిఅప్పడు క్లీన్ చేసికోవాలి లేకపోతె అందులో ఫిల్టర్ పోతుంది అలాగే కిచెన్ మొత్తం ఆయల్ మరకలతో అపరిసుబ్రాంగా కనిపిస్తాయి .
చిమ్నిని శుబ్రపరిసే ముందు దాని స్విచ్ ఆఫ్ చేయాలి.తరువాత చిమ్ని లోని అన్నిభాగాలను వేరు చేయాలి. చిమ్ని లో ముఖ్యమైన భాగం ఫిల్టర్ ఇందులో ఎక్కువ మురికి వుంటుంది కాబట్టి పిల్టరుని వేరుచేసి డిటర్జెంట్ లేదా వెనిగర్ వేసిన వేడినీటిలో అరగంట చేపు వుంచాలి ఆ తరువాత బ్రష్ తో శుభ్రం చేయాలి.తరువాత నీటితోసుభ్రం చేయాలి మిగిలిన భాగాలను స్పాంజ్ తో శుభ్రం చేయాలి. అన్నిభాగాలను ఎండలో ఎండబెట్టినాక అమర్చాలి .
కిచెన్ జాగ్రత్తలు :
కిచెన్‌ని ఎప్పటికప్పుడు పరిశుబ్రాంగా వుంచుకోవాలి, పరిశుబ్రాంగా లేకపోతె అనారోగ్యం పాలయ్యే ప్రమాదం వుంది.ఈగలు, దోమలు, బొద్దింకలు,ఇతర సూక్మజీవులు వంటఇంటిలో చేరకుండా తగిన జాగ్రత్తలు తీసికోవాలి
వంటిళ్ళు ఎప్పుడు పొడిగా, శుభ్రాంగా ఉండేటట్లు చూసికోవాలి ముక్యంగా సింక్ లో ఎక్కువ క్రిములు చేరే అవకాశం వుంది కాబట్టి సింక్ క్లీన్ చేసినాక యాంటీ బాక్టీరియా స్ప్రే ని సింక్ లో చల్లాలి అలాగే గిన్నులు శుభ్రం చేసే స్పాంజ్ లను కూడా ఎప్పటికి అప్పుడు శుభ్రం చేసికోవాలి అలాగే ఎప్పడికి అప్పుడు మారుస్తుండాలి .
చిమ్నీ నిర్వహణ చిట్కాలు:
ఫిల్టర్‌ను నెలకు కనీసం ఒకసారి శుభ్రం చేయండి.మోటార్ నాయిస్ వస్తే సర్వీస్ చేయించండి.లైట్ లేదా బటన్ పనిచేయకపోతే టెక్నీషియన్‌ను పిలవండి.చిమ్నీపై దుమ్ము పేరుకుండా కవర్ వాడండి.సంవత్సరానికి ఒకసారి సర్వీస్ చేయించండి.
ఇప్పుడు ప్రతి ఆధునిక ఇంట్లో చిమ్నీ ఒక ప్రధాన అవసరం.స్మార్ట్ చిమ్నీలు ఇప్పుడు Wi-Fi ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు.కొన్ని మోడల్స్ మొషన్ సెన్సార్ ద్వారా ఆటోమేటిక్‌గా ఆన్/ఆఫ్ అవుతాయి.సగటున కరెంటు 200–250 వాట్లే వినియోగం ఉంటుంది.వీటి యొక్క జీవితకాలం 10–12 సంవత్సరాల వరకు పనిచేస్తుంది.15 రోజులకు ఒకసారి లేదా నెలకు ఒకసారి చేయాలి.ఆటో క్లీనింగ్ చిమ్నీ తీసికోవాలి ఇది టైమ్ సేవ్ చేస్తుంది మరియు మెయింటెనెన్స్ సులభం చేస్తుంది.
ఆటో క్లీనింగ్ చిమ్నీ అంటే ఏమిటి?
ఆటో క్లీనింగ్ చిమ్నీ లో హీట్ టెక్నాలజీ ఉంటుంది.దీని ద్వారా లోపల పేరుకుపోయిన నూనె కణాలు వేడి కారణంగా కరిగి, ఒక చిన్న కంటైనర్‌లో చేరతాయి.ఫిల్టర్ ఎక్కువకాలం పనిచేస్తుంది.శుభ్రం చేయడం సులభం.సమయం ఆదా అవుతుంది.ఇల్లు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలి అని ప్రతిఒక్కరు కోరుకుంటారు.అందుకే ప్రతివిషయంలో శ్రద్ద తీసికుంటారు కానీ వంటగది విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుంటారు, అలాగే వంటగదికి చాలామంది ప్లేస్ తక్కువ ఉంచుకుంటారు. మోడరన్ గా డిజైన్ చేసికోవాలంటే కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంచవలిసిందే ఎందుకంటే, ప్రస్తుతం వున్నా ట్రెండ్ బట్టి రెఫ్రిజిరేటర్ పెట్టుకోవాలన్న, డిష్ వాషెర్ వాడకం క్రమేపి పెరుగుతుంది అందువలన ప్లేస్ అనేది ఎక్కువ వుండేటట్లు చూసికోవాలి .
చిమ్నీ ఎలా పనిచేస్తుంది?Chimney For Kitchen:
వంట సమయంలో పొగ, ఆవిరి పైకి ఎగురుతుంది.చిమ్నీ హుడ్ ఆ పొగను పీల్చుతుంది.ఫిల్టర్ ద్వారా నూనె కణాలు, దుమ్ము ఫిల్టర్ అవుతాయి.మోటార్ / బ్లోవర్ ఆ గాలిని పీల్చి డక్ట్ ద్వారా బయటకు పంపుతుంది లేదా శుద్ధి చేసి తిరిగి గదిలోకి పంపుతుంది (డక్ట్‌లెస్ మోడల్లో).దీంతో గది పరిశుభ్రంగా, చల్లగా, మరియు వాసన లేకుండా ఉంటుంది.
చిమ్నీ రకాలు | Types of Chimneys in Telugu
కిచెన్ చిమ్నీ (Kitchen Chimney)
వంట సమయంలో పొగ, ఆవిరి, నూనె కణాలు బయటకు పంపుతుంది.ఇంటి వంటగదులలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఇండస్ట్రియల్ చిమ్నీ (Industrial Chimney)
ఫ్యాక్టరీలలో వాడే పెద్ద చిమ్నీలు.కెమికల్ పొగ, వేడి వాయువులు బయటకు పంపుతాయి.
ఫైర్‌ప్లేస్ చిమ్నీ (Fireplace Chimney)
గృహాలలో ఉన్న ఫైర్ప్లేస్కి పొగ బయటకు పంపడానికి.పాత ఇళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది.
డక్టెడ్ చిమ్నీ (Ducted Chimney)
పొగను డక్ట్ ద్వారా నేరుగా బయటకు పంపుతుంది.ఎక్కువ వంట చేసే వారికి ఇది సరైన ఎంపిక.
డక్ట్‌లెస్ చిమ్నీ (Ductless Chimney)
పొగను ఫిల్టర్ ద్వారా శుద్ధి చేసి గదిలోకి తిరిగి పంపుతుంది.ఇన్స్టాలేషన్ సులభం. చిన్న కిచెన్లకు అనువైనది.
డిజైన్ ఆధారంగా చిమ్నీ రకాలు
వాల్ మౌంటెడ్ చిమ్నీ (Wall Mounted)
స్టవ్ గోడకు దగ్గరగా ఉన్నప్పుడు వాడతారు.భారతీయ ఇళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది.
కోర్నర్ మౌంటెడ్ చిమ్నీ (Corner Mounted)
స్టవ్ మూలలో ఉంటే ఉపయోగిస్తారు.
ఇస్లాండ్ చిమ్నీ (Island Chimney)
స్టవ్ మధ్యలో ఉంటే, చిమ్నీ సీలింగ్ నుండి కిందకు వస్తుంది.ఆధునిక కిచెన్లకు అనువైనది.
బిల్ట్-ఇన్ చిమ్నీ (Built-in Chimney)
క్యాబినెట్లో దాచిన డిజైన్.చిన్న స్థలానికి సరైనది.
Modular kitchen Design Ideas:
మనం కట్టుకున్న ఇంటికి కిచెన్ ఎంత బాగుంటే మన ఇంటి ఆడవారు అంతే ఆనందంగా అంతే సరదాగా వుంటారు ఎందుకు అంటే ఇంటిలో లేడీస్ ఎక్కవ టైం స్పెండ్ చేసిది కిచెన్ లో నే కాబట్టి అందువలన కిచెన్ ఎంత బాగుంటే అంతే సరదా గ వంటగదిలో వుంటారు మనకు వంటలు కూడా బాగా చేసి పెడతారు.అలాగే ఇంటికి ముఖ్యమైన ది కూడా వంటగది. ఏవరైనా ఇల్లు చూడడానికి వచ్చినా ముందుగా చూసేది కిచెన్.కిచెన్ బాగుంటే ఇల్లు బాగుంది అనే ఫీలింగ్ లో వుంటారు .
ముందుగా కిచెన్ room size అనేది minimum 5′ *7′(5 అడుగులు వెడల్పు* 7అడుగులు పొడవు ) ఉండాలి maximum అనేది మన ఇష్టం అలాగే కిచెన్ entrance door size minimum 2′.6″ ఉండాలి ఎందుకంటే మనం ఏవైనా మెటీరియల్ వంటగదిలో పెట్టాలన్న మనకు ఆ మాత్రం place ఉండాలి అలాగే వాస్తు ప్రకారం ఆగ్నేయం లో మాత్రమే కిచెన్ ఉండాలి ఈ మధ్యన అందరు open kitchen అంటే ఇష్టపడుతున్నారు అదే closed kitchen అయితే కిచెన్ కి dining కి మధ్యలో ఒక రంద్రం లాంటిది ఉంటే బాగుంటుంది easy గా సర్వీస్ చేసికోవచ్చు.
మా construction company సర్వీసెస్ :
*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును . మా phone number ;7989312152 , 9989456907.

