How To Use Washing Machine? వాషింగ్ మెషీన్ వాడుకునే పద్ధతి:

How To Use Washing Machine? వాషింగ్ మెషీన్ వాడుకునే పద్ధతి:

How To Use Washing Machine:ఇప్పటి ఆధునిక జీవన శైలిలో వాషింగ్ మెషీన్ అనేది ఒక ముఖ్యమైన గృహోపకరణంగా మారిపోయింది. బట్టలు చేతులతో ఉతికే  అవసరం లేకుండా త్వరగా, శుభ్రంగా ఉతకడానికి  ఇది ఎంతో సహాయపడుతుంది. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో వాషింగ్ మెషీన్ దాదాపు ప్రతి ఇంటిలో ఉంటుంది.

వాషింగ్ మెషీన్ వాడడం అనేది చాలా ఈజీ. కాస్త అవగాహన, కాస్త శ్రద్ధ ఉంటే మీ బట్టలు మృదువుగా, శుభ్రంగా ఉండేలా మీరు తేలికగా నిర్వహించవచ్చు. మీరు వాడే వాషింగ్ మెషీన్ ఏ రకమైనదైనా సరే – ఈ సూచనలు పాటిస్తే దీర్ఘకాలం మెషీన్ పని చేస్తుంది, బట్టలు కూడా త్వరగా ఎండుతాయి, ఫ్రెష్‌గా ఉంటాయి.https://amzn.to/4mCkbBW

వాషింగ్ మెషిన్ కొంటున్నారా :

వాషింగ్ మెషిన్ తీసికోవాలి అనుకునేవారికి ఎలాంటిది తీసికోవాలి అనే సందేహం ఉంటుంది.

వాషింగ్ మెషిన్ రెండు రకాలు:

* ఒకటి టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ 

*రెండవది ఫ్రెంట్  లోడ్ వాషింగ్ మెషిన్ 

* సాధారణంగా ఫ్రెంట్ లోడ్ వాషింగ్ మెషిన్ కంటే టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ వాడడానికి ఈజీ గా ఉంటుంది 

టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ :

* రన్నింగ్ లో వున్నా కూడా మధ్యలో పాజ్ చేసి దుస్తులు వేయడం లేదా తీయడం చేయవచ్చు.

* టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ దుస్తులు పై కాస్త రఫ్ గా ఉంటుంది. అలాగే 

* దుస్తులు ఆరడానికి కాస్త సమయం ఫ్రెంట్ లోడ్ వాషింగ్ మెషిన్ కంటే ఎక్కువ తీసికుంటుంది 

* ధర విశ్యానికీ వస్తే ఫ్రెంట్ లోడ్ వాషింగ్ మెషిన్ కంటే కాస్త తక్కువ.

ఫ్రెంట్ లోడ్ వాషింగ్ మెషిన్How To Use Washing Machine :

* ఫ్రెంట్  లోడ్ వాషింగ్ మెషిన్ లో ఒకసారి నీళ్లు ఎంటర్ అయ్యాయి అంటే వాష్ అయ్యేంతవరకు డోర్ ఓపెన్ అవ్వదు.

*ఫ్రెంట్  లోడ్ వాషింగ్ మెషిన్ దుస్తులపై ప్రభావం తక్కువుగా పడుతుంది.

* ఫ్రెంట్  డోర్  వాషింగ్ మెషిన్ లో డ్రయ్యర్ ద్వారా దుస్తులు త్వరగా ఆరిపోతాయ్.

* ధర విషయంలో చూసుకుంటే కాస్త ఎక్కువ . నీటిని కూడా తక్కువుగా తీసికుంటుంది.

* కానీ టాప్ లోడ్ కంటే ఫ్రెంట్ లోడ్ వాషింగ్ మెషిన్ లు దుస్తులను బాగా శుభ్రం చేస్తాయ్.

* కాబట్టి వీటిలో ప్లస్ , మైనస్ లు చూసికొని మీ అవసరాలు కి అనుగుణంగా తీసికోవచ్చు .

వాషింగ్ మెషిన్ క్లీనింగ్ :

వాషింగ్ మెషిన్ ని ప్రతి రోజు వాడుతున్న దాన్ని క్లీన్ చేయడంలో చాల మంది నిర్లక్షయంగా వుంటారు. దానిని సరిగ్గా మెంటైన్ చేయకపోతే క్రిములు బాక్టీరియా అబిరుది చెంది ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం వుంది. చెడు వాసనా, బూజు పేరుకుపోయి దుస్ట్ బిన్ లా తయారవుతుంది. క్రమంగా దాని ఫనితీరు మందగిస్తుంది. కాబట్టి వాషింగ్ మెషిన్ని ఎప్పటికి అప్పుడు క్లీన్ చేయడం మంచిది. అది ఎలాగో ఇప్పుడు చూదాం.

క్లీనింగ్ :

ఫ్రెంట్  లోడ్ వాషింగ్ మెషిన్ వాడినట్లు అయితే దాని తలుపుకు వుండే రబ్బరు పట్టీని శుభ్రం చేయాలి. దానిపై మురికిని మురికిని తొలిగించడానికి మైక్రో ఫైబర్ క్లోత్ తో తుడవాలి. లేదంటే నీరు నిలిసిపోయి నాసు పట్టేస్తుంది. వాష్ డ్రమ్ లోపలి భాగంలో కొద్దిగా బేకింగ్ సోడా సల్లండి అలాగే వెనిగర్ వేసి కాసేపు ఆన్ చేసి ఉంచాలి. అలాగే క్లీనింగ్ కోసం శుభ్రమైన క్లోత్, సిట్రస్ క్లీనర్ వాడాలి,..

జాగ్రత్తలు :

*వాషింగ్ మెషిన్ గోడకు దగ్గరగా పెట్టకూడదు, దీనివల్ల వెనుకవున్న పైపులు దెబ్బ తింటాయి కావున వాషింగ్ మెషిన్ పైపులు లీక్ అవ్వకుండా చూసికోవాలి.

* వాషింగ్ మెషిన్ లో సర్ప పౌడర్ కి బదులు లిక్విడ్ డిటర్జంట్స్ వాడడం మంచిది….ఎందుకంటే పౌడర్ వాడడం వలన అవి మెషిన్ లో పేరుకు పోతాయ్.

* బట్టలు ఉతికిన తరువాత డోర్ ఓపెన్ చేసి పట్టుకోవాలి.,,దీని వలన లోపల తేమ పోయి పొడిగా మారుతుంది. దీని వలన బాక్టీరియా రుద్ది చెంద కుండా ఉంటుంది .

వాషింగ్ మెషీన్ పై మరకలు పోవాలంటే :

* కొంచెం నీటిని వేడి చేసి(1/2 lit) అందులో 2 చెంచాల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మారకాలున్న చోట అప్లై చేయాలి,..పది నిమషాలు తరువాత క్లీనింగ్ బ్రష్ తో scrub చేస్తే సరిపోతుంది..మరకలు పోతాయ్.

* అలాగే ఒక కప్పు వేడి నీటిలో 2 చెంచాల వెనిగర్ వేసి బాగా కలిపి, మరకలు పై అప్లై చేసి కాసేపు ఉంచాలి,..కొంచెపు తరువాత క్లీనింగ్ బ్రష్ or ట్రూత్ బ్రష్ తో శుభ్రం చేస్తే మరకలు అన్ని ఈజీ గా తొలిగిపోతాయ్.

*వాషింగ్ మెషిన్ నుంచి నీరు కారు తుంటే లీకేజీ ప్రాంతాన్ని మార్క్ చేసి ఆరనివ్వాలి…ఆ తరువాత వాటర్ ప్రూఫ్ టేప్ తో లీకేజీ పార్ట్ ను కవర్ చేయాలి. 

ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకంలో తీసికోవాలిసిన జాగ్రత్తలు:

ఇంటిలో పనులు త్వరగా పూర్తి అవ్వాలంటే ఎలక్ట్రానిక్ వస్తువులు సాయం వుండవలిసిందే….అయితే వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసికోకపోతే అవి త్వరగా పాడు అయ్యిపోతాయ్. అలాగే ప్రమాదలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి.

వాషింగ్ మెషీన్How To Use Washing Machine:

* వాషింగ్ మెషీన్ వాడేటప్పుడు లోడ్ ఎక్కువు కాకుండా చూసికోవాలి. లోపల రబ్బరు లో మురికి చేరకుండా శుభ్రం చేసికోవాలి. ప్రతి పది వాష్ లకు ఒకసారియైన కాస్త బేకింగ్ సోడా వేసి డ్రమ్ క్లీన్ చేయండి.

ఫ్రిజ్:

* ఇంటిలో ఫ్రిజ్ వుందికదా అని వేడి వేడి పదార్థలను(చల్లగా అయినాక పెట్టుకోవచ్చు), మూతలు లేని గిన్నెలను పెట్టకూడదు.

ఓవెన్ How To Use Washing Machine:

* ఓవెన్ వాడే ముందు దానికి తగిన పాత్రలు కొనాలి. ఆహారపదార్దాలు తాలూకా వ్యర్దాలను ఎప్పటికి అప్పుడు శుభ్రం చేయండి…ఉప్పు , కాస్త బేకింగ్ సోడా చల్లి కాసేపటి తరువాత క్లీన్ చేయాలి.

ఎలక్ట్రిక్ కుక్కర్ :

ఎలక్ట్రిక్ కుక్కర్ వాడే ముందు గిన్నె అడుగు భాగంలో తడి లేకుండా చూసికోవాలి. అన్నం పొంగిన, మరకలు పడిన నీటితో ఎట్టి పరిస్థితిలో కడగద్దు అలాగే కుక్కర్ గిన్నెలను నేరుగా పొయ్యమీద పెట్టకూడదు.

మీక్సీ:

మీక్సీ వాడిన తరువాత వాటి గిన్నెలను వీలుఅయినంత తొందరగా కడిగి ఆరబెట్టేయాలి లేదంటే బ్లేడ్ పదును పోతుంది.

 ముందు జాగ్రత్తలు

  • బట్టలు వేరుచేయండి: తెల్ల బట్టలు, రంగు బట్టలు, సూక్ష్మమైన బట్టలు వేరుగా చేసికోవాలి ఎందుకంటే రంగు వెలిసిన బట్టలు ఉండవచ్చు వాటివల్ల మిగిలిన దుస్తులు పోవచ్చు.

  • బట్టల జేబులు ఖాళీ చేయండి: కరెన్సీ నోట్లు, కాగితాలు, నాణేలేవైనా ఉన్నా తీసేయండి. ఎందుకంటే దుస్తులు పాడుఅయిపోతాయ్ అలాగే జోబీలో బ్లేడ్,..మేకులు,..వున్నా మెషిన్ పాడుఅవుతుంది.

  • బట్టలపై ముద్రలు, మరకలు ఉంటె ముందుగా బ్రష్ తో శుభ్రం చేసికోవాలి.

2️⃣ వాషింగ్ మెషీన్ టైపు తెలుసుకోండి

👉 సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్:

  • కొంతమేర చేతి పని పడుతుంది.

  • వాష్ టబ్, స్పిన్ టబ్ వేర్వేరుగా ఉంటాయి.

👉 ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్How To Use Washing Machine:

  • అన్ని దశలు ఆటోమేటిక్‌గా జరుగుతాయి.

  • టాప్ లోడ్ / ఫ్రంట్ లోడ్ రెండు రకాలుంటాయి.


3️⃣ వాడే విధానం (Usage Method)

✅ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ వాడే విధానం:

  1. వాష్ టబ్‌లో బట్టలు వేసుకోండి.

  2. అవసరమైన నీటిని వాష్ టబ్‌లో పోయండి.

  3. డిటర్జెంట్ వేసుకోండి (పొడి లేదా ద్రవ రూపంలో).

  4. టైమర్ సెట్ చేయండి (5–15 నిమిషాలు).

  5. వాషింగ్ అయిపోయిన తర్వాత నీరు పోయించండి.

  6. బట్టలు స్పిన్ టబ్‌కి మార్చండి.

  7. స్పిన్ టబ్‌లో టైమర్ పెట్టి ఉడికించండి (3–5 నిమిషాలు).


✅ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ వాడే విధానం:

  1. మెషీన్‌ను పవర్ ఆన్ చేయండి.

  2. బట్టలు టబ్‌లో వేసుకోండి.

  3. డిటర్జెంట్ వేసి డోర్ మూసి వేయండి.

  4. వాష్ మోడ్ సెలెక్ట్ చేయండి (Normal, Quick Wash, Delicate, etc.).

  5. స్టార్ట్ బటన్ నొక్కండి.

  6. మొత్తం ప్రక్రియ ఆటోమేటిక్‌గా పూర్తవుతుంది.

  7. వాష్ అయిపోయిన తర్వాత బట్టలు తీయండి & ఎండబెట్టండి.

సర్వీసెస్ :

*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .Renovation House Ideas
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును .