mortgage loan interest rate! ఇల్లు తాకట్టు పెడుతున్నారా?జాగ్రత్త?
mortgage loan interest rate!
mortgage loan interest rate:ఇ రోజుల్లో ఇంటి అవసరాలు, వ్యాపార విస్తరణ, పిల్లల విద్య, మెడికల్ ఖర్చులు లేదా ఇతర పెద్ద అవసరాల కోసం చాలా మంది మోర్ట్గాజ్ లోన్ (Mortgage Loan) తీసుకుంటున్నారు. ఒక ప్రాపర్టీని (ఇల్లు, ప్లాట్, ఫ్లాట్, కమర్షియల్ ప్రాపర్టీ) బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థకు తాకట్టు పెట్టి తీసుకునే లోన్‌ను మోర్ట్గాజ్ లోన్ అంటారు. ఈ లోన్‌లో అత్యంత కీలకమైన అంశం మోర్ట్గాజ్ లోన్ వడ్డీ రేటు. వడ్డీ రేటు ఎంత తక్కువగా ఉంటే, అంత తక్కువ EMI చెల్లించాల్సి ఉంటుంది.మోర్ట్గాజ్ లోన్ వడ్డీ రేటు అనేది మీరు బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్ మొత్తంపై ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన అదనపు చార్జ్. ఇది శాతం (%) రూపంలో ఉంటుంది.
ఉదాహరణ:
మీరు ₹30 లక్షల మోర్ట్గాజ్ లోన్ తీసుకుని, వడ్డీ రేటు 9% అయితే –ప్రతి సంవత్సరం మీరు ఆ మొత్తంపై 9% వడ్డీ చెల్లించాలి (EMI రూపంలో).మోర్ట్గాజ్ లోన్ వడ్డీ రేట్లు సాధారణంగా 8.5% నుండి 13% మధ్య ఉంటాయి.బ్యాంక్, NBFC, మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం వంటి అంశాలపై ఇది మారుతుంది.
మోర్ట్గాజ్ లోన్:
ఏదయినా ఆస్తిని తనఖా పెట్టి రుణం తీసుకుంటే దాన్ని mortgage లోన్ అంటారు.ఇలా మంజూరు అయినా సొమ్మును దేనికయినా వినియోగించుకోవచ్చు.రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైతే…తనకా పెట్టిన ఆస్తిని విక్రయించి రుణాన్ని రికవరీ చేసికుంటారు.మీరు మీ ఇంటి గ్రోసరీ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.https://amzn.to/4qeCsaC
మోర్ట్గాజ్ లోన్ ఫీచర్స్mortgage loan interest rate:
మోర్ట్గాజ్ లోన్ వినియోగంపై ఎలాంటి పరిమితి ఉండదు.కావాలంటే రుణగ్రహీత తన వ్యక్తిగత అవసరాలకు కూడా సొమ్మును వాడుకోవచ్చు.హోంలోన్ తో పోలిస్తే మోర్ట్గాజ్ లో మంజూరయ్యే రుణం తక్కువుగా ఉంటుంది.ఆస్తి విలువలో 60-70 శాతం మాత్రమే రుణ రూపంలో పొందవచ్చు.హోంలోన్ తో పోలిస్తే మోర్ట్గాజ్ లోన్ పై 1-3 శాతం వడ్డీరేటు ఎక్కువుగా ఉంటుంది.మోర్ట్గాజ్ లోన్ లో ప్రాసెసింగ్ రుసుము 1.5 శాతం వరకు ఉంటుంది.ఈ లోన్ తిరిగి చెల్లించడానికి గరిష్టంగా 15 ఏళ్ళు కాలపరిమితి మాత్రమే ఉంటుంది.ఎలాంటి పేపర్ వర్క్ లేకుండానే ఉన్న లోన్ పై టాప్ -అప్ లోన్ తీసికొనే వెసులుబాటు ఇందులో ఉంటుంది.
ఇల్లు తాకట్టు పెటుతున్నారా?జాగ్రత్త?
మధ్యతరగతి ప్రజలు అత్యవసర పరిస్థితిలు వచ్చినప్పుడు అప్పులు కోసం బ్యాంకులు చుట్టూ తిరిగితుంటారు.అయితే వీటిపై అవగాహనా లేకపోవడంతో ఫైనాన్స్ consultancy లు,దళారులను ఆశ్రయిస్తుంటారు.వీరి లోపాలు తెలిసికొని కొందరు మోసాలు చేస్తుంటారు.ప్రస్తుతం కొందరు ముఠాగా ఏర్పడి అమాయకాలనుంచి ఆస్తి పత్రాలు తీసికొని వారి పేరుతో సేల్ డీడ్,పవర్ అఫ్ అటార్నీ వంటివి చేయించుకుంటున్నారు.బాదితులకు కాస్త డబ్బు ఇచ్చి,ఆ పత్రాలతో ఆ ముఠాలు బ్యాంకులు నుంచి రుణాలు తీసికుంటున్నాయి.కానీ వారు సకాలంలో వాయిదాలు చెల్లించకపోవడంతో ఇంటికి వేలం వేస్తున్నట్లు నోటీసులు పంపిస్తారు,అప్పుడు బాదితులకు ఈ విషయం తెలిసి లబోదిబో మంటారు.కావున స్థిరాస్తి యజమానులు ఎవరికియైన పత్రాలు రాసిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాల వుంది.
మోసగాళ్లు ఏం చేస్తున్నారుఅంటే:
ఒక వ్యక్తికి డబ్బుఅవసరమైనప్పుడు.డబ్బు దొరకని పరిస్థిలో మోసకారి ఏజెంట్స్ సీన్లోకి వచేస్తుంటారు.వీరు కన్సెల్టెన్సీ వాళ్ళదగ్గరికి ఆ వ్యక్తిని తీసికెళ్తారు.ఇంటికి తనకపెటితే,అవసరమైన డబ్బు ఇస్తామని చెప్పి,ఇంటిని తమ పేరిట “పవర్ ఆఫ్ అటార్ని” చేయవలిసిందిగా అడుగుతారు.డబ్బులు అవసరం ఉండడంతో ఇంటియజమానులు అందుకు అంగీకరిస్తారు. ఒకసారి పవర్ ఆఫ్ అటార్నీ చేతికి వచ్చాక,వేరేవ్యక్తికి ఆ ఇంటిని అమ్మేస్తారు.సాధారణంగా ఆ ఇంటిని కొనుగోలు చేసేది ఆ కన్సెల్టాన్సీ లో పనిచేసే వారే ఉంటారు.ఇప్పుడు ఆ ఇంటిని కొంటున్నట్లు నాటకం ఆడేవారు బ్యాంకుకి సంప్రదించి లోన్ కి ప్రయత్నిస్తాడు.అన్ని పత్రాలు సమర్పించడం వలన బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది.ఒక వేల ఇందులో ఏవైనా ఇబ్బందిలు వుంటే ఆ ఇంటిని తనకా(mortgage) పెట్టి లోన్ తీసికుంటారు.ఇంటి యజమానికి కొంత డబ్బు ఇచ్చి మిగిలిన వారు సర్దుకుంటారు.రెండు , మూడు నెలలు వాయిదాలు కట్టి ఆ తరువాత ముఖం చాటేస్తారు.దీనితో బ్యాంకులు ఇంటికి నోటీసులు ఇవ్వడం.వేలం వేసేందుకు సిద్దపడతాయ్.అప్పుడే బాదితులు తాము మోసపోయినట్లు గ్రహిస్తారు.
మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి:
వ్యక్తిగత,తనఖా రుణాలు కోసం ప్రయత్నించేవారు ముందుగా బ్యాంకులను సంప్రదించాలి.అక్కడ పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసికున్నాక నిర్ణయం తీసికోవాలి.సిబిల్ స్కోర్,చెల్లింపులు చరిత్ర సరిగ్గా లేకపోతె ఏజెంట్స్ చెప్పిన మాటలు నమ్మవద్దు. తక్కువ సమయంలో అప్పు లబిస్తుంది అనే ఉద్దేశంతో అనధికార కన్సెల్టాన్సీ ల వద్దకు వెళ్ళవద్దు. రుణగ్రహీతలకు సహాయం చేసేందుకు బ్యాంకులు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుంటాయి.వారు బ్యాంకు కోసమే పనిచేస్తుంటారు. వీరికి ప్రత్యేకంగా consultancies అంటు వుండవు.రుణం అవసరం ఉన్నప్పుడు ఇలాంటివారిని సంప్రదించాలి.లేదా బ్యాంకుకి వెళ్లాలి.మీ ఆస్తిని ఎట్టిపరిస్థిలోనూ ఎవరకి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వకూడదు.కేవలం తనకకు ఉంచినట్లే పత్రాలు ఇవ్వాలి.బ్యాంకులు తనకా రుణం ఇస్తాయి.ఒకవేళ అదిసాధ్యం కాకపోతే “రివెర్స్ mortgage లోన్”తీసికోవచ్చు.ఒకవేళ మోసపోయాం అనుకుంటే వెంటనే స్థానిక పోలీసులకు పిర్యాదు చేయాలి.
టాపాప్ లోన్ ఎప్పుడు తీసికోవాలిmortgage loan interest rate:
ఇల్లు కొనాలంటే 90 శాతం మంది రుణాలపై ఆధారపడతారు.అయితే గృహాలకి రుణాలు ఇచ్చే బ్యాంకులు టపాప్ లోన్స్ కూడ మంజూరు చేస్తాయ్.ఇంటిని విస్తిరించడంతో పాటు,ఇంటిలో ఫర్నిచర్ కొనుగోలు,పిల్లలకు చదువులకు సంబంధించి ఫీజలు వంటి వాటికీ టాప్-అప్ లోన్స్ వాడుకోవచ్చు.ఒకేసారి డబ్బు అవసరం లేదు అనుకుంటే.టాప్-అప్ లోన్స్ లో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.దీనికి గృహరుణంతో పోలిస్తే కాస్త అధిక వడ్డీ ఉంటుంది.దీర్ఘకాలం వరకు అవసరమైనప్పుడే డబ్బు తీసికొనే వీలుంటింది,ఉపయోగించుకున్న మొత్తానికి వడ్డీ విధిస్తారు.కాబట్టి పెద్దగా భారం ఉండదు.
top-up loan ఇలా తీసికుంటే మేలు mortgage loan interest rate:
ఇల్లుకొనలంటే 90 శాతం మంది రుణాలపైనే ఆధారపడతారు.అయితే గృహాలకు రుణాలు ఇచ్చే బ్యాంకులు top-up లోన్స్ కూడా మంజూరు చేస్తుంటాయి.ఈ top-up లోన్ తీసికొనేముందు ప్రణాళికతో వ్యవహరించాలి.అప్పుడే లాభం చేకూరుతుంది. ఈ లోన్ తీసికొని,దాన్ని ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు వాడినప్పుడు ఆదాయపు పన్ను మినాయింపు లభిస్తుంది.కాబట్టి top-up రుణం తీసికున్నపుడు ఆ మొత్తాన్ని ఇంటి కొనుగోలు లేదా నిర్మాణానికి ఉపయోగించినట్లు రుజువు చేయాలి.దీనికి సంబందించిన రసీదులు,ఇతర పత్రాలు సమర్పించాలి.గృహరుణ వ్యవధి 20 ఏళ్లుంటే …top-up రుణనికి అదే 20 ఏళ్ళు ఉంటుంది.దీనివల్ల దీర్ఘకాల అప్పుతీర్సే వెసులుబాటు ఉంటుంది.మీకు అప్పుడు అప్పుడు డబ్బులు కావాల్సివస్తే top-up లో వుండే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యన్ని ఉపయోగించుకోవచ్చు.కొన్ని బ్యాంకులు గృహరుణం top-up పైన ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.దీని వడ్డీ గృహరుణం కన్న కాస్త ఎక్కువుగా,వ్యక్తిగత రుణంకన్నా తక్కువుగా ఉంటుంది.topup రుణం ఎంత ఇవ్వాలన్నది ఆదాయం,గృహ రుణం మొత్తం,తనకా పెట్టిన ఆస్తి,మార్కెట్ విలువ బట్టి ఆధారపడుతుంది.
ఓపెన్ ఎండెడ్ మోర్ట్గాజ్ లోన్:
ఓపెన్ ఎండెడ్ మోర్ట్గాజ్ లోన్ ఆప్షన్ ఎంపిక చేసుకున్న రుణ గ్రహీత …ఒక రుణం పొందిన కొన్ని రోజుల తరువాత మరింత రుణం కావలని బ్యాంకును కోరవచ్చు.బ్యాంకు కూడా అందుకు సమ్మతిస్తుంది.సాధారణంగా ఇల్లు వంటి స్థిరాస్తిలు కొనుగోలు విషయంలో ఈ విధానం పనిచేస్తుంది.ఇల్లు కొనుగోలుకు మంజూరు చేసిన మొత్తం రుణం ఒకేసారి తీసికోకుండా మొదట అవసరం ఉన్నంత వరకు రుణం తీసికొని, భవిష్యత్తులో మరింత నిధులు అవసరం వున్నప్పుడు బ్యాంకుని సంప్రదించి అదనపు రుణం పొందడం దీని ముఖ్య ఉద్దేశం.
open ended మోర్ట్గాజ్ లోన్ ఉపయోగాలు:
అవసరం లేకపోయినా బ్యాంకు శాంక్షన్ చేసిన మొత్తం రుణాన్ని ఒకేసారి తీసికోవాలిసిన అవసరం ఉండదు.అలాగే అదనంగా వడ్డీ చెల్లించవలిసిన పని ఉండదు.అదే సమయంలో అవసరమైనప్పుడు వెంటనే కావాల్సినంత రుణం పొందవచ్చు.ఇందులో బ్యాంకులుకి కూడా ఎలాంటి నష్టం(రిస్క్) ఉండదు.ఎందుకంటే ఒక స్థిరాస్తి ఎలాగూ తనకాలో ఉంటుంది.పైగా దానివిలువ కొనుగోలు నాటినుంచి చూస్తే రోజులు గడుస్తున్నా కొద్దీ మరింత పెరుగుతుంది.అందుకే ముందే శాంక్షన్ చేసిన పూర్తి రుణం మొత్తాన్ని ఎన్నిదపాలుగా అయినా ఇచ్చేందుకు బ్యాంకుకు అభ్యన్తరం ఉండదు.
లోన్ చెల్లించిన డాక్యూమెంట్స్ ఇవ్వట్లేదా:
బ్యాంకులు,ఆర్థిక సంస్థలు లోన్ చెల్లించడం పూర్తి అయిన 30 రోజుల్లోగా స్థిర,చరాస్తులకు సంబంధించిన పత్రాలను రుణగ్రహీతకు తిరిగి ఇచ్చియాలని RBI(2003) కీలక ఆదేశాలు జారీచేసింది.రుణ గ్రహీతలు తమ స్థిర లేదా చరాస్తులకు సంబంధించిన పత్రాలను రుణం పూర్తిగా చెల్లించిన వెంటనే సంబందిత బ్యాంకు/సంస్థ కార్యాలయాలనుంచి తీసికోవాలి. ఒకవేళ రుణగ్రహీత అకాల మరణం పొందితే పాటించవసిన నియమ నిబంధనలు కూడా సంస్థలు పక్కాగా రూపొందించాలని RBI అదేశించింది.ఈ విధానాలు అన్నిటిని …సంస్థలు తమ వెబ్సైటు లో ఉంచాలని RBI తెలిపింది. ఒకవేళ 30 రోజుల్లోగా పత్రాలను ఇవ్వలేకపోతే…అందుకు గల కారణాలు తెలియజేస్తూ బ్యాంకులు కస్టమర్లకి సమాసారం ఇవ్వాలి.సరైన కారణాలు లేకుండా నిర్లక్ష్యం చేస్తే…రుణ గ్రహీతకు రోజుకు rs.5000 చప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.ఒకవేళ పత్రాలు కనపడకపోతే …వాటిని తిరిగిపొందేలా రుణగ్రహీతకు సహాయం చేయాలి.అలాగే వాటికి అయ్యే ఖర్చును బ్యాంకులు/సంస్థలు భరించాలి.దీనితో పాటు రోజుకి 5000 పరిహారం ఇవ్వాలి.మీకు హోంలోన్ యొక్క పూర్తి సమాసారం కోసం https://impresshomedesigners.com/home-loan-process-home-loan-process-step-by-step-in-telegu/
మా construction company సర్వీసెస్ :
*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును . మా phone number ;7989312152 , 9989456907.


