outer wall plastering thickness?బయటి గోడ ప్లాస్టరింగ్ మందం ఎందుకు ముఖ్యం?
outer wall plastering thickness:
బయట గోడలపై సిమెంట్–ఇసుక మిశ్రమాన్ని అప్లై చేసి గోడను రక్షించే ప్లాస్టరింగ్‌ను ఎక్స్టీరియర్ ప్లాస్టరింగ్ అంటారు. ఎక్స్టీరియర్ ప్లాస్టరింగ్ మందం ఏ భవనంలోనైనా అత్యంత కీలకం. స్టాండర్డ్‌గా 15mm–20mm మందం బయట గోడలకు సరైన రక్షణను, బలాన్ని, వాతావరణ నిరోధకతను అందిస్తుంది. బ్లాక్ వాల్ లేదా పాత గోడల సందర్భంలో 20mm–25mm మందం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది. మందం సరిగ్గా ఉండడం వల్ల గోడలు దశాబ్దాలపాటు బలంగా, నీటి ప్రభావం లేకుండా, పెయింట్ ఎక్కువకాలం మన్నేలా ఉంటాయి.
భారతదేశంలో, ముఖ్యంగా నివాస నిర్మాణాల్లో ప్రాక్టికల్‌గా ఉపయోగించే మందం.భారతదేశంలోని IS 1661 & IS 2402 ప్రామాణిక నిబంధనల ప్రకారం
Single Coat Exterior Plaster: 15mm – 20mm
Double Coat Exterior Plaster: 18mm – 25mm .
Base coat: 10–12mm
Final coat: 6–8mm
మొత్తం మందం: 18–25mm
ఇది బయట గోడలను వర్షంలో, సూర్యకాంతిలో, తేమలో పూర్తిగా రక్షిస్తుంది.ఇవి అన్ని వాతావరణ పరిస్థితులకు సరిపోయే ఉత్తమ మందాలు.
గోడ రకం ప్రకారం అవసరమైన మందం:
బయటి గోడలు వేరువేరు రకాలుగా ఉంటాయి. వాటి ప్రకారం మందం కూడా మారుతుంది.
1) ఇటుక గోడలు (Brick Walls):
15mm – 20mm
ఇటుక గోడలు తేమ పీల్చుకునే స్వభావం కలిగి ఉంటాయి కాబట్టి ఈ మందం వుండాలి.
2) AAC / CLC బ్లాక్ గోడలు:
18mm – 22mm
బ్లాక్స్ తక్కువ బలంతో ఉంటాయి, కాబట్టి మందం ఎక్కువ కావాలి.
3) RCC (కాంక్రీట్) గోడలు:
12mm – 15mm
RCC స్మూత్‌గా ఉంటుంది, తక్కువ మందం కూడా సరిపోతుంది.
4) పాత గోడలు:
20mm – 25mm
నిలువును సరిచేయడానికి మందం ఎక్కువ అవసరం.
5) నీటి ప్రభావం ఎక్కువ వున్న ప్రదేశాలు:
20mm – 25mm + Waterproof chemical.
cement wall plastering:
Cement Wall Plastering: భవన నిర్మాణంలో అయినా గృహ నిర్మాణంలో అయినా మరియు ఏ చిన్న–పెద్ద కట్టడంలోనైనా సిమెంట్ ప్లాస్టరింగ్ అనేది చాలా కీలకమైనది. గోడల రూపాన్ని మార్చేది, వాటిని బలంగా వుంచేది , వాతావరణ పరిస్థితుల నుండి రక్షించేది ప్లాస్టరింగ్. plastering అనేది కేవలం గోడ అందంగా కనిపించడం కోసం మాత్రమే కాదు, భవనాన్ని ఎక్కువ కాలం పాటు స్ట్రాంగ్‌గా ఉంచేందుకు, క్రాక్‌లు వచ్చే అవకాశాన్ని తగ్గించేందుకు మరియు తేమ, నీరు, దుమ్ము లాంటి ప్రభావాల నుండి గోడలను రక్షించేందుకు కూడా అత్యంత అవసరం.
అవసరమైన సామగ్రి (Materials):
సిమెంట్ (OPC లేదా PPC),ఇసుక (Fine Sand),నీరు,వాటర్ ప్రూఫ్ కెమికల్ (Plaster Bond – అవసరమైతే).https://amzn.to/3K7ApVX
సిమెంట్ వాల్ ప్లాస్టరింగ్ అంటే ఏమిటి?
Cement Plastering అంటే సిమెంట్, ఇసుక, నీరు కలిపి తయారుచేసే మిశ్రమాన్ని (మోర్టార్) గోడ కి వేస్తారు.అలా గోడకి ఆ మిశ్రమాన్ని కొట్టి గోడని స్మూత్‌గా చేస్తారు. దీనివల్ల గోడలు సున్నితముగా,స్మూత్ గా,దృడంగా, సమానంగా ఉంటాయి. ప్లాస్టరింగ్ వల్ల వాతావరణ ప్రభావాల నుండి రక్షణ పొందవచ్చు. క్రాక్‌లను నివారించవచ్చు.పెయింటింగ్ చేసేటప్పుడు మంచి ఫినిషింగ్ వస్తుంది. గోడల యొక్క జీవితకాలాన్ని పెంచుకోవచ్చు.సిమెంట్ ప్లాస్టరింగ్ ద్వారా గోడలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. మంచి ప్లాస్టరింగ్ గనక చేస్తే అతి చిన్న చిన్న అసమానతలు కూడా కనిపించవు.
సిమెంట్ ప్లాస్టరింగ్ ప్రయోజనాలు:
గోడలకు బలం పెరుగుతుంది.క్రాక్స్ అనేవి రావు.పెయింటింగ్‌కు స్మూత్ ఫినిష్ ఇస్తుంది. భవనం ఎక్కువకాలం నిలుస్తుంది.ఇంటీరియర్ గోడలు అందంగా కనిపిస్తాయి. బయటి గోడల ఆయుష్షు పెరుగుతుంది.వర్షం పడిన లీకేజీ అనేది ఉండదు.
ప్లాస్టరింగ్ బాగుండాలి అంటే ముఖ్యమైన టిప్స్:
మంచి నాణ్యత గల ఇసుక ఉపయోగించండి. PPC (Pozzolana) సిమెంట్ వాడితే స్మూత్ ఫినిష్ వస్తుంది.గోడను ప్లాస్టర్ చేసేముందు బాగా తడపాలి.రోజూ కి 2 సార్లు క్యూయరింగ్ చేయాలి. ఫినిష్ను సరిగా చేయాలి.పెయింట్ చేయడానికి కనీసం 21 రోజులు గ్యాప్ ఇవ్వాలి.గోడలు మధ్య జాయింట్ల మీద మెష్ తప్పనిసరి ఉపయోగించాలి .
ప్లాస్టరింగ్‌లో ఎక్కువగా జరిగే తప్పులు:
సరైన మిశ్రమాన్ని (సిమెంట్,ఇసుక,నీరు కలిపిన) నిష్పత్తి పాటించకపోవడం.డ్రై వాల్ (గోడలు తడపకపోవడం) మీద ప్లాస్టర్ చేయడం (గోడను నీటితో తడపాలి).క్యూయరింగ్ చేయకపోవడం. ఎక్కువ నీరు వాడడం.పాత మోర్టార్(మిశ్రమం) మళ్లీ కలిపి వాడడం.ఇలా చేస్తే గోడలు కి 6 నెలల్లోనే క్రాక్స్ వస్తాయ్, ప్లాస్టర్ విడిపోవడం, పెయింట్ పాడైపోవడం జరుగుతుంది.Cement Wall Plastering
ప్లాస్టరింగ్‌కు ముందుగా చేయాల్సిన పనులు:
గోడలు స్మూత్‌గా రావాలంటే,లెవెలింగ్ మార్కింగ్ చేయాలి, ఆ తరువాత లెవెల్ ప్యాడ్లు పెట్టాలి.ఇటుక గోడ –బీమ్ సంధి(మధ్యలో) ప్రాంతాల్లో మెష్ బిగించడం మంచిది (అవసరమైతే).పాత గోడలకు క్రాక్స్ ఉన్నట్లు అయితే Welded mesh ఉపయోగించడం మంచిది.ప్లాస్టరింగ్‌కు ముందుగా గోడను శుభ్రంచేయాలి(దుమ్ము దూళి లేకుండా ). ఆ తరువాత గోడను నీటితో 2–3 గంటల పాటు బాగా తడపాలి. అప్పుడు ఆ మిశ్రమాన్ని గోడకు బాగా అంటుకునేలా చేస్తుంది.
క్యూయరింగ్ (Curing):
outer wall plastering thickness:
ప్లాస్టరింగ్ తర్వాత మినిమం 7 to 10 రోజులు క్యూయరింగ్ తప్పనిసరి.క్యూయరింగ్ వల్ల క్రాక్‌లు రాకుండా గోడలు కి బలం పెరుగుతుంది.సిమెంట్ గోడలకి బాగాపడుతుంది.వర్షకాలంలో ప్లాస్టరింగ్ చేయకూడదు.
ఇంటీరియర్ ప్లాస్టరింగ్:Cement Wall Plastering:
ఇంటి లోపల ప్లాస్టరింగ్ చేయాలి అంటే ఫైన్(smooth sand ) ఇసుక వాడాలి.అప్పుడే స్మూత్ ఫినిష్ వస్తుంది. మందం అనేది (12mm) ఉండాలి.అప్పుడు పెయింటింగ్ కు అనుకూలంగా ఉంటుంది.
ఎక్స్టీరియర్ ప్లాస్టరింగ్Cement Wall Plastering::
ఇంటి బయట ప్లాస్టరింగ్ చేయాలి అంటే రఫ్ ఇసుక(గరుకు ఇసుక) నీ వాడాలి.ఎందుకంటే ఔట్ సైడ్ వాల్ అనేది బలంగా ఉండాలి. ఎండాని/వానని తట్టుకున్నట్లు ఉండాలి. అలాగే బయట గోడలకు ప్లాస్టరింగ్ చేసినప్పుడు వాటర్ ప్రూఫ్ కెమికల్ కలపాలి.అప్పుడు గోడలకి లీకేజీ లు రావు.
మిశ్రమం తయారు చేయడం (Mixing Mortar):
సిమెంట్–ఇసుక నిష్పత్తి యొక్క డ్రై మిష్రం బాగా కలపాలి.తరువాత నీరు వేసి మిశ్రమాన్ని తయారు చేయాలి.ఈ మిశ్రమము (మోర్టార్) 30–40 నిమిషాల లోపే ఉపయోగించాలి. ఎక్కువచేపు వుంటే పాడుఅయిపోతాది ఆ మిశ్రమాన్ని వాడకూడదు.
సిమెంట్ ప్లాస్టరింగ్ రకాలు (Types of Plastering)
సింగిల్ కోట్ ప్లాస్టరింగ్:
సింగల్ కోట్ అనేది సాధారణంగా 12mm – 15mm మందంతో ఇంటీరియర్ గోడలకు ఉపయోగిస్తారు.
డబుల్ కోట్ ప్లాస్టరింగ్:
డబల్ కోట్ ప్లాస్టరింగ్ లో మొదటి కోట్: 12mm, రెండో కోట్ (ఫినిషింగ్): 6mm–8mm, ఎక్స్టీరియర్ గోడలు(బయటగోడలకి) ఉపయోగిస్తారు.
వాటర్ ప్రూఫ్ ప్లాస్టరింగ్:
బాత్రూమ్, బేస్మెంట్, ట్యాంక్‌లు కు బాగా ఉపయోగిస్తారు.సిమెంట్‌లో వాటర్ ప్రూఫ్ కెమికల్ కలుపుతారు.Cement Wall Plastering:
మిశ్రమ నిష్పత్తులు (Plaster Mix Ratios)
ప్లాస్టరింగ్‌లో సరైన నిష్పత్తి చాలా ముఖ్యం. ప్రధానంగా ఉపయోగించే Mix Ratios:
ఇంటీరియర్ గోడలకు:
outer wall plastering thickness:
1:4 (సిమెంట్ : ఇసుక): అంటే ఒక బస్తా సిమెంట్ వాడితే 4 బస్తాలు ఇసుక వాడాలి.గోడలు అందంగా కనిపిస్తాయి.పెయింట్ బాగా పడుతుంది. తేమ ప్రభావం తగ్గుతుంది.గోడలు బలంగా, నిలకడగా ఉంటాయ్.ఇంటీరియర్ డిజైన్ లుక్ మెరుగుపడుతుంది.
ఎక్స్టీరియర్ గోడలకు:
1:5 లేదా 1:6 : అంటే ఒక బస్తా సిమెంట్ వాడితే 5 లేదా 6 బస్తాలు ఇసుక వాడాలి.బలంగా ఉండుటకు రఫ్ ఇసుక సరిపోతుంది.గోడలను వర్షం, సూర్యకాంతి, గాలి నుండి రక్షిస్తుంది.తేమ గోడలోకి చొరబడకుండా ఆపుతుంది. బయట గోడల్లో క్రాక్‌లు రాకుండా చేస్తుంది.దుమ్ము, పొగ, కాలుష్యం గోడలను పాడు చేయకుండా కాపాడుతుంది. పెయింటింగ్ మంచి ఫినిష్ తో ఎక్కువ కాలం మన్నుతుంది.భవనం జీవితకాలాన్ని పెంచుతుంది.
Ceiling ప్లాస్టరింగ్ :
ceiling కి 1:3 అంటే ఒక బస్తా సిమెంట్ 3 బస్తాలు ఇసుక ఉపయోగించాలి. ఎందుకంటే పైకప్పుకు ఎక్కువ గ్రిప్పింగ్ అవసరం ఉంటుంది కాబట్టి .చాలా cases లో 12mm కంటే ఎక్కువ చేయరు, ఎందుకంటే ఎక్కువ మందం పెడితే ప్లాస్టర్ ఊడిపోవచ్చు.పెయింట్ బాగా పడుతుంది.గోడ–సీలింగ్ జాయింట్లలో క్రాక్‌లు తగ్గుతాయి.సీలింగ్ బలం పెరుగుతుంది.లైటింగ్ మరియు ఇంటీరియర్ లుక్ మెరుగుపడుతుంది.
వాటర్ ప్రూఫ్ ప్లాస్టరింగ్Cement Wall Plastering: :
వాటర్ ప్రూఫ్ కంపౌండ్ కి కూడా 1:3 అంటే ఒక బస్తా సిమెంట్ 3 బస్తాలు ఇసుక ఉపయోగించాలి. ఈ ప్లాస్టరింగ్ వల్ల నీరు గోడలోకి చొరబడదు.తేమ (Moisture) గోడలను పాడు చేయదు.ఫంగస్, మోల్డ్, డ్యాంప్నెస్ లాంటి సమస్యలు రావు.గోడలు ఎక్కువకాలం బలంగా ఉంటాయి.
సిమెంట్ వాల్ ప్లాస్టరింగ్ జాగ్రత్తలు :
*గ్రిప్ కోసం సుత్తితో(ceiling/wall) ముందుగా కొట్టి ఆ తరువాత వాటర్ తో బాగా తడిపి సిమెంట్ వండ్రు పాలు(పొడి సిమెంట్ ని నీళ్లలో కలపడం) పోయాలి.వండ్రు పాలు కొట్టకపోతే సిమెంట్ అనేది పట్టదు.గోడలు ఆరిపోయానక ప్లాస్టరింగ్ చేయకూడదు.electrical /plumbing కన్నాలు ముందుగా కప్పివేయాలి. ఇసుక అనేది జల్లిడించుకోని వాడాలి ఎందుకు అంటే రాళ్లు,మట్టి,చెత్త అనేవి ఉండకూడదు.
ఇసుక ఎందుకు ముఖ్యము?
దుమ్ము లేకుండా శుభ్రంగా ఉండాలి. రఫ్‌గా ఉండాలి కానీ పెద్ద కంకరలు ఉండకూడదు.నీటిలో కలిపితే మట్టి ఎక్కువగా వేరుపడకూడదు. పసుపు/గోధుమ రంగులో ఉండాలి (నది ఇసుక).కాంక్రీట్‌కు బలం ఇస్తుంది.ప్లాస్టరింగ్‌కు స్మూత్ ఫినిష్ ఇస్తుంది. సిమెంట్‌తో బాగా బైండింగ్ అవుతుంది. నిర్మాణం స్ట్రాంగ్‌గా ఉండడానికి అవసరం.Cement Wall Plastering:
సిమెంట్ ఎక్కడ ఉపయోగిస్తారు?
* కాంక్రీట్ తయారీలో (Concrete)
* ప్లాస్టరింగ్ పనుల్లో
* ఇటుక పనిలో (Brick masonry)
* ఫ్లోరింగ్‌లో
* గ్రౌటింగ్, ప్యాచింగ్ పనుల్లో
* టైల్స్ ఫిక్సింగ్, ఫినిషింగ్ పనుల్లో
సిమెంట్ రకాలు
-
OPC (Ordinary Portland Cement): వేగంగా గట్టిపడుతుంది, స్ట్రాంగ్ గ ఉంటుంది.
-
PPC (Portland Pozzolana Cement)
స్మూత్ ఫినిష్ ని ఇస్తుంది. ప్లాస్టరింగ్‌కు మంచిది -
White Cement
డిజైన్ ఫినిషెస్, పుట్టీ వర్క్‌కు బాగా ఉపయోగపడును. -
Rapid Hardening Cement
బలంగ ఉంటుంది. త్వరగా అవసరం ఉన్న పనులకు ఉపయోగపడుతుంది.
మా construction company సర్వీసెస్ :
*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును . మా phone number ;7989312152 , 9989456907.


