Why is RERA Registration Important? (RERA చట్టం -2016) రియల్ ఎస్టేట్ నియంత్రణ మరియు అభిరుద్ది!
Why is RERA Registration important: రియల్ ఎస్టేట్ పనులు , కన్స్ట్రక్షన్ పనులు కానివ్వండి,ఫ్లాట్స్, లేఔట్స్ ,విల్లాస్ కానివ్వండి వీటిన్నిటికి ఒక act తీసికోవచ్చింది “సెంట్రల్ గవర్నమెంట్” ఇది 2016 ఆమోదం పొందింది (మార్చి ) కానీ మే 2017 నుంచి ఇంప్లిమెంటు చేసారు.రియల్ ఎస్టేటుకి సంబంధించి ఆక్టివిటీ చేయాలంటే వీటిలో మెంబెర్ అయివుండాలి. ఎవరైనా తీసికోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసికోవచ్చు . https://amzn.to/403Opou
ప్రతి బిల్డర్ ప్రతి దేవలోపెర్ ఎవరైనా సరే RERA లో రెజిస్ట్రేషన్ అయి వుంటేనే ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ తీసికోవాలి అప్రూవల్ రావాలంటే రేరా అనేది ఉండాలి. ప్రతి స్టేటుకి (state) రేరా వెబ్సైట్ ఉంటుంది. వీటి ముఖ్యఉద్దేశం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టేవారిని మోసాలనుంచి రక్షించడం .తప్పుడు సమాసారం ఇచ్చినట్లుఅయితే చట్టపరమయినా యాక్షన్ తీసికుంటారు .
వివరణ :
రేరాని తెలుగులో “స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థ” అనికూడా అంటారు రేరా అనేది రియల్ ఎస్టేట్ నియంత్రణ ఆబిరుది చట్టం ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన నియంత్రణ చట్టం . రేరా రాకముందు ప్రతి బిల్డర్ వారికీ ఇష్టం వచ్చినట్లు కట్టేవారు(ఒకటి చెప్పి ఇంకొకటి కట్టేవారు ) వీటివల్ల ప్రాజెక్ట్స్ ఆగిపోవడం చాల కంప్లైంట్స్ వచ్చేవి చాల గొడవలు జరిగేవి చాల మోసాలు జరిగేవి ఇవన్నీ కట్టడిచేయడానికి కేంద్రప్రభుత్వం 2016 ఈచట్టం తీసికొనివచ్చింది ఇప్పుడు తప్పుదారి పెట్టేంచే క్లెయిమ్స్ తగ్గించబడ్డాయి ఈజీగా కొంటున్నారు ఇన్వెస్ట్ చేస్తున్నారు .
రేరా ఉపయోగాలు :
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్సకతను పెంచడం, ఇంటికొనొగోలుదారులు హక్కులను కాపాడడం , రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి అయ్యేలా చూడడం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించడం వివాదాలు వేగంగా పరిష్కరించడం రేరా చట్టం గృహ కొనుగోలు దారులు మరియు రియల్ ఎస్టేట్ దేవలోపేర్స్ హక్కుల్ని రక్షిస్తుంది .
ఈ చట్టంద్వారా దేవలోపేర్స్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను నమోదు చేసికోవాలిసి ఉంటుంది తద్వారా కొనుగోలుదారులకు project గురించి పూర్తి సమాసారం లభిస్తుంది మరియు ప్రాజెక్ట్ పూర్తి అయ్యేవరకు వారి హక్కులను రక్షింపబడతాయ్.
రేరా ప్రాజెక్ట్ రెజిస్ట్రేషన్ :
ప్రతి ప్రాజెక్టు రేరాలో రిజిస్టర్ అయివుండాలి, ప్రాజెక్ట్ రేరాలో రిజిస్టర్ అవ్వాలంటే 500sqm ల్యాండ్ అయ్యివుండాలి (వీటికంటే ఎక్కువవుండచ్చు తక్కువ ఉండకూడదు) లేదా 8flats అయినా ఉండాలి . ఆల్ రెసిడెన్సియల్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ వీటికంటే తక్కువవుంటే రేరా అవసరం లేదు. alternation చేసే హక్కు బిల్డర్‌కి లేదు buyer పెర్మిషన్ ఉండాలి .
ప్రతి ప్రోజెక్టుదగ్గర display boards ఉండాలి మనంకట్టే ప్రాజెక్ట్ ఏంటి కార్పెట్ ఏరియా ఎంత , ఏఏ స్పెసిలిటీస్ ఇస్తారు , లొకేషన్ ఎక్కడ ఇలా total details display బోర్డు మీద ఉండాలి (తప్పుడు సమాసారం ఇస్తే రేరా రద్దు అయిపోతుంది ). ప్రతి 3months కి ఒకసారి అప్డేట్ ఇవ్వాలి కన్స్ట్రక్షన్ ప్రోజెక్టుకోసం వర్క్ ఎంతవరకు వచ్చింది , ఏమైనా మార్పులు చేర్పులు చేసారా ఏమైనా అప్ప్రోవల్స్ వచ్చాయా డాక్యూమెంటుతో సహా చూపించాలి.
ESCROW ACCOUNT :
బిల్డర్ లేదా ప్రమోటర్ లేదా developer కానివ్వండి buyer కట్టే అమౌంట్ లో 70% escrow account లో వేయాలి దీనివల్ల వేరే ప్రాజెక్టుకి money divert చేయడం కుదరదు దీనిలో వచ్చిన డబ్బులు ఆ ప్రాజెక్టుకి మాత్రమే ఉపయోగించాలి. వీటిలో డబ్బులు డ్రా చేయాలి అంటే ఇంజీనీర్ మరియు additurs పర్మిషన్ తీసికోవాలి. కార్పేట్ ఏరియా కి మాత్రమే తీసికోవాలి ఎమౌంట్ అంటే నాలుగుగోడలు మధ్యన ఉన్న ఏరియా మనం వాడుతున్న ఏరియా (utility , balcony , common area , కారిడార్ కానీ కార్పేట్ ఏరియా లోకి రావు )
SALE AGREEMENT STANDARDIZATION :
ప్రాజెక్ట్ కాస్ట్ లో 10% మాత్రమే అడ్వాన్స్ తీసికోవాలి 10% దాటకూడదు అలాగే 5years సర్వీస్ చేయాలి ఎటువంటి ప్రాబ్లెమ్ వచ్చిన బిల్డర్ responsibility తీసికోవాలి , మొదటి 5ఇయర్స్ ఉసిత కాస్ట్ సేవల్ని అందించాలి , ఆలస్యం జరిగితే 2% చెల్లించాలి (property cost లో) 120 days లో సమస్యల్నిపరిష్కరించాలి. టైం కి ప్రాజెక్ట్ ఇవ్వకపోతే ఆయినా కట్టిన అమౌంట్ కి నెలకి ఇంట్రెస్ట్ రూపంలో చెల్లించాలి .
ఒకవేల వరదలు తూఫాన్లు మొదలైన ప్రకృతి వైఫల్యాలు వల్ల ప్రాజెక్ట్ డెలివరీ జాప్యం జరిగితే లేదా ముడిసరుకు సరఫరా కొరతకాని కూలీలా కొరతకాని మొదలైనవి వుంటే developer తన తప్పేమి లేదని సమర్ధించుకోవాలి అయితే developer రేరా అథారిటీ కి రాతపూర్వకంగా తెలియజేయాలి అయితే ఆలస్యం అనేది one year కంటే ఎక్కవ ఉండకూడదు
GRIEVANCE REDRESSAL :
వీటిద్వారా కంప్లైంట్ ఇచ్చికుంటారు buyer బిల్డర్ మీద కానీ బిల్డర్ buyer పైన కానీ కేసు ఫైల్ చేసికోవచ్చు 60days లో ప్రాబ్లెమ్ solve అవుతుంది ఒకవేళ clearance రాకపోతే మల్లి అప్పీల్ చేసికోవచ్చు, tribunal court లో సొల్యూషన్ దొరక్కపోతే హైకోర్టు కి వెళ్ళవచ్చు ఇక్కడకూడా సొల్యూషన్ దొరక్కపోతే “సుప్రీంకోర్టు” కి వెళ్ళవచ్చు .


