3BHK House Construction Cost ? 3BHK హౌస్ కాస్ట్ అండ్ ఎస్టిమేషన్ 2025/

3BHK House Construction Cost ? 3BHK హౌస్ కాస్ట్ అండ్ ఎస్టిమేషన్ 2025/ 2BHK House Cost And Estimation in 2025/:

3bhk house construction
the best construction in vizag

 

3BHK House Construction Cost:  ముందుగా మనం  3BHK house  కట్టుకోవాలి అంటే minimum 1500sft లేదా 150 గజాలు స్థలం ఉండాలి అప్పుడు మనం అనుకున్న విదంగా ఇంటిని డిజైన్ చేసికోవచ్చు .కొంతమంది 1000sft లో 3BHK హౌస్ ప్లాన్ చేస్తారు .1000sft లో కూడా కట్టుకోవచ్చు కానీ చాల చిన్నచిన్న రూమ్స్ వస్తాయ్అనుకున్న విదంగా మనం డిజైన్ చేసికోలేము.

 2025 లో  మనం 3BHK ఇల్లు కట్టుకోవాలి అంటే  (30lakh ) వరకు అవుతుంది. అది మన ఇళ్ళు మనం కట్టుకున్న లేదంటే కాంట్రాక్టర్ కి ఇచ్చిన ,  అదే మనం కాంట్రాక్టర్ కి(మెటీరియల్ తో ) ఇచ్చినట్లు అయితే “SFT”  కి 2000/  charge చేస్తారు(cupboard work ఉండదు ). అలాగే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు   కొన్ని  common expenses ఉంటాయి అవి బిల్డర్ తో సంబంధం ఉండదు అవి .

common expenses and petty expenses :

ఈ expenses అనేవి టోటల్ బడ్జెట్లో 10 to 15% ఉండవచ్చు అవి ఏంటి అంటే, బిల్డింగ్ పర్మిషన్ తెచుకోవాలి(no objection certificate ) ఇది village లో 5k to 10k ఉంటుంది, సిటీలో అయితే 30 to 50k వరకు ఉంటుంది , తరువాత గవర్నమెంట్ నుంచి power connection మరియు water connection కి పెర్మిషన్ తీసికోవాలి వీటికి 50k వరకు  అవ్వచ్చు, తరువాత ఇంజనీర్ లేదా సిద్దాంత్ ప్లాన్ కి 5k to 10k ఉంటుంది.

తరువాత స్థలం శుభ్రం చేసికొని భూమి పూజకి(శంకుస్థాపన ) 20k . septic tank 20k , మోటార్ కి 50k (hand pump 20k ), ముగ్గు వేసి గుంతలకి 20k . basement ఫిల్ చేయడానికి గ్రావెల్ డస్ట్ లేదా నేలమట్టి లేదా కొండ రాయ లేదా  ఇసుక ఉపయోగిస్తారు వీటికి సుమారుగా 50k అవుతుంది https://amzn.to/3GA5EqT

3BHK House Construction Cost :

సిమెంట్ :

సిమెంట్ 53grade లేదా 43గ్రేడ్ సిమెంట్ వాడుతారు ఇవీ సుమారుగా 700 బాగ్స్ అవసరం ఉంటాయి ఇప్పుడు మార్కెట్ రేట్ one bag cost  300/ నుంచి స్టార్ట్ అవుతుంది ఏరియా బట్టి మారుతుంటుంది.సిమెంట్ కి అయ్యే ఖర్చు  700*300=210000/ అల్ట్రాటెక్ సిమెంట్ వాడితే చాల మంచిది ఇల్లు  దృడంగా ఉంటుంది.

SAND / ఇసుక :

ఇసుక అనేది 30units వరకు అవుతుంది ఒక యూనిట్(one tractor )  రేట్ ఇప్పుడు 2000/ వుంది అంటే 30*2000/=60000/ వరకు ఇసుక కాస్ట్ ఉంటుంది .ఇసుక అనేది మంచిదా లేదా అనేది చూసికోవాలి ఎక్కవ మట్టి మరియు రాళ్లు కలిసిన ఇసుక తెచ్చేస్తున్నారు దీని వలన గోడలు పగుళ్లు వచ్చేస్తాయి , మట్టి రాయా  కలిసినట్లు అయితే బాగా జల్లిడించి వాడుకోవాలి .

bricks / ఇటుక :

ఇప్పుడు బ్రిక్స్ లో చాల రకాలు వచ్చేశాయ్, ఇప్పుడు ఎర్ర ఇటుక గురించి చెప్పినట్లు అయితే 20000 ఇటుకలు సుమారుగా ఉండాలి one brick 10rs ఉంటుంది (మంచి ఇటుక అయితే) 2bhk house కి బ్రిక్ cost 20000*10=200000/ అదే సిమెంట్ ఇటుక అయితే 170000/ అవుతుంది .

concrete/పిక్కా :

40mm మరియు 20mm కలిపి 20యూనిట్స్ ఉండాలి ఒక యూనిట్ ధర 5000/ ఉంటుంది 20*5000=100000/, 40mm అనేది footings మరియు ఫ్లోరింగ్ కి ఉపాయాగిస్తారు , 20mm పిల్లర్స్ , స్లాబ్ ,భీమ్స్ కి ఉపయోగిస్తారు .

ఐరన్ / ఇనుము :

ఐరన్ అనేది ఇంటికి వెన్నుఎముక లాంటిది, ఇల్లు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఐరన్ మంచి క్వాలిటీ తీసికోవాలి, TMT BAR ఐరన్ వాడాలి లోకల్ వి వాడకూడదు . ఐరన్ 5ton అవసరం ఉంటుంది one ton cost 70000/ఉంటుంది 5*70000=350000/ ఇవి ఏరియా బట్టి మేస్ట్రీ బట్టి మారుతాయి .

doors అండ్ windows :

వీటికి సుమారుగా 350000/ వరకు అవ్వచ్చు . ఒకప్పుడు చాల మంది డోర్స్ కి విండోస్ కి టేక్  వాడేవారు ఇప్పుడు మెయిన్ డోర్ కి టేక్ డోర్ తీసికొని మిగిలినవాటికి WPC డోర్స్ పెట్టుకుంటున్నారు విండోస్ కి UPVC పెట్టుకుంటూన్నారు లుక్ కోసం ఏమి పెట్టుకున్న ఐరన్ గ్రిల్ అనేది విండోస్ కి డోర్స్ కి పెట్టించికోవాలి . దొంగతనాలు జరగకుండా ఉండాలి అంటే .

ceiling:

2bhk house ceiling కి ప్లైన్ అయితే 50k అదే డిజైన్ అయితే 100000/ అవుతుంది . చాల మంది లుక్ కోసం లోపల gypsum ceiling పెట్టించుకుని బయట వరండాలో యూపీవీసీ ceiling చేయించుకుంటున్నారు , ఇప్పుడు లేటెస్ట్ మోడల్ 

ELECTRICAL / PLUMBING / PUTTY PAINT :

2BHK హౌస్ కి ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ కి మెటీరియల్ తోమీడియం అయితే  250000/ HIGH అయితే 350000/అవ్వవచ్చు అలాగే పుట్టి పెయింట్ కి 150000/వరకు అవుతుంది లోపల బయట .

tiles /granite /మార్బల్స్ :

వీటికి 200000 to 250000/ వరకు అవుతుంది .అలాగే plain cupboard 4lakh వరకు అవుతుంది అదే ప్లైవుడ్ cupboard వర్క్ కు 8lakh వరకు అవ్వచ్చు , తరువాత SS railing 40k , zinc pipe 20k , gate 50k , gas railing 25k వరకు అవ్వచ్చు .

labor mastery:

వీలు ఏరియా బట్టి SFT కి 350 to 400/ ఛార్జ్ చేస్తారు అంటే 525000 to 600000/ వరకు కూలీలు అవుతాయి అదే మాటేరియాలతో అయితే low cost SFT : 2000/ middle cost : 2300/ high cost SFT : 2500/ ఈ SFT AREA కొలతలు SLAB ఏరియా బట్టి తీసికుంటారు . 

మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకున్నపుడు మీరు దగ్గర వుండి కట్టించుకుంటే బెటర్ బిల్డర్ కి ఇచ్చే బదులు అలాయితే one or two lakh వరకు సేవ్ అవుతారు ఒకవేళ మీకు వీలు అవ్వనట్లు అయితే మంచి బిల్డర్ కి మీకు తెలిసిన వారికీ ఇచ్చి అగ్రిమెంట్ రాపించుకొని ముందుకు సాగవచ్చు .

ఇల్లు కట్టుకొనే విధానం step by step process :

* ముందుగా స్థలాన్ని(ఇల్లు కట్టుకున్నప్లేస్)  శుభ్రం చేసికోవాలి (క్లీనింగ్ ) ఆ తరువాతసాయిల్ 

soil test :

 “soil” test చేసికోవాలి 6′ to 20′ వరకు మట్టిని(layer కి layer కి ఎర్రమట్టి మరియు తెల్లమట్టి ) చెకరించి టెస్టుకి పంపించాలి. site కి చుట్టువైపులా లేదంటే site ki ముందు వెనుక భాగం వరకు మట్టిని చెకరించి test కి పంపించాలి . “soil test” ఎందుకుఅంటే రిపోర్ట్ వచ్చినాక రిపోర్ట్ బట్టి గోతులు ఎంతలోతు తీయాలి ఎంత వెడల్పు తీయాలి ఎంత ఎంత కాంక్రేట్ వేయాలి,ఏ ఏ కాంక్రెట్ వాడాలి, ఎంత  ఎంత rod లు ఉపయోగించాలి ఇలా ప్రతి పాయింట్ (పని గురించి ) “soil test ” పైనా ఆధారపడుతుంది . ఎన్ని ఫ్లోర్స్ ( stair లు ) కట్టుకోవచ్చు అనేది కూడా తెలుస్తుంది . రిపోర్ట్ బట్టి work అనేది start చేయాలి.

* “Siddhanth” లేదా “engineer’ దగ్గర ప్లాన్ తీసికోవాలి, తరువాత సైట్ మొత్తం(ఇల్లు కట్టుకున్న ప్లేస్ ) కొలతలు తీసికొని సున్నము తో మార్కింగ్ చేసికోవాలి( మూలమట్టం సరిచూసికోవాలి ఇది చాల ఇంపార్టెంట్ )    

శంకుస్థాపన చేయాలి తరువాత work అనేది start చేయాలి (అవుతుంది )

* footings కోసం సున్నం తో మార్కింగ్ చేసికొని గుంతలు తీయాలి (గుంతలు అనేవి 4’*5′ లేదా 5’*5′ లేదా 5’*6′ తీసికోవాలి అలాగే వీటి mat 4*4 సైజు లో ఉండాలి . కొలతలు(మార్కింగ్ ) అనేవి చాల జాగ్రత్తగా చూసికోవాలి ఒకటికి పదిసార్లు, అలాగే  మూలమట్టాలు సరిచూసికోవాలి ఇది చాల ఇంపార్టెంట్ .

* ఈ శాన్యం లో బోర్ (pump ) వేయించుకోవాలి  

3BHK House Construction Cost :

pillars:

* తరువాత గుంతలో PCC work (40mm concrete) చేయాలి. తరువాత “పిల్లర్ కోసం” మార్కింగ్ చేసికోవాలి, pillars అనేవి మీ ఇంటి సైజు బట్టి 9″*9″ లేదా 9″*12′ వరకు తీసికోవాలి (గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు అయితే 9″*9″ లేదంటే ఇంటిపైన ఒకటి లేదా రెండు ఫ్లోర్స్ వేసినట్టులు అయితే 9″*12′ పిల్లర్లు  వేసికోవచ్చు), పిల్లర్స్ కి బాక్స్ లు అమెరిసికొని(పెట్టుకొని) నేలమట్టం వరకు (5′) పిల్లర్స్ వేసికోవాలి .    

* ఐరన్ రాడ్లు అనేవి mat కి 6mm లేదా 8mm వాడవచ్చు పిల్లర్స్ కి అయితే 10mm లేదా 12mm వాడవచ్చు (12mm బెటర్ అది మీ బడ్జెట్ బట్టి ) 

plinth beam:

* ఆ తరువాత  ప్లింత్ భీం వేసికోవాలి కొంతమంది రెండు “plinth beam” లు వేసికుంటారు అది వాళ్ళ బడ్జెడ్ బట్టి (నేలమట్టం లోపల 4′ లేదా 3′ లోతు గొయ్యలు తీసి  పిల్లర్స్ చుట్టూ ఒకటి వేసికొని మట్టిపిల్ చేసికొంటారు  నేలమట్టం వచ్చినాక సెట్ బ్యాక్(setback) లని కలిపికొని రూమ్స్, bathrooms, హాల్స్, కిచెన్ కి, ప్రతి వాల్ కి  కలిపి ఒక “ప్లింత్ భీం” వేసికొని మట్టి పిల్ చేసికుంటారు).

* “ప్లింత్ భీమ్” వేసికోవాలి అంటే ముందుగా సువ్వలు (8mm లేదా 10mm ) కట్టుకోవాలి, అలాగే ఈ “ప్లింట్ భీమ్” ని కొంతమంది “iron boards  ” (సెంటరింగ్ చేసికొని ), మరికొంతమంది సువ్వలు చుట్టు బ్రిక్ (ఎర్ర ఇటుక ) పెట్టుకొని కట్తారు(బడ్జెట్ ఎక్కువ అవుతుంది strong ఉంటుంది), మరికొంతమంది చెక్కలు పెట్టి కట్తారు.

* ఈ “ప్లింత్ భీము” పైన చిన్న పాటి గీతాలు పెట్టుకోవాలి ఎందుకు అంటే ఇక్కడనుంచి ఇంటికి సంబంధించి వాల్స్ కట్టుకోవాలి కాబట్టి (ప్లింట్ భీమ్ కి వాల్స్ కి మధ్య గ్రిప్ కోసం లేదా పైన కట్టిన గోడకి బలం కోసం )

* ఇక్కడనుంచి “starter” లు పెట్టుకొని కొలతలు ఒకటికి పదిసార్లు చెక్ చేసికోవాలి చెక్ చేసికున్నాక “lintel  level” వరకు పిల్లర్స్ వేసికోవాలి (vibrate ఉపొయాగించాలి) .Are you looking for house!

3BHK House Construction Cost :

walls :

* ఇక్కడనుంచి గోడలు కట్టుకోవాలి “లింటల్ లెవల్” (సన్ షేడ్ వరకు 7′) వరకు , కిటికీలు దగ్గర గ్యాప్ ఇచ్చి లింటల్ లెవెల్ వరకు గోడలు కట్టొకొవాలి .( outer walls 9″ మరియు inner walls 4″) అలాగే 9″ వాల్స్ కి ఐదు వరసలు తరువాత “సూదిరాయ్” వరుస కట్టుకోవాలి అదే 4″ వాల్స్ కి 3ఫీట్ కి లింటల్ ఇవ్వాలి, వీటివల్ల  గోడలు గట్టిగ ఉంటాయి.  

* గోడలకి ఎప్పడికప్పుడు లోపల బయట  “పాయింటింగ్” చేసికోవాలి, అలాగే క్యూరింగ్ (వాటరింగ్ )ఇంపార్టెంట్

* బేస్మెంట్ పైన దర్వాజాలు(గుమ్మాలు) పెట్టుకోవాలి , ఇంటికి ఎన్ని డోర్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో (సరిసంఖ్యలో ఉండాలి ) అన్ని దరవజాలు పెట్టుకోవాలి .

* ఆ తరువాత “సెప్టిక్ ట్యాంక్ ” తీసికొని “ప్లంబింగ్ వర్క్” కనెక్షన్స్ ఇచికోవాలి , చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి సహజం .

* “లింటల్ లెవెల్” వరకు గోడలు కట్టినాక లింటల్ పోసికోవాలి  ఆ తరువాత స్లాబ్ వరకు కట్టుబడి కట్టేయాలి   అలాగే లింటల్ వేసికున్నప్పుడే ఒక వరుస మెట్టులు (స్టెప్స్ ) లాండింగ్ కట్టుకోవాలి, తరువాత స్లాబ్ వేసినాక రెండవ వరుస మెట్టులు లాండింగ్ కట్టుకోవాలి 

slab :

* ఆ తరువాత స్లాబ్ కోసం సెంటరింగ్ పెట్టుకోవాలి, సెంటరింగ్ అనేది స్లాబ్ వేసినాక 15 to 20డేస్ తరువాత తీసికోవచ్చు. స్లాబుకి (8mm or 10mm ) రాడ్స్ ఉపయోగించవచ్చు, స్లాబ్ వేసినాక స్లాబ్ పైన ఒక వరుస బ్రిక్ వరుస రూమ్ రూమ్ కి కట్టుకోవాలి క్యూరింగ్ (water filling చేయాలి ) చేసినప్పుడు వాటర్ అనేది బయటకు పోకుండా ఉండడానికి (25 to 30days వాటరింగ్ చేయాలి స్లాబుకు)

* slab వేసినప్పుడే ఎలక్ట్రికల్ పైప్స్ స్లాబ్ పైన అవసరమైనవి పెట్టుకోవాలి అలాగే “Elect ration” ఉండాలి. స్లాబుకి సెంటరింగ్ తీసినాక అవసరమైన దగ్గర గోడలు కట్ చేసి ఎలక్ట్రికల్ & ప్లంబింగ్ వర్క్ స్టార్ట్ చేయాలి.స్లాబ్ పైన వాటర్ ట్యాంక్ పెట్టుకొని కనెక్షన్ పెట్టుకోవాలి 

* తరువాత ఇన్నర్ మరియు ఔటర్  ప్లాస్టరింగ్ చేసికోవాలి టైల్స్ వచ్చినదగ్గర rough work చేయాలి తరువాత కొంచెం గ్యాప్ తీసికొని వైట్ వాష్ (Birla) చేయంచాలి   

* ఇక్కడనుంచి మిగిలిన పనులు  రోజుకి ఎన్నయిన చేయించుకోవచ్చు  అంటే ఒక వైపు “ఎలేవేషన్” ఒక వైపు “ceiling”, ఒకవైపు putty(wall care putty పెట్టించికోవాలి) and painting,  తరువాత ఫ్లూరింగ్, తరువాత “tiles and  గ్రానైట్” వర్క్. ఇలా వర్క్స్ అన్ని ఒకదాని తరువాత ఒకటి చేయించికోవాలి .

* “windows” కి ముందుగా “safety grills” పెట్టుకోవాలి తరువాత UPVC windows install చేసికోవాలి (look కోసం UPVC better )

* ceiling  లోపల gypsum తో చేయించి బయట PVC ceiling చేయించుకోవాలి look బాగుంటుంది 

* టైల్స్ వర్క్ అయినాక polish చేయించాలి అలాగే స్టెప్స్ కి గ్రానైట్ వేయించాలి look కోసం.

* కాంపౌండ్ వాల్ డిజైన్ చేయించి గేట్ పెట్టుకోవాలి అలాగే స్టెప్స్ కి “SS  railing” అలాగే ఎలేవేషన్ కి “గ్లాస్ వర్క్” చేయించుకోవాలి ఇంతటితో ఇల్లు ఫినిష్ అయిపోతుంది.        

Best House construction
best home design tips