Open Kitchen Design| Kitchen Design Ideas | మోడర్న్ కిచెన్ డిజైన్ ఐడియాస్ !

Open Kitchen Design| Kitchen Design Ideas | మోడర్న్ కిచెన్ డిజైన్ ఐడియాస్ !

Open Kitchen Design : ఇంటిలోని ముఖ్యమైనది వంటగది ఒకటి. ప్రస్తుతము వీటిలో డ్రై కిచెన్ ,వెట్ కిచెన్ అని రెండు రకాలు వున్నాయ్. అయితే వీటీతోపాటు మరొకటి ప్రస్తుతం ట్రెండవుతుంది. అదే ఓపెన్ కిచెన్ . వీటిని విదేశాలలో బాగా డిజైన్ చేసికుంటారు వాడుకుంటారు. ఓపెన్ కిచెన్ అందంగా కనిపించాలి అంటే ఎక్కువ క్యాబినెట్లు వుండాలి.

ఓపెన్ కిచెన్ కాన్సెప్టులో వంటగదిని విభజిస్తూ ఏ రకమైన గోడలు ఉండవు . కిచెన్ తో పాటు డైనింగ్ హాల్ , లివింగ్ రూమ్ కలిసి ఉంటాయి ఇది ఇప్పుడున్న ట్రెండ్ . ఈ రకమైన డిజైన్ లో ఇల్లు చాల విశాలంగా కనిపిస్తుంది. వెంటిలేషన్ బాగుంటుంది. వేడి ఉక్కపోత అంతగా వుండవు.అయితే కొందరకి ఇలా ఓపెన్ గా వంట చేయడం నచ్చకపోవచ్చు. అలాంటివారికి క్లోజ్ద్ కిచెన్ బెటర్ .https://amzn.to/40OmQQm

వంటగదికి కావలిసిన రూమ్ సైజెస్ :

 

ముందుగా కిచెన్ room size అనేది minimum 5′ *7′(5 అడుగులు వెడల్పు* 7అడుగులు పొడవు ) ఉండాలి maximum అనేది మన ఇష్టం అలాగే కిచెన్ entrance door size minimum 2′.6″ ఉండాలి ఎందుకంటే మనం ఏవైనా మెటీరియల్ వంటగదిలో పెట్టాలన్న మనకు ఆ మాత్రం place ఉండాలి అలాగే వాస్తు ప్రకారం ఆగ్నేయం లో మాత్రమే కిచెన్ ఉండాలి ఈ మధ్యన అందరు open kitchen అంటే ఇష్టపడుతున్నారు అదే closed kitchen అయితే కిచెన్ కి dining కి మధ్యలో ఒక రంద్రం లాంటిది ఉంటే బాగుంటుంది easy గా సర్వీస్ చేసికోవచ్చు.

ఇల్లు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలి అని ప్రతిఒక్కరు కోరుకుంటారు.అందుకే ప్రతివిషయంలో శ్రద్ద తీసికుంటారు కానీ వంటగది విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుంటారు, అలాగే వంటగదికి చాలామంది ప్లేస్ తక్కువ ఉంచుకుంటారు. మోడరన్ గా డిజైన్ చేసికోవాలంటే కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంచవలిసిందే ఎందుకంటే, ప్రస్తుతం వున్నా ట్రెండ్ బట్టి రెఫ్రిజిరేటర్ పెట్టుకోవాలన్న, డిష్ వాషెర్ వాడకం క్రమేపి పెరుగుతుంది అందువలన ప్లేస్ అనేది ఎక్కువ వుండేటట్లు చూసికోవాలి . 

ఎకో ఫ్రెండ్లీ కిచెన్ :

మనం పాతరోజుల్లో రాగి ,ఇత్తడి ,మట్టి పాత్రలు వాడేవాళ్ళము. తరువాత  వీటిప్లేసులో ఉక్కు ,ప్లాస్టిక్ ,టాప్పర్ వేరే వస్తువులు వచ్చాయి అయితే వంటగదిని ఎకో ఫ్రెండ్లీ మార్సాలి అంటే వంటగదిలో చెక్కపాత్రలు ఉపయోంచడం మంచిది ఎందుకంటే ఇవి మన్నికయినది ఆహారం చెడిపోయే ప్రమాదం తక్కువ. మార్కెట్లో చెక్కతో చేసిన  గరిటలు, స్పూన్లు , ప్లేట్స్ దొరికితాయ్, చెక్కతో చేసిన వంటపాత్రలు వల్ల ఆహారం రుచిని, వాసనని కోల్పోదు. ఇవి తుప్పుపట్టావు . వీటిని సక్రముగా ఉపయోగించునట్లుఅయితే ఎక్కువకాలం మన్నిక వస్తాయ్.చెక్కతో చేసిన వంటపాత్రలు సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయ్.పైన్ ,ఓక్ , టేకు వంటి కలపతో చేసిన చెక్క వంటపాత్రలను ఉపయోగించవచ్చు .

ఇంటిలో రెండు కిచెన్లు :

వంటగదిని ఈ మధ్య ఫాషన్గా మార్సెశారు, డ్రై కిచెన్ , వెట్ కిచెన్ అంటూ లేదంటే అన్నదమ్ములు లేదా తల్లిదండ్రులతో గొడవలు పడి రెండు రకాల వంటగదులను ఏర్పాటు చేసికుంటున్నారు. నిజానికి కిచెన్ ఒకటే ఉండాలి అది ఆగ్నేయంలో ఉండాలి.ఒక ఇంటిలో రెండు పొయ్యలు మంచివి కాదు కావాలంటే పై పోర్షన్లో ఈశాన్యం లో కట్టుకోవచ్చు లేదంటే ఇంటిని రెండు భాగాలుగా చేసి వంటగదిని పెట్టుకోవచ్చు. వాస్తుప్రకారంగా కుటంబాలలో విభేదాలు రాకుండా ఉండడానికి మనపెద్దలు చెప్పేవారు .

మాడ్యులర్ కిచెన్ కు ఈ ఎం ఐ :

Open Kitchen Design ప్రస్తుతకాలంలో మాడ్యులర్ కిచెన్ కి ఆధరణ పెరుగుతుంది, వంటగదిని అందంగా మర్సుకోవాలని కోరిక అందరిలోన ఉంటుంది. రంగు రంగుల డిజైన్ల ఉన్న క్యాబినెట్స్ ,గ్రానైట్ ట్యాప్ ,గ్లాస్ హబ్ ,బాస్కెట్ష్ , గ్లాస్ చిమ్ని,ఒవేన్ ,డిష్ వాషర్  ఇలా ప్రతి వస్తువు ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటాం,అలాగే వీటిలో వంటపాత్రలు పెట్టుకోవడానికి వీలుగా ఫుల్లౌట్ డ్రా లూ ,షట్టర్స్ ఉంటాయి. హై అండ్ నుండి మధ్యతరగతి కుటంబాలు వరకు అందరు వీటిపైనే మొగ్గుచూపిస్తున్నారు . అయితే దీని కోసం కాస్త కర్సు చేయవలిసి ఉంటుంది అయితే అందరకి వీలు కాకపోవచ్చు.అందుకోసమే వచ్చాయి ఈ ఎం ఐ modular కిచ్చెన్స్.వివిధ సంస్థలు వినియోగదారుల అభిరుషికి తగ్గట్లు కిచెన్స్ తయారీ చేస్తున్నాయ్ . దీనికోసం మీరు ఎంచుకున్న మోడల్ కు అయ్యే కర్షు లో పది శాతం సొమ్ము చెల్లించాలి . ఆ తరువాత తయారీ సమయంలో 40% సొమ్ముజమచేయాలి .ఇంటికి వచ్చినాక మిగిలిన 50% ఇచ్చేయాలి .

వంటఇంటికి బ్లాక్ బోర్డు :

వంటగదిలో బ్లాక్ బోర్డ్ ఎందుకంటే, వంటగదిలో ఎన్ని సరుకులు వున్నాయ్ ఎన్ని అయిపోయాయి ఏవి కావాలి అని గుర్తుపెట్టుకోడానికి బ్లాక్ బోర్డు ఉపాయాగపడుతుంది .ఒక ఒక సారి మనకు గుర్తువుండదు వంటచేసేటప్పడు గుర్తుకువస్తయ్ అప్పుడుకప్పుడు దగ్గర్లోని షాపుకి పరుగెత్తుతుంటాం దీనికి పరిస్కారం బ్లాక్ బోర్డు. అప్పుడుకప్పుడు ఏ సామానులు అయిపోయిన బోర్డు మీద రాసికొని గుర్తుపెట్టుకోవచ్చు .

క్లౌడ్ కిచెన్ అంటే ఏమిటి :

క్లౌడ్ కిచెన్ ని డార్క్ కిచెన్ , ఘోస్ట్ కిచెన్ లేదా వర్చువల్ రెస్టారెంట్ అని కూడా అంటారు.క్లౌడ్ కిచెన్  అనే మాట ఈ మధ్యన తరుసుగా వింటున్నాం. క్లౌడ్ కిచెన్ అనేది ఈ మధ్యన చాల ప్రాముఖ్యతని(ప్రాచుర్యం పొందాయి ) సంపాదించింది.వీటిని చాల మంది బిజినెస్ స్టార్టుప్ గ ఎంచుకుంటున్నారు. ఇందులో కూర్చొని భోజనం చేయడానికి స్థలం వుండదు. ఆన్లైన్ లో మాత్రమే ఆర్డర్ చేసికోవాలి .వీటికి తక్కువ బడ్జెట్ తో  బిజినెస్ స్టార్ట్ చేసికోవచ్చు.వీటికి రెస్టారెంట్ స్థలం ,సిబ్బంది, maintenance అవసరం లేదు. తక్కువ బుడ్జెటుతో ఎక్కువ కస్టమర్లుని సంపాదించవచ్చు. కస్టమర్స్ ఎక్కడనుంచియైన ఆర్డర్ చేసికోవచ్చు.పెట్టుబడి శ్రమ తక్కువ రాబడి ఎక్కువ . మనఇంటిలో అయినా వంటలు వండుకోవచ్చులేదా వేరేగా ఎక్కడైనా రూమ్ తీసికోవచ్చు .ఫుడ్ డెలివరీ యాప్ లతో మరియు రెస్టారంట్ లతో కూడా టై అప్ అవచ్చు. 

వంటగదిలో దుర్వాసన నివారణ :

Open Kitchen Design సహజంగా కిచెన్లో గిన్నెలు తోమినప్పుడు సింక్ వద్ద నీరు చేరడం  లేదా వాటర్ నిల్వవుండడం లేదంటే లీకేజీ అవ్వడం ఇలా చాల కారణాలు చెప్పవచ్చు. వీటివల్ల నీరు అరకపోవడం దుర్వాసన రావడంతో పాటు బాక్టీరియా కూడా రుద్ది చెందుతుంది.వీటిఅన్నిటికి పరిస్కారం వాటర్ ప్రూఫ్ టేప్ తో చెక్ పెట్టచ్చు. ఇది తడి వాతావరణంలో అతికే గుణాన్ని కలిగి ఉంటుంది. వీటిని సింక్ లవద్ద మూలల్లో అతికించడానికి వీలుగా ఉంటుంది.వీటిని వంటగదిలో అతికించడం వలన సింక్ పై నుంచి వాటర్ కిందకు పొర్లదు.వీటివల్ల వంటగదికి మంచి లుక్(ప్రత్యేక ఆకర్షణ ) వస్తుంది .

Open Kitchen Design| Kitchen Design Ideas | మోడర్న్ కిచెన్ డిజైన్ ఐడియాస్ !
Open Kitchen Design| Kitchen Design Ideas | మోడర్న్ కిచెన్ డిజైన్ ఐడియాస్ !

చిమ్ని ఉపయోగాలు :

ప్రస్తుతకాలంలో చిమ్ని అనేది వంటగదిలో తప్పనిసరి వస్తువు అయ్యిపోయింది. ఇది వంటచేసినప్పుడు వంటగదిలో వేడిని బయటకు పంపిస్తుంది.అలాగే వంటచేసి సమయంలో పొగ,నూనె కణాలు , ఇతర దూళికణాల్ని బయటకు పంపిస్తుంది.అయితే దీన్ని నిత్యము మనం వాడడం వలన జిడ్డుగా మారుతుంది .దీని వల్ల చిమ్ని సామర్థ్యం తగ్గిపోతుంది.దీనిని ఎప్పటికిఅప్పడు క్లీన్ చేసికోవాలి లేకపోతె అందులో ఫిల్టర్ పోతుంది అలాగే కిచెన్ మొత్తం ఆయల్ మరకలతో అపరిసుబ్రాంగా కనిపిస్తాయి .

చిమ్నిని శుబ్రపరిసేముందు ముందు దాని స్విచ్ ఆఫ్ చేయాలి.తరువాత చిమ్ని లోని  అన్నిభాగాలను వేరు చేయాలి. చిమ్ని లో ముఖ్యమైన భాగం ఫిల్టర్ ఇందులో ఎక్కువ మురికి వుంటుంది కాబట్టి పిల్టరుని వేరుచేసి డిటర్జెంట్ లేదా వెనిగర్ వేసిన వేడినీటిలో అరగంట చేపు వుంచాలి ఆ తరువాత బ్రష్ తో శుభ్రం చేయాలి.తరువాత నీటితోసుభ్రం చేయాలి మిగిలిన భాగాలను స్పాంజ్ తో శుభ్రం చేయాలి. అన్నిభాగాలను ఎండలో ఎండబెట్టినాక అమర్చాలి .

కిచెన్ జాగ్రత్తలు :

*కిచెన్ని ఎప్పటికప్పుడు పరిశుబ్రాంగా వుంచుకోవాలి, పరిశుబ్రాంగా లేకపోతె అనారోగ్యం పాలయ్యే ప్రమాదం వుంది.ఈగలు, దోమలు, బొద్దింకలు,ఇతర సూక్మజీవులు వంటఇంటిలో చేరకుండా తగిన జాగ్రత్తలు తీసికోవాలి 

*వంటిళ్ళు ఎప్పుడు పొడిగా, శుభ్రాంగా ఉండేటట్లు చూసికోవాలి ముక్యంగా సింక్ లో ఎక్కువ క్రిములు చేరే అవకాశం వుంది కాబట్టి సింక్ క్లీన్ చేసినాక యాంటీ బాక్టీరియా స్ప్రే ని సింక్ లో చల్లాలి అలాగే గిన్నులు శుభ్రం చేసే స్పాంజ్ లను కూడా ఎప్పటికి అప్పుడు శుభ్రం చేసికోవాలి అలాగే ఎప్పడికి అప్పుడు మారుస్తుండాలి .

అలాగే సింకులను క్లీన్ చేసే బ్రష్ ని కూడా ఎప్పటికి అప్పుడు క్లీన్ చేయాలి మారుస్తుండాలి అలాగే మన చేతులని కూడా ఎప్పడికి అప్పుడు సబ్బుతో కడుక్కుని పొడిగుడ్డతో తూడిచికొవాలి . పొడిగుడ్డ ఎప్పటికి అప్పుడు ఉతికి ఆరబెట్టాలి .