Smart Home Automation System! స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ ఎలా పని చేస్తుంది?
Smart Home Automation System:
Smart Home Automation System: స్మార్ట్ హోమ్స్ అంటే ఇంటిలో ఉండేవారి పనిని తేలిగ్గా చేయడం.ఇంటిలోని ఉపకరణాలు,పరికరాలు వివేకంతో పనిచేయడం.గదిలోకి వెళ్ళగానే లైట్ వెలిగి..బయటకు రాగానే ఆరిపోయేలా సెన్సర్లతో పనిచేసేలా ఏర్పాటు చేసికుంటే ఆ ఇల్లు స్మార్ట్ అవుతుంది.అలసిపోయి ఇంటికి వచ్చి సోఫాలో కూలబడి లైట్ వేయగానే సంగీతం కూడా వినపడితే ఆలసిన మనసుకు చాల సంతోషం కలుగుతుంది.ఈ తరహా స్మార్ట్ పరికరాలు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటిలో సాధారణం కాబోతున్నాయి.గది ఉష్ణోగ్రతను బట్టి ఫ్యాన్,ఏసీలు పనిచేయడం వరకు ఇలాంటివి చాలానే వున్నాయ్.
ఇంటికి చేరువలో ఉన్నప్పుడే మొబైల్ ఆధారంగా ఏసీ ని ఆన్ చేస్తే ఇంటిలో అడుగుపెట్టేసరికి చల్లదనం స్వాగతం పలుకుతుంది.ఇంటిలో పిల్లలు ఒంటరిగా ఉంటే వైఫై సెక్యూరిటీ కెమెరాతో మొబైల్ నుంచే వారిని ఓ కంట కనిపెట్టవచ్చు. అంతే కాకుండా స్మార్ట్ సెన్సర్స్లు ఇంటిలోని ఏ బాగంలోనైనా నీటి లీకేజీ,గ్యాస్ లీకేజ్,మంటలను గుర్తించి రిపోర్ట్ చేస్తాయ్.ఇలా ఫ్రిడ్జ్ లనుంచి మైక్రోవేవ్లు,వాచింగ్ మెషిన్ ల వరకు అన్ని స్మార్టుగా మారాయి.
స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ అంటే ఏమిటి? (Smart Home Automation System)
ఇటీవలి కాలంలో టెక్నాలజీ మన జీవనశైలిని పూర్తిగా మార్చేస్తోంది. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్‌గా అనిపించిన “స్మార్ట్ హోమ్” కాన్సెప్ట్, ఈ రోజుల్లో సాధారణ ఇళ్లలో కూడా వాస్తవంగా మారింది. స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ అంటే – మన ఇంట్లోని లైట్లు, ఫ్యాన్లు, ఏసీ, టీవీ, కర్టెన్లు, డోర్ లాక్స్, సెక్యూరిటీ కెమెరాలు, గీజర్, కిచెన్ అప్లయన్సులు వంటి వాటిని ఇంటర్నెట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆటోమేటిక్‌గా నియంత్రించే వ్యవస్థ.
వివరంగా చెప్పాలంటే, మీరు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా – మీ ఇంటి పరికరాలన్నింటినీ ఒకే మొబైల్ ఫోన్, టాబ్లెట్ లేదా వాయిస్ కమాండ్స్‌తో కంట్రోల్ చేయగలగడం….వీటినే స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ అని అంటారు.
స్మార్ట్ డివైసెస్:Smart Home Automation System:బెస్ట్ ఆఫర్స్ కోసం https://amzn.to/3ZLHXln
ఇవి ఇంట్లో ఉపయోగించే స్మార్ట్ లైట్లు, స్మార్ట్ స్విచ్‌లు, స్మార్ట్ ప్లగ్‌లు, స్మార్ట్ సెన్సార్లు, స్మార్ట్ కెమెరాలు, స్మార్ట్ లాక్స్ మొదలైనవి.
సాధారణ ఇళ్ళకూ ఎలా పనిచేస్తుంది:
సాధారణ ఇల్లుకు ఈ టెక్నాలజీని వినియోగించుకొనే ఒరవడి నగరంలో క్రమంగా పెరుగుతుంది.ఈ – కామర్స్ వెబ్సైట్లలో, కొన్నిఎలక్ట్రానిక్స్ దుకాణాలలో దొరికే స్మార్ట్ పరికరాలను ఈ ఇళ్లలో అమురుస్తుంటారు.శివారు ప్రాంతాలలో ఎక్కువుగా వీటి ఏర్పాట్లకు ఆసక్తి చూపిస్తున్నారు.కొన్ని విద్యత్తు సదుపాయంతో పనిచేస్తే మరికొన్ని బ్యాటరీల సాయంతో పనిచేస్తాయి. అలాగే వైఫై ఆధారంగా పనిచేసే స్మార్ట్ స్విచ్లు వచ్చాయి.టీవీ లు ఏసీలు మాత్రమే కాదు ఇంటిలో బల్బులు,ఫ్యాన్లు,స్టీరియోలు కుడి రిమోట్ తో నియంత్రించవచ్చు.
క్లీనింగ్ వరకు ఏ విదంగా పనిచేస్తుంది.
తీరిక లేకుండా వుండే వారికీ ఇంటిని శుభ్రం చేసే స్మార్ట్ క్లీనింగ్ రోబోలు వచ్చాయి.వాక్యూమ్ క్లీనర్ అనగానే ఎక్కడో అల్మారాలో దాచిన దాన్ని బయటకు తీసి శుభ్రం చేయమంటే బద్దకిస్తుంటారు.చిన్న పరిమాణంలో వచ్చిన ఈ క్లీనింగ్ రోబో సులువుగా శుభ్రం చేస్తుంది.మూలలు,ఫర్నిచర్ అడుగుభాగం అన్ని చోట్లకు వెళుతుంది.క్లీనింగ్ రోబోలతో ఏ రోజు, ఏ సమయంలో శుభ్రం చేయాలో ఆదేశాలు ఇస్తే చాలు దానంతట అది పనిచేసికుంటూ పోతుంది.
ఊరు శివార్లలో ఎలా ఉపయోగపడుతుంది:
ఊరు,వీధి శివార్లలో దొంగతనాల భయం వెంటాడుతుంది.పండగ సెలవల్లో,ఎక్కడకైనా కొద్దిరోజులు పాటు విహార యాత్రకు వెళ్ళితే ఇంటి భద్రత పైనే ఎక్కువమంది ఆందోళన చెందుతుంటారు.స్మార్ట్ హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటె భరోసాగా ఉండవచ్చు.అనుమతి లేకుండా ఎవరైనా ప్రవేశిస్తే…సెన్సర్లు సాయంతో గుర్తించవచ్చు.దొంగలు తలుపులు,కిటికీలు బద్దలు కొట్టే సమయంలో వచ్చే శబ్దం ద్వారా..లింక్ చేసిన ఫోన్ కు అలెర్ట్ మెసేజ్లు వస్తాయ్.ఆ సమయంలో ఇంటిలో ఏం జరుగుతుందో వీడియో ఆన్ చేసి చూసికోవడంతో పాటు ప్రవేశించిన వారి ఫోటోలను తీసికొని పోలీసులకు సమాసారం ఇవ్వచ్చు.ఇంటిలో/ఆఫీసులలో ఫైర్ అయితే వాటిని నియంత్రించే టిప్స్ కోసం ఈ లింక్ https://impresshomedesigners.com/fire-extinguisher-types/?
ఎక్కడ నుంచైనా పర్యవేక్షించవచ్చు:Smart Home Automation System
ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత బల్బులు,ఏసీ కట్టేశామ…ఇంటికి తాళం వేశామా… వంటి సందేహాలు చాల మందిలో వస్తుంటాయి.కొన్ని ప్రత్యేక డిజైన్లు ఎంచుకోవడం,సాంకేతిక పరికరాల సాయంతో మనం ఎక్కడనుంచియినా పర్యవేక్షించి సౌలభ్యం అందుబాటులో వుంది.యాప్ ని ఇన్స్టాల్ చేసి బయటి నుంచే బల్బులు,ఫ్యాన్లు,ఏసీలు,టీవీలను నియంత్రించే వెసులుబాటు వుంది.అలాగే ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినా,చిన్నారులు మీకంటే ముందు ఇంటికి చేరుకున్న వారు ఇంటిలోకి వెళ్ళడానికి ఇలాంటి సాంకేతికత ఉపయోగపడుతుంది.
స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ భవిష్యత్తు ఏంటి?best offers కోసం https://amzn.to/3ZLHXln
రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఓటిటీ టెక్నాలజీతో స్మార్ట్ హోమ్‌లు ఇంకా ఇంటెలిజెంట్‌గా మారతాయి. మీ అలవాట్లను గమనించి, మీ అవసరాలను ముందుగానే అర్థం చేసుకునే ఇళ్లు సాధ్యమవుతాయి.
భారతదేశంలో స్మార్ట్ హోమ్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. మెట్రో నగరాలతో పాటు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ టెక్నాలజీకి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా కొత్త ఇళ్ల నిర్మాణాల్లో స్మార్ట్ ఫీచర్లు ఒక స్టేటస్ సింబల్‌గా మారాయి.
స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ అనేది కేవలం లగ్జరీ మాత్రమే కాదు – ఇది సౌకర్యం, భద్రత, విద్యుత్ ఆదా, ఆధునిక జీవనశైలిని అందించే ఒక టెక్నాలజీగా మారుతోంది. సరైన ప్లానింగ్‌తో, మీ బడ్జెట్‌కు తగిన విధంగా స్మార్ట్ హోమ్ సెటప్ చేసుకోవచ్చు. భవిష్యత్తు ఇళ్లులు స్మార్ట్‌గా ఉండబోతున్నాయి.
స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ ప్రయోజనాలు/లోపాలు:
*టెంపరేచర్ ఆధారంగా ఏసీ ఆటోమేటిక్‌గా ఆన్/ఆఫ్ అవుతుంది.అది ఎలా అంటే రాత్రి పడుకునే ముందు టైమర్ సెట్ చేసి విద్యుత్ ఆదా చేయవచ్చు.
*సూర్యకాంతి తీవ్రతను బట్టి కర్టెన్లు ఆటోమేటిక్‌గా తెరుచుకోవడం, మూయడం చేయవచ్చు.
*ఒకే యాప్ ద్వారా మొత్తం ఇంటిని నియంత్రించడం చాలా సులభం
*అవసరం లేని సమయంలో పరికరాలు ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గిస్తుంది.
*మీరు ఇంట్లో లేనప్పుడు కూడా ఇంటిపై పూర్తి నియంత్రణ ఉంటుంది.
*స్మార్ట్ హోమ్ మీ ఇంటికి ప్రీమియం ఫీల్ ఇస్తుంది.
*ఇంటర్నెట్ ద్వారా మీ మొబైల్ యాప్, క్లౌడ్ సర్వీసెస్, డివైసెస్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతాయి.
*మీరు మొబైల్ యాప్‌లో ట్యాప్ చేయడం ద్వారా లేదా వాయిస్ కమాండ్ ఇవ్వడం ద్వారా పరికరాలను నియంత్రించవచ్చు.
*టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
*సైబర్ సెక్యూరిటీపై జాగ్రత్త చాల అవసరం.
స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ ఖర్చు ఎంత ఉండచ్చు?
ఈ అంశాలపై ఆధారపడి ఉంటుంది:
*ఇంటి సైజ్
*ఉపయోగించే పరికరాల సంఖ్య
*వైర్డ్ లేదా వైర్‌లెస్ సిస్టమ్
*బ్రాండ్ & ఫీచర్లు
సాధారణంగా:
బేసిక్ సెటప్: ₹20,000 – ₹50,000
మిడ్ రేంజ్ సెటప్: ₹50,000 – ₹1,50,000
అడ్వాన్స్‌డ్ సెటప్: ₹2,00,000 పైగా ఉండవచ్చు ఏరియా బట్టి మారవచ్చు.
మా construction company సర్వీసెస్ : https://impresshomedesigners.com/construction-cost-per-square-feet-residential-construction-cost-per-sq-ft/?
*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ , duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును . మా phone number; 7989312152, 9989456907.

