Fire Extinguisher Types! ఫైర్ ఎక్స్ టింగ్విషర్లు రకాలు?వాటి ఉపయోగాలు?

Fire Extinguisher Types! ఫైర్ ఎక్స్ టింగ్విషర్లు రకాలు?వాటి ఉపయోగాలు?

Fire Extinguisher Types:

Fire Extinguisher Types: అగ్ని ప్రమాదాలు (Fire Accidents)అనేవి ఇళ్లు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, హాస్పిటల్స్, స్కూళ్లు, మాల్స్ వంటి చోట్ల చాలా సాధారణంగా జరుగుతున్నాయి. చిన్న అజాగ్రత్త కూడా పెద్ద నష్టం కలిగించవచ్చు.ఇలాంటి ప్రమాదాల నుంచి మన ప్రాణాలు, ఆస్తిని రక్షించడంలో Fire Extinguisher (ఫైర్ ఎక్స్‌టింగ్విషర్) చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది.

మంటలను ఆర్పేందుకు ఉపయోగించే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లలో చాల రకాలు ఉన్నాయ్.ప్రధానంగా నీటితో చల్లార్చేవి,వెట్ కెమికల్ తో,పౌడర్తో , కార్బెన్ డైఆక్సైడ్తో, నురుగుతో ఆర్పే సాధనాలను ఇళ్లలో అందుబాటులో ఉంచుకోవచ్చు.ఇప్పుడు వాటి గురించి తెలిసికుందాం.

 

స్టాండర్డ్ వాటర్/standard water:

కాగితం, కార్డు బోర్డు, ప్లాస్టిక్, కలప,ఫాబ్రిక్, ఇతరగనపదార్దాలు నుంచి వచ్చే మంటలను ఆర్పవచ్చు.

స్టాండర్డ్ వాటర్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ అనేది మంటలను ఆర్పేందుకు నీటిని ప్రధానంగా ఉపయోగించే అగ్నిమాపక పరికరం. ఇది మంటపై నీటిని చల్లడం ద్వారా వేడిని తగ్గించి (Cooling Effect) మంటను అదుపులోకి తెస్తుంది. ముఖ్యంగా చెక్క, కాగితం, బట్టలు, ప్లాస్టిక్ వంటి ఘన పదార్థాల వల్ల వచ్చే అగ్ని ప్రమాదాలకు ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఈ రకం ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌ను ప్రధానంగా ఇళ్లు, గోదాములు, స్కూళ్లు, కార్యాలయాలు వంటి చోట్ల ఉపయోగిస్తారు. అయితే దీనిని ఎలక్ట్రిక్ మంటలకు లేదా ఆయిల్, పెట్రోల్ వంటి ద్రవ మంటలకు ఉపయోగించకూడదు,. సరైన చోట సరైన ఎక్స్‌టింగ్విషర్ వాడితేనే అగ్ని ప్రమాదాన్ని సురక్షితంగా నియంత్రించగలం.

డ్రైవాటర్ మిస్ట్/Dry water Mist:https://amzn.to/4rczbbU

దీని ద్వారా నీటి రేణువులు పొడి సూక్ష్మకణాలుగ మారి అగ్నిని అదుపు చేస్తాయ్.డ్రైవాటర్ మిస్ట్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్ అనేది అత్యంత సన్నని నీటి బిందువులతో మంటలను నియంత్రించే ఆధునిక పద్దతి. ఈ మిస్ట్ మంటల దగ్గర వేగంగా ఆవిరైపోయి, ఉష్ణోగ్రతను తగ్గించడం మరియు ఆక్సిజన్ స్థాయిని తగ్గించడం ద్వారా మంటలు విస్తరించకుండా చేస్తుంది.త్వరితంగా మంటలను నియంత్రిస్తుంది.నీటి వినియోగం చాలా తక్కువ.డాటా సెంటర్లు, హాస్పిటల్స్, ఆఫీసులు లాంటి సున్నిత ప్రాంతాలకు అనుకూలం అని చెప్పవచ్చు.ఎలక్ట్రికల్ పరికరాలకు భద్రతనిస్తుంది.

వెట్ కెమికల్/wet chemical:Fire Extinguisher Types:

మంటలపై సబ్బు ద్రవాన్ని పిచికారీ చేస్తుంది.కొవ్వులు,వంట నూనెల వల్ల సంభవించే వాటిని అదుపులోకి తేవచ్చు.వెట్ కెమికల్ ఫైర్ సేఫ్టీ సిస్టమ్ అనేది వంటగది మంటలకు అత్యంత నమ్మకమైన మరియు సురక్షిత పరిష్కారం.వంట నూనె మంటలను సమర్థంగా నియంత్రిస్తుంది.హోటల్స్, రెస్టారెంట్లు, కమర్షియల్ కిచెన్లకు అత్యంత అనుకూలం.ఇది వేడి నూనె లేదా కొవ్వు మీద స్ప్రే చేసినప్పుడు, రసాయన చర్య ద్వారా సబ్బు లాంటి పొర (saponification) ఏర్పడి మంటలను ఆర్పుతుంది మరియు.మళ్లీ అంటుకునే అవకాశం లేకుండా చేస్తుంది.ఆటోమేటిక్ & మాన్యువల్ ఆపరేషన్ సదుపాయం కూడా కలిగి ఉంటుంది.

కార్బన్ డై యాక్ససిడ్/CO2:Fire Extinguisher Types:

పెట్రో ఉత్పత్తులు, విద్యత్తు వల్ల కలిగే మంటలు అదుపు చేయవచ్చు.కార్బన్ డైఆక్సైడ్ (CO₂) ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ అనేది వాయు రూపంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్‌ను విడుదల చేసి మంటలను ఆర్పే అగ్నిమాపక పరికరం. కార్బన్ డైఆక్సైడ్ (CO₂) ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ అనేది ఎలక్ట్రిక్ మరియు ద్రవ మంటలకు అత్యంత అనుకూలమైన, శుభ్రమైన, సమర్థవంతమైన అగ్నిమాపక పరికరం. సరైన చోట సరైన రీతిలో ఉపయోగిస్తే ఇది ప్రాణాలు మరియు ఆస్తిని రక్షించగలదు.

ఫోమ్ ఎక్స్‌టింగ్విషర్/Foam Extinguisher:

కలప,కాగితం, వస్త్రం వంటి గణపదర్దాలు నుంచి,పెట్రో ఉత్పత్తులు వల్ల ఏర్పడే మంటలను ఆర్పవచ్చు.ఫోమ్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ అనేది ఫోమ్ (నురుగు) రూపంలో ఉన్న రసాయన ద్రావణాన్ని విడుదల చేసి మంటలను ఆర్పే అగ్నిమాపక పరికరం. ఇది మంటపై ఒక పొరలా కప్పి, ఆక్సిజన్ సరఫరాను ఆపడం మరియు వేడిని తగ్గించడం ద్వారా మంటను నియంత్రిస్తుంది. ముఖ్యంగా ఇంధనాలు, ఆయిల్ వల్ల వచ్చే మంటలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది.

వాటర్ మిస్ట్ టైపు ఫైర్/water mist type fire:

ఈ పరికరాన్ని బాల్కనీ, వరండాలు,వంటగది ప్రాంతాల్లో ఏర్పాటు చేసికొనేలా లభ్యమవుతుంది.మంటలపై నీటిని వర్షంలా చిమ్ముతుంది.ఈ సూక్ష్మ నీటి కణాలు మంట వేడిని వేగంగా తగ్గించి, ఒకేసారి ఆక్సిజన్ సరఫరాను కూడా తగ్గిస్తాయి. అందువల్ల మంట త్వరగా అదుపులోకి వస్తుంది.ఇది అత్యంత సురక్షితమైన, శుభ్రమైన, ఆధునిక అగ్నిమాపక పరిష్కారం. ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఇది బాగా ఉపయోగిస్తారు.
ex: ఈ మంటలకు అనుకూలంగా ఉంటుంది:

Class A Fires – చెక్క, కాగితం, బట్టలు…

Class B Fires – ఆయిల్, ఇంధనాలు,……

Class C Fires – ఎలక్ట్రిక్ మంటలు (Low Voltage వరకు)….అందుకే ఇది మల్టీ-పర్పస్ & సేఫ్ ఎక్స్‌టింగ్విషర్ గా పరిగణిస్తారు.

ఫైర్ బాల్/fire ball:Fire Extinguisher Types:

ఫుట్ బాల్ పరిమాణంలో ఉండే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ బాల్ ను మంటల్లో విసరాగానే అది పేలుతుంది.అందులో నుంచి వచ్చే రసాయనాలు అగ్నిని ఒక్కసారిగా అదుపు చేస్తాయి.ఫైర్ బాల్ అనేది బంతి ఆకారంలో ఉండే ఆటోమేటిక్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్. ఇది మంటను తాకిన వెంటనే స్వయంచాలకంగా పేలి (Activation) లోపల ఉన్న ఫైర్ సప్రెసింగ్ పౌడర్‌ను విడుదల చేసి మంటలను వెంటనే ఆర్పుతుంది. విద్యుత్, మానవ జోక్యం అవసరం లేకుండా పని చేయడం దీని ప్రత్యేకత.

powder/పౌడర్;Fire Extinguisher Types:

పౌడర్ ని ఏబీసీ, ఎల్-2, ఎం-28 రకాలుగా ఈ సాధనాన్ని విభజించారు…

*ఏబీసీ ఎక్స్‌టింగ్విషర్ ద్వారా కలప,కాగితం,వస్త్రం,వంటి కార్బన్ ఆధారిత మంటలు,..పెట్రోల్,డీజీల్,గ్యాసోలిన్,వంటి వాటినుంచి వచ్చే మంటలు,..మీథేన్,ప్రొపేన్,బ్యూటేన్ వంటి వాయవులు వల్ల ఏర్పడేవి ఆర్పేందుకు ఉపయోగిస్తారు.

*ఎల్-2 రకం ద్వారా లిథియం,సోడియం,మెగ్నీషియం వంటి రసాయనాలతో ఏర్పడే వాటిని ఆర్పవచ్చు.

*ఎం-28 పౌడర్  ఎక్స్‌టింగ్విషర్ ద్వారా విద్యత్ ఉపకరణాల నుంచి వచ్చే మంటలను ఆర్పవచ్చు.

*ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ అనేది పెద్ద పెద్ద అగ్నిప్రమాదాలకు కాదు, ప్రారంభ దశలో ఉన్న మంటలకు మాత్రమే ఉపయోగపడుతుంది.
*ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ అనేది ఒక చిన్న పరికరం అయినప్పటికీ, ప్రాణాలను కాపాడే మహత్తర ఆయుధం.
*ప్రతి ఇల్లు, ఆఫీస్, షాప్‌లో కనీసం ఒకటి సరైన ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ అనేది ఉండాలి.

Fire Extinguisher Types – బులెట్ పాయింట్స్:https://amzn.to/4rczbbU

 *Water Fire Extinguisher (వాటర్) అనేది Class A మంటలకు ఉపయోగపడుతుంది(చెక్క, కాగితం, బట్టలు).ఈ పరికరాన్ని ఎలక్ట్రిక్ మంటలకు వాడకూడదు.

* Water Mist Fire Extinguisher (వాటర్ మిస్ట్) అనేది సన్నని నీటి కణాలతో పనిచేస్తుంది.ఇది Class A, B & Electrical (Low Voltage)మంటలకు ఉపయోగపడుతుంది.వీటిని ఎక్కువుగా హాస్పిటల్స్, ఆఫీసులకు ఉపయోగిస్తారు.

* Foam Fire Extinguisher (ఫోమ్) కూడా Class A & B మంటలకు ఉపయోగించవచ్చు.ఆయిల్, పెట్రోల్ మంటలకు ఇది బెస్ట్ అని చెప్పవచ్చు.

* CO₂ Fire Extinguisher (కార్బన్ డైఆక్సైడ్) అనేది Class B & C మంటలకు ఉపయోగపడుతుంది.ఇవి ఎలక్ట్రిక్ ఫైర్‌కు చాలా సురక్షితం.

* DCP Fire Extinguisher (Dry Chemical Powder) అనేది Class A, B, C – మల్టీపర్పస్ కి బాగా ఉపయోగపడుతుంది.ఇళ్లు, షాపులు, ఫ్యాక్టరీలు….

* ABC Fire Extinguisher ఇది అత్యంత సాధారణ ఎక్స్‌టింగ్విషర్.వీటిని ఇళ్లకు & ఆఫీసులకు బెస్ట్ ఎంపిక అని చెప్పికోవచ్చు.

* Wet Chemical Fire Extinguisher ని Class K మంటలకు అలాగే హోటల్ & రెస్టారెంట్ కిచెన్‌లలో ఉపయోగం ఎక్కువ.

* Class D Fire Extinguisher ఇవి మెటల్ మంటలకు ఆర్పడానికి ఉపయోగిస్తారు.వీటిని ఇండస్ట్రీస్‌లో మాత్రమే వాడుతారు.

* Fire Ball Extinguisher (ఫైర్ బాల్) ఇవి ఆటోమేటిక్‌గా పని చేస్తుంది.చిన్న చిన్న మంటలకు ఉపయోగిస్తారు(ఇళ్లు & ఎలక్ట్రిక్ ప్యానెల్స్…)

మా construction company సర్వీసెస్ : https://impresshomedesigners.com/construction-cost-per-square-feet-residential-construction-cost-per-sq-ft/?

*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ , duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును . మా phone number; 7989312152, 9989456907.

flats for sale