House rent agreement format! అద్దె ఆదా చేద్దామిలా...! ఇంటి అద్దె భారంగా వుందా?

House rent agreement format! అద్దె ఆదా చేద్దామిలా…! ఇంటి అద్దె భారంగా వుందా?

House rent agreement format:

House rent agreement format: రియల్ ఎస్టేట్ మార్కెట్ చాల ఖరీదు అయినా వ్యవహారంగా మారిపోయింది.దీనితో ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి.నగరంలో ఇల్లు కొందామన్నా అందుబాటులో ధరలు లేవు.అందుకే ఇతర ప్రాంతాల నుంచి నగరాలకు వలస వచ్చేవారు అద్దె ఇళ్లలో ఉంటున్నారు.వేరే ఆప్షన్ లేక అద్దె ఇళ్లను ఆశ్రయిస్తున్నారు.అయితే ఈ అద్దె చెల్లింపు…మధ్యతరగతి వారికి భారంగా మారిపోయింది.అందువల్ల కొన్ని టిప్స్ పాటిస్తే కొంత మేర ఇంటి అద్దెను తగ్గించుకోవచ్చు.అవి ఇప్పుడు చూదాం.

హౌస్ రెంట్ అగ్రిమెంట్ అంటే ఏమిటి?

హౌస్ రెంట్ అగ్రిమెంట్ అనేది ఇంటి యజమాని (Owner/Landlord) మరియు అద్దెదారు (Tenant) మధ్య కుదుర్చుకునే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. ఈ ఒప్పందంలో ఇంటి అద్దె, కాలవ్యవధి, డిపాజిట్, నిబంధనలు, బాధ్యతలు వంటి అన్ని వివరాలు స్పష్టంగా ఉంటాయి. భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఇది చట్టపరంగా ఆధారంగా ఉపయోగపడుతుంది.
హౌస్ రెంట్ అగ్రిమెంట్ అనేది చిన్న డాక్యుమెంట్ లా కనిపించినా, ఇది చాలా ముఖ్యమైన చట్టపరమైన ఒప్పందం. సరైన ఫార్మాట్‌లో, స్పష్టమైన నిబంధనలతో అగ్రిమెంట్ చేస్తే భవిష్యత్తులో వచ్చే సమస్యలను సులభంగా నివారించవచ్చు. యజమాని అయినా, అద్దెదారు అయినా… ఇద్దరికీ ఇది రక్షణగా ఉంటుంది.

లీజుకు తీసికోవడం:House rent agreement format

సాధారణంగా ఇంటి యజమాని, అద్దెకు ఉండేవారు మధ్య లీజు అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంటుంది.ఇందులో ఇద్దరి హక్కులు,బాధ్యతలు ఉంటాయి.సాధారణంగా ఈ ఒప్పందాన్ని ఏడాదికి రాస్తారు.కానీ మీరు దీన్ని 3-5 సంవత్సరాలికి రాసుకోవడం వల్ల..ఇద్దరకీ ప్రయోజనం చేకూరుతుంది.ఒప్పందంలో ఏడాదికి ఎంత శాతం అద్దె పెంచాలనేది ఉంటుంది. కాబట్టి అద్దె పెరుగుదల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.ఈ దీర్ఘకాలిక ఒప్పందం వల్ల,అద్దెకు ఉండేవారు తమ ఆర్థిక ప్రణాలికను మరింత మెరుగ్గా రూపొందించుకోవచ్చు.

 

 

 

 

 

 

ఇలా కూడా ప్లాన్ చేయవచ్చు:

మీ దగ్గర కొన్ని నెలలకు సరిపడా అద్దె డబ్బు ఉంటె..మీ మొత్తం అద్దెలొ కొంత భాగాన్ని తగ్గించుకోవచ్చు.అది ఎలా అంటే మీరు 11 నెలల అద్దెను ముందుగానే చెల్లించి.12 వ నెల అద్దెను  ఉసితంగా పొందవచ్చు.దీనికోసం యజమానిని ఒప్పించవలిసి ఉంటుంది.దీనివల్ల రాబోయే ఏడాదికి అద్దె చెల్లింపు హామీ కూడా ఉంటుంది.కాబట్టి ఓనర్ సానుకూలంగా స్పందిస్తారు.ఆ 11 నెలల డబ్బులు ఓనర్..ఎందులో పెట్టుబడి పెట్టిన మంచి రాబడి వస్తుంది.అయితే ఒకవేళా ఆ ఇల్లును ముందుగానే కాళీ చేయాల్సి వస్తే, ఈ డబ్బును తిరిగి పొందడం కష్టం కావచ్చు.

Budjet /బడ్జెట్ ప్లానింగ్:House rent agreement format

నేటి ఆర్థిక పరిస్థితిలో అద్దె అనేది అతి పెద్ద ఆర్థిక బాధ్యతగా మారిపోయింది.కాబట్టి,ఈ విషయంలో ఆర్థిక ప్రణాళికను చాల జాగ్రత్తగా రూపొందించుకోవడం చాల అవసరం.బడ్జెట్లో..ఇతర ఖర్చులకు డబ్బు కేటాయించే ముందు అద్దెకు తోలి ప్రాధాన్యం ఇవ్వాలి.అద్దె కోసం ఎక్కువ చెల్లించావలిసి వస్తే…ఇల్లు మారడం బెటర్.ఈ ప్లాన్ మీ ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా ఉంచుతుంది.మీ ఖర్చులలో అవసరమైన మార్పులు చేయడానికి సహాయ పడుతుంది.

long distance అని చూడవద్దు:

చాల మంది సిటీ మధ్యలో,మెయిన్ రోడ్ పక్కనో ఇల్లు కావాలనీకుంటారు….అవి మీ ఆశల్లాగే అద్దెలు కూడా ఎక్కువుగా ఉంటాయి.అందుకే  అలాంటి ప్రాంతాల్లో(మెయిన్ రోడ్ దగ్గరలో) అద్దె ఇల్లు కావాలని ఆశించవద్దు.కొంచెం దూరంగా ఉండడం వలన ఇంటి అద్దె తక్కువుగా ఉంటుంది.ఇకా నగర శివార్లలో అయితే రెంట్ గణనీయంగా తక్కువుగా ఉంటుంది.ఇలాంటి ప్రాంతాల్లో అద్దెకు ఉండేటప్పుడు ఆఫిసుకు,ఇంటికి మధ్య చాల దూరం ఉందని భావించవద్దు.ఈ రోజుల్లో ప్రతి మూలకు అన్ని సౌకర్యాలు వచ్చేస్తున్నాయ్.నిత్యావసర వస్తువులతో పాటు మెరుగయినా రవాణా వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది.

cashback offer/క్యాష్ బ్యాక్  ఆఫర్:

ప్రస్తుత యుగం డిజిటల్ యుగం నడుస్తుంది.ఈ నేపధ్యంలో ఇంటి అద్దెను ఆన్లైన్లో కూడా చెల్లించవచ్చు.దీనివల్ల లాభం ఏంటి అంటే క్యాష్ బ్యాక్ లు పొందవచ్చు.ఇతర ఆన్లైన్ చెల్లింపుల ఆఫర్లతో నెలవారీ అద్దెలొ కొద్దీ మొత్తాన్ని ఆదా చేసికోవచ్చు.అద్దె చెల్లింపులను ఆటోమేటిక్ చేసుకొనే ఆప్షన్ కూడా ఉంది.

individual house /ఇండివిడ్యుల్ హౌస్ బెటర్:https://amzn.to/4rHlr9q

సాధారణంగా పట్టణాల్లో అపార్టుమెంట్ సంస్కృతి చాల ఎక్కువుగా ఉంటుంది.చాలామంది అద్దెకు ఉండేది కూడా ఇలాంటి భవనాల్లోనే.అయితే ఇలాంటి చోట్ల అద్దెలు చాల ఎక్కువుగా ఉంటాయి.అదనంగా మెయింటనెన్స్ చార్జీలు కూడా ఎక్కువే చెల్లించాల్సి వస్తుంది.అందుకే కాస్త దూరమైన ఇండిపెడెంట్ హౌస్ బెటర్ అని చెప్పాలి.వీటికి నిర్వహణ చార్జెస్ చాల తక్కువుగా ఉంటాయి.కొన్ని చోట్ల అసలు నిర్వహణ చార్జీలు వసూలు చేయరు.

ఇంటి ఓనర్ తో మంచి సంబంధం ఉండాలి:

ఓనర్ తో మంచి సంబంధం ఉంటే,అద్దె పెంచే అవకాశాలు చాల వరకు తగ్గుతాయి. ఓనర్ తో మంచిగా ఉండడం వలన,అద్దె పెంపుదల గురించి చర్చించడానికి,దానిని నివారించడానికి మీకు అవకాశం ఉంటుంది.అలాగే ఇంటి మరమ్మతులు,ఇతర సమస్యలను కూడా మీరు సౌకర్యమంతంగా పరిష్కరించుకోవచ్చు.ఓనర్ తో మంచి సంబంధం ఉంటే,అద్దె పెరుగుదల గురించి ముందుగా తెలిసికోవచ్చు.తద్వారా ఆర్థిక ప్రణాళిక ప్రిపేర్ చేసికోవచ్చు.

పార్టనర్/partner:House rent agreement format

మీరు అద్దెకు వుండే ఇంటిలో మరొక వ్యక్తికీ వసతి కల్పించడం ద్వారా కూడా ఇంటి అద్దెను ఆదా చేసికోవచ్చు.ఆ వ్యక్తి అద్దె చెల్లిస్తాడు కాబట్టి, మీరు చెల్లించే మొత్తం కాస్త తగ్గి మీకు కొంచెం ఆర్థిక ఉపశమనం లభిస్తుంది.ఈ సదుపాయం బాచిలర్స్ కి బాగా ఉపయోగ పడ్తుంది.

తరుచూ ఇల్లు మారుతున్నారా:

తరుచూ ఇల్లు మారడం వల్ల నష్టమే ఉంటుంది.కారణం మాటిమాటికి ఇల్లు మారితే సామాగ్రి రవాణాకు ఖర్చు అవుతుంది. కొత్త అద్దె ఇంటిలో సామాన్లు ఫిటింగ్ చేయించుకోవడానికి ఖర్చు చేయాల్సివస్తుంది.ఇలాంటి అదనపు ఖర్చులు చాలానే ఉంటాయి.పైపులు,స్విచ్ బోర్డ్స్,ఏసీ,వాచింగ్ మెషిన్ల కనెక్షన్లు వంటివి చేయించుకోవాలంటే ఎంతో కొంత చెల్లించక తప్పదు.ఇంకో పెద్ద ప్రాబ్లెమ్ ఏంటంటే…కొత్త అద్దె ఇల్లు ఓనర్స్ ముందుగానే అడ్వాన్స్ చెల్లించామని అడుగుతారు.ఇవన్నీ సామాన్యుడికి ఆర్థిక ఇబ్బందులే కాబట్టి తప్పనిపరిస్థితిలో తప్ప వేరే ఇంటికి మారద్దు.

అద్దె దారుడు:https://amzn.to/4rHlr9q

విద్యుత్ బిల్…వాటర్ బిల్…మెయింటెనెన్స్ ఛార్జీలు….గ్యాస్ బిల్…చిన్న చిన్న రిపేర్లు ఇవి అద్దెదారుడు చూసికోవాలి .

యజమాని:House rent agreement format

ప్రాపర్టీ ట్యాక్స్…..పెద్ద పెద్ద రిపేర్లు చూసికోవాలి.

ప్రధాన ప్రయోజనాలు:

*అద్దె మొత్తం స్పష్టంగా ఉంటుంది.
*డిపాజిట్ వివాదాలు నివారించవచ్చు.
*ఖాళీ చేయాల్సిన నిబంధనలు క్లియర్‌గా ఉంటాయి.
*లీగల్ ప్రూఫ్‌గా ఉపయోగపడుతుంది.
*బ్యాంక్, గ్యాస్ కనెక్షన్, అడ్రస్ ప్రూఫ్‌కు ఉపయోగపడుతుంది.

*ఇంటిని  ఖాళీ చేయాలంటే ముందుగా నోటీసు ఇవ్వాలి(one or 2months టైం ఇవ్వాలి ).
*డ్యామేజ్ జరిగితే డిపాజిట్ నుంచి కట్ చేయవచ్చు.

*ఇంటిని కేవలం నివాసం కోసం మాత్రమే ఉపయోగించాలి.సబ్‌లీజ్ (ఇంకొకరికి అద్దెకి ఇవ్వడం) అనుమతి లేదు.అక్రమ కార్యకలాపాలు చేయరాదు.buyer and builder agreement full detailshttps://impresshomedesigners.com/buyer-builder-agreement/?preview_id=3218&preview_nonce