Builder agreement format! Builder Agreement Format లో ఉండాల్సిన ముఖ్య అంశాలు?

Builder agreement format! Builder Agreement Format లో ఉండాల్సిన ముఖ్య అంశాలు?

Builder agreement format:

Builder agreement format: ఈ  అగ్రిమెంట్  అనేది బిల్డర్ (నిర్మాణదారు) మరియు కొనుగోలుదారు (Buyer) మధ్య జరిగే ఒక లీగల్ ఒప్పందం. ఈ అగ్రిమెంట్‌లో ఫ్లాట్ లేదా ఇల్లు కొనుగోలు చేసే సమయంలో పాటించాల్సిన నియమాలు, షరతులు, హక్కులు, బాధ్యతలు స్పష్టంగా రాసి ఉంటాయి.సాధారణంగా ఇంటి కొనుగోలు అనేది జీవితంలో ఒక పెద్ద నిర్ణయం. అందుకే ఈ  అగ్రిమెంట్  చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది లేకుండా లేదా సరిగా చదవకుండా సైన్ చేస్తే భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

ఫ్లాట్ అప్పగించే సమయంలో:

అగ్రీమెంటులో సమయానికి ఫ్లాట్ నిర్మాణం పూర్తి చేసి,మీకు అందచేయకపొతే అందుకుగాను తాత్కాలిక పరిహారం/ఉపశమనంగా ఏం చేస్తారో రాసుకుంటారు.కొన్ని సందర్భాలలో ఫ్లాట్ అప్పగించేంతవరకు అద్దె ఇవ్వడం లేదా మీ తరుపున నెలవారీ లోన్ డబ్బులు సదురు కంపెనీ వారే కట్టేలా రాసుకోవాలి.ఒకవేళ ఒప్పందాన్ని ఉల్లంగిస్తే మీకు జరిగిన ప్రతి నష్టాన్ని లెక్కగట్టి దానికితోడు మీకు కలిగిన మానసిక క్షోభకి కూడా అదనంగా పరిహారం కోరవచ్చు.

ఖర్చు/expense:

నిర్మాణానికి అవసరమైన మొత్తం ఖర్చు, చెల్లింపు షెడ్యూలు,మైల్ స్టోన్ వివరాలు స్పష్టంగా ఉండాలి.అదనపు ఖర్చులు, వాటిని చెల్లింపు వివరాలు గురుంచి ముందుగానే మాట్లాడుకోవాలి.కొన్ని సందర్భాల్లో బిల్డర్లు తర్వాత అదనపు ఛార్జీలు అడుగుతారు. కాబట్టి అన్ని ఖర్చులు ముందే ఒప్పందంలో ఉన్నాయా చూడాలి(బేసిక్ కాస్ట్,GST ,కార్ పార్కింగ్ ఛార్జీలు,మెయింటెనెన్స్ డిపాజిట్,ఇతర అదనపు ఖర్చులు)

క్యాన్సిలేషన్/cancellation:Builder agreement format

ఏవైనా కారణాలవల్ల ప్రాజెక్టు క్యాన్సల్ అయితే లేదా టెర్మినేట్ అయినప్పుడు ఏవిదంగా పరిహారం చేయబడుతుందో స్పష్టంగా కాంట్రాక్టులో పొందుపరసాలి.

నాణ్యత ప్రమాణాలు/quality standards:

నిర్మాణంలో వాడే మెటీరియల్స్,వాటి నాణ్యత ప్రమాణాలు వివరించండి.బిల్డర్ వాడే బ్రాండ్స్,సర్టిఫికేషన్,ప్రమాణాలు గురించి వివరాలు పొందుపర్సాలి.

వారంటీ,మెయింటెనెన్సు/(Maintenance & Society Formation):

నిర్మాణం పూర్తి అయినా తరువాత బిల్డర్ అందించే వారంటీ, మెయింటనెన్స్,సర్వీస్ వివరాలు పొందుపర్సాలి.డిఫెక్ట్ లైయబిలిటీ పీరియడ్(DLP) గురించి వివరాలు అగ్రీమెంట్లో చేర్చండి.  ఫ్లాట్ అప్పగించిన తర్వాత మెయింటెనెన్స్ ఎవరు చూసుకుంటారు?సొసైటీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?మెయింటెనెన్స్ ఛార్జీలు ఎంత?ఈ వివరాలు ఇందులో పోందుపర్చాలి.

ఇన్సూరెన్స్/insurance:

ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బిల్డర్,సైట్,వర్కర్లుకు సంబంధించి ఇన్సూరెన్సు వివరాలు సమరపించాలి(పోందుపర్చాలి).

అనుమతులు/permission:

నిర్మాణకి అవసరమైన అన్ని ప్రభుత్వ అనుమతులు,లైసెన్సులు,రిజిస్ట్రేషన్లు బిల్డర్ వద్ద ఉన్నాయా లేదా బిల్డర్ అందిస్తాడో లేడో నిర్దారించుకోవాలి.లేదంటే నిర్మాణ సమయంలో అనేక ఇబ్బందిలు ఎదురు అవుతాయి.

లీగల్ కంప్లైన్స్ :

కాంట్రాక్టులోని లీగల్ పాయింట్స్ పరిశీలించడానికి,వాటిని సమార్డంగా రాసుకోవడానికి లీగల్ కన్సెల్టెంటు లేదా అడ్వకేట్ సహాయం తీసికోవడం మంచిది.

సాధారణంగా జరిగే తప్పులు:

చదవకుండా సంతకం చేయడం.అదనపు ఛార్జీలపై క్లారిటీ లేకపోవడం.ఆలస్యం అయితే పట్టించుకోకపోవడం. ఒప్పందాన్ని పూర్తిగా చదవాలి.అవసరమైతే లాయర్ సలహా తీసుకోవాలి.RERA రిజిస్ట్రేషన్ ఉందా లేదా చెక్ చేయాలి.బ్రోచర్ & అగ్రిమెంట్ వివరాలు ఒకేలా ఉన్నాయా లేదా చూడాలి.ఆలస్యం పరిహారం కొనుగోలుదారునికి అనుకూలంగా ఉందా లేదా చూడాలి.స్టాంప్ డ్యూటీ ఎవరు చెల్లించాలి?సాధారణంగా ఈ ఖర్చులు కొనుగోలుదారుడే భరిస్తాడు.

రెరా/RERA:Builder agreement format

ఒకవేళ మీరు కొన్నఫ్లాట్ ప్రాజెక్ట్ రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యూలేటరీ అథారిటీ) లో రిజిస్టర్ అయ్యివుంటే రేరా కు కూడా పిర్యాదు చేయవచ్చు.వినియోగదారులు చట్టప్రకారం మీ కేసు మీరు కూడా వాదించుకోవచ్చు.లేదా మీ తరుపున మరెవరినైనా “authorized person ” గా నియమించుకోవచ్చు.50లక్షలు దావా వరకు జిల్లా వినియోగదారుల ఫోరంలో,50 లక్షలు నుంచి రెండుకోట్లవరకు రాష్ట్రపోరంలో అలాగే రెండుకోట్లపైన విలువుగల దావాకి జాతీయ వినియోగదారులపోరంలో మీ ఫిర్యాదును నమోదు చేయాల్సి వుంటుంది. ఈ సూచనలు పాటించడం ద్వారా మీరు బిల్డరుతో సరైన అగ్రిమెంట్ చేసికోవచ్చు.దీని వల్ల భవిష్యత్తులో వచ్చే అనేక సమస్యలను నివారించవచ్చు.

SPECIALTIES (Buyer Builder Agreement):

మనం కొన్న property కి  electricity specialty , house draining system , public utility , gas specialty , bus specialty(transport)   water specialty,  roads  ….all necessary  ఇలా మనకి ఏవైతే కావలసినవి ఉంటాయో అవన్నీ మనం చెక్ చేసికోవాలి ఇప్పుడు కాకపోయినా future లోనైనా వస్తాయా అని తెలిసికోవాలి  

legal rights అంటే  ఒకరి property ని ఇంకొకరు ఉపోయాగించడం లేదా access తీసికోవడం అంటే మన ఇల్లు లోనకివుంది అనుకుందాం అప్పుడు road కి రావడానికి దారి వుందా లేదా అని చెక్ చేసికోవాలి, ఒకవేళ అది కొండా అయినా మన ల్యాండ్ లో వుంటే మనకు అది తవ్విన మనకు  rights ఉండాలి

Some Important Points :

* boundary wall / compound wall వుందా లేదా అనేది తెలిసికోవాలి అలాగే  “total house area”  ఎంత అనేది తెలిసికోవాలి  

*నాలా certificate వుందా లేదా తెలిసికోవాలి(చూసికోవాలి )

* అనుమతులు పొందితుందా లేదా అనేది తెలిసికోవాలి అంటే HMDA /DTCP /VUDA / వీటిలో దరకాస్తు చేసికున్నారా లేదా అనుమతులు ఉన్నాయా లేదా అనేది తెలిసికోవాలి 

*వెంచర్ అయితే ROAD connectivity అనేది వెంచర్ కి వుందా లేదా ఉంటే main road నుంచి 40′ రోడ్ కచ్చితంగా ఉండాలి వెంచర్ లోపల అన్ని రోడ్ లు 30′ కచ్చితంగా(internal ) ఉండాలి. 

వెంచర్ లో  cc roads  , లైటింగ్ , డ్రైనేజీ,  గార్డెన్ …..ఉన్నాయా లేవా ఉంటే ఎంత గడువులో పూర్తి అవుతుంది అనేది తెలిసికోవాలి. 

* వెంచర్ అయితే Documentation చాల జాగ్రత్తగా చూసికోవాలి అలాగే LEGALOPENION చేసికొని తీసికోవాలి, ప్రతిది చాల జాగ్రత్తగా చూసికోవాలి లేదంటే మోసాలు చేస్తారు.

*ప్రతి investment లో రిస్క్ ఉంటుంది వీటిలో మాత్రమే రిస్క్ ఉండదు. మీ ఇంటిలోకి కావలిసిన వస్తువులు కోసం https://amzn.to/3NzjaOQ

House rent agreement format:

House rent agreement format: రియల్ ఎస్టేట్ మార్కెట్ చాల ఖరీదు అయినా వ్యవహారంగా మారిపోయింది.దీనితో ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి.నగరంలో ఇల్లు కొందామన్నా అందుబాటులో ధరలు లేవు.అందుకే ఇతర ప్రాంతాల నుంచి నగరాలకు వలస వచ్చేవారు అద్దె ఇళ్లలో ఉంటున్నారు.వేరే ఆప్షన్ లేక అద్దె ఇళ్లను ఆశ్రయిస్తున్నారు.అయితే ఈ అద్దె చెల్లింపు…మధ్యతరగతి వారికి భారంగా మారిపోయింది.అందువల్ల కొన్ని టిప్స్ పాటిస్తే కొంత మేర ఇంటి అద్దెను తగ్గించుకోవచ్చు.అవి ఇప్పుడు చూదాం.

హౌస్ రెంట్ అగ్రిమెంట్ అంటే ఏమిటి?

హౌస్ రెంట్ అగ్రిమెంట్ అనేది ఇంటి యజమాని (Owner/Landlord) మరియు అద్దెదారు (Tenant) మధ్య కుదుర్చుకునే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. ఈ ఒప్పందంలో ఇంటి అద్దె, కాలవ్యవధి, డిపాజిట్, నిబంధనలు, బాధ్యతలు వంటి అన్ని వివరాలు స్పష్టంగా ఉంటాయి. భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఇది చట్టపరంగా ఆధారంగా ఉపయోగపడుతుంది.
హౌస్ రెంట్ అగ్రిమెంట్ అనేది చిన్న డాక్యుమెంట్ లా కనిపించినా, ఇది చాలా ముఖ్యమైన చట్టపరమైన ఒప్పందం. సరైన ఫార్మాట్‌లో, స్పష్టమైన నిబంధనలతో అగ్రిమెంట్ చేస్తే భవిష్యత్తులో వచ్చే సమస్యలను సులభంగా నివారించవచ్చు. యజమాని అయినా, అద్దెదారు అయినా… ఇద్దరికీ ఇది రక్షణగా ఉంటుంది.

లీజుకు తీసికోవడం:House rent agreement format

సాధారణంగా ఇంటి యజమాని, అద్దెకు ఉండేవారు మధ్య లీజు అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంటుంది.ఇందులో ఇద్దరి హక్కులు,బాధ్యతలు ఉంటాయి.సాధారణంగా ఈ ఒప్పందాన్ని ఏడాదికి రాస్తారు.కానీ మీరు దీన్ని 3-5 సంవత్సరాలికి రాసుకోవడం వల్ల..ఇద్దరకీ ప్రయోజనం చేకూరుతుంది.ఒప్పందంలో ఏడాదికి ఎంత శాతం అద్దె పెంచాలనేది ఉంటుంది. కాబట్టి అద్దె పెరుగుదల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.ఈ దీర్ఘకాలిక ఒప్పందం వల్ల,అద్దెకు ఉండేవారు తమ ఆర్థిక ప్రణాలికను మరింత మెరుగ్గా రూపొందించుకోవచ్చు.

 

 

 

 

 

 

ఇలా కూడా ప్లాన్ చేయవచ్చు:

మీ దగ్గర కొన్ని నెలలకు సరిపడా అద్దె డబ్బు ఉంటె..మీ మొత్తం అద్దెలొ కొంత భాగాన్ని తగ్గించుకోవచ్చు.అది ఎలా అంటే మీరు 11 నెలల అద్దెను ముందుగానే చెల్లించి.12 వ నెల అద్దెను  ఉసితంగా పొందవచ్చు.దీనికోసం యజమానిని ఒప్పించవలిసి ఉంటుంది.దీనివల్ల రాబోయే ఏడాదికి అద్దె చెల్లింపు హామీ కూడా ఉంటుంది.కాబట్టి ఓనర్ సానుకూలంగా స్పందిస్తారు.ఆ 11 నెలల డబ్బులు ఓనర్..ఎందులో పెట్టుబడి పెట్టిన మంచి రాబడి వస్తుంది.అయితే ఒకవేళా ఆ ఇల్లును ముందుగానే కాళీ చేయాల్సి వస్తే, ఈ డబ్బును తిరిగి పొందడం కష్టం కావచ్చు.

Budjet /బడ్జెట్ ప్లానింగ్:House rent agreement format

నేటి ఆర్థిక పరిస్థితిలో అద్దె అనేది అతి పెద్ద ఆర్థిక బాధ్యతగా మారిపోయింది.కాబట్టి,ఈ విషయంలో ఆర్థిక ప్రణాళికను చాల జాగ్రత్తగా రూపొందించుకోవడం చాల అవసరం.బడ్జెట్లో..ఇతర ఖర్చులకు డబ్బు కేటాయించే ముందు అద్దెకు తోలి ప్రాధాన్యం ఇవ్వాలి.అద్దె కోసం ఎక్కువ చెల్లించావలిసి వస్తే…ఇల్లు మారడం బెటర్.ఈ ప్లాన్ మీ ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా ఉంచుతుంది.మీ ఖర్చులలో అవసరమైన మార్పులు చేయడానికి సహాయ పడుతుంది.

long distance అని చూడవద్దు:

చాల మంది సిటీ మధ్యలో,మెయిన్ రోడ్ పక్కనో ఇల్లు కావాలనీకుంటారు….అవి మీ ఆశల్లాగే అద్దెలు కూడా ఎక్కువుగా ఉంటాయి.అందుకే  అలాంటి ప్రాంతాల్లో(మెయిన్ రోడ్ దగ్గరలో) అద్దె ఇల్లు కావాలని ఆశించవద్దు.కొంచెం దూరంగా ఉండడం వలన ఇంటి అద్దె తక్కువుగా ఉంటుంది.ఇకా నగర శివార్లలో అయితే రెంట్ గణనీయంగా తక్కువుగా ఉంటుంది.ఇలాంటి ప్రాంతాల్లో అద్దెకు ఉండేటప్పుడు ఆఫిసుకు,ఇంటికి మధ్య చాల దూరం ఉందని భావించవద్దు.ఈ రోజుల్లో ప్రతి మూలకు అన్ని సౌకర్యాలు వచ్చేస్తున్నాయ్.నిత్యావసర వస్తువులతో పాటు మెరుగయినా రవాణా వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది.

cashback offer/క్యాష్ బ్యాక్  ఆఫర్:

ప్రస్తుత యుగం డిజిటల్ యుగం నడుస్తుంది.ఈ నేపధ్యంలో ఇంటి అద్దెను ఆన్లైన్లో కూడా చెల్లించవచ్చు.దీనివల్ల లాభం ఏంటి అంటే క్యాష్ బ్యాక్ లు పొందవచ్చు.ఇతర ఆన్లైన్ చెల్లింపుల ఆఫర్లతో నెలవారీ అద్దెలొ కొద్దీ మొత్తాన్ని ఆదా చేసికోవచ్చు.అద్దె చెల్లింపులను ఆటోమేటిక్ చేసుకొనే ఆప్షన్ కూడా ఉంది.

individual house /ఇండివిడ్యుల్ హౌస్ బెటర్:https://amzn.to/4rHlr9q

సాధారణంగా పట్టణాల్లో అపార్టుమెంట్ సంస్కృతి చాల ఎక్కువుగా ఉంటుంది.చాలామంది అద్దెకు ఉండేది కూడా ఇలాంటి భవనాల్లోనే.అయితే ఇలాంటి చోట్ల అద్దెలు చాల ఎక్కువుగా ఉంటాయి.అదనంగా మెయింటనెన్స్ చార్జీలు కూడా ఎక్కువే చెల్లించాల్సి వస్తుంది.అందుకే కాస్త దూరమైన ఇండిపెడెంట్ హౌస్ బెటర్ అని చెప్పాలి.వీటికి నిర్వహణ చార్జెస్ చాల తక్కువుగా ఉంటాయి.కొన్ని చోట్ల అసలు నిర్వహణ చార్జీలు వసూలు చేయరు.

ఇంటి ఓనర్ తో మంచి సంబంధం ఉండాలి:

ఓనర్ తో మంచి సంబంధం ఉంటే,అద్దె పెంచే అవకాశాలు చాల వరకు తగ్గుతాయి. ఓనర్ తో మంచిగా ఉండడం వలన,అద్దె పెంపుదల గురించి చర్చించడానికి,దానిని నివారించడానికి మీకు అవకాశం ఉంటుంది.అలాగే ఇంటి మరమ్మతులు,ఇతర సమస్యలను కూడా మీరు సౌకర్యమంతంగా పరిష్కరించుకోవచ్చు.ఓనర్ తో మంచి సంబంధం ఉంటే,అద్దె పెరుగుదల గురించి ముందుగా తెలిసికోవచ్చు.తద్వారా ఆర్థిక ప్రణాళిక ప్రిపేర్ చేసికోవచ్చు.

పార్టనర్/partner:House rent agreement format

మీరు అద్దెకు వుండే ఇంటిలో మరొక వ్యక్తికీ వసతి కల్పించడం ద్వారా కూడా ఇంటి అద్దెను ఆదా చేసికోవచ్చు.ఆ వ్యక్తి అద్దె చెల్లిస్తాడు కాబట్టి, మీరు చెల్లించే మొత్తం కాస్త తగ్గి మీకు కొంచెం ఆర్థిక ఉపశమనం లభిస్తుంది.ఈ సదుపాయం బాచిలర్స్ కి బాగా ఉపయోగ పడ్తుంది.

తరుచూ ఇల్లు మారుతున్నారా:

తరుచూ ఇల్లు మారడం వల్ల నష్టమే ఉంటుంది.కారణం మాటిమాటికి ఇల్లు మారితే సామాగ్రి రవాణాకు ఖర్చు అవుతుంది. కొత్త అద్దె ఇంటిలో సామాన్లు ఫిటింగ్ చేయించుకోవడానికి ఖర్చు చేయాల్సివస్తుంది.ఇలాంటి అదనపు ఖర్చులు చాలానే ఉంటాయి.పైపులు,స్విచ్ బోర్డ్స్,ఏసీ,వాచింగ్ మెషిన్ల కనెక్షన్లు వంటివి చేయించుకోవాలంటే ఎంతో కొంత చెల్లించక తప్పదు.ఇంకో పెద్ద ప్రాబ్లెమ్ ఏంటంటే…కొత్త అద్దె ఇల్లు ఓనర్స్ ముందుగానే అడ్వాన్స్ చెల్లించామని అడుగుతారు.ఇవన్నీ సామాన్యుడికి ఆర్థిక ఇబ్బందులే కాబట్టి తప్పనిపరిస్థితిలో తప్ప వేరే ఇంటికి మారద్దు.

అద్దె దారుడు:https://amzn.to/4rHlr9q

విద్యుత్ బిల్…వాటర్ బిల్…మెయింటెనెన్స్ ఛార్జీలు….గ్యాస్ బిల్…చిన్న చిన్న రిపేర్లు ఇవి అద్దెదారుడు చూసికోవాలి .

యజమాని:

ప్రాపర్టీ ట్యాక్స్…..పెద్ద పెద్ద రిపేర్లు చూసికోవాలి.

ప్రధాన ప్రయోజనాలు:Builder agreement format

*అద్దె మొత్తం స్పష్టంగా ఉంటుంది.
*డిపాజిట్ వివాదాలు నివారించవచ్చు.
*ఖాళీ చేయాల్సిన నిబంధనలు క్లియర్‌గా ఉంటాయి.
*లీగల్ ప్రూఫ్‌గా ఉపయోగపడుతుంది.
*బ్యాంక్, గ్యాస్ కనెక్షన్, అడ్రస్ ప్రూఫ్‌కు ఉపయోగపడుతుంది.

*ఇంటిని  ఖాళీ చేయాలంటే ముందుగా నోటీసు ఇవ్వాలి(one or 2months టైం ఇవ్వాలి ).
*డ్యామేజ్ జరిగితే డిపాజిట్ నుంచి కట్ చేయవచ్చు.

*ఇంటిని కేవలం నివాసం కోసం మాత్రమే ఉపయోగించాలి.సబ్‌లీజ్ (ఇంకొకరికి అద్దెకి ఇవ్వడం) అనుమతి లేదు.అక్రమ కార్యకలాపాలు చేయరాదు.buyer and builder agreement full detailshttps://impresshomedesigners.com/buyer-builder-agreement/?preview_id=3218&preview_nonce