commercial property అంటే ఏమిటీ? దీర్ఘకాల పెట్టుబడికి కమర్షియల్ ప్రాపర్టీ ఎందుకు ముఖ్యం?

commercial property అంటే ఏమిటీ?దీర్ఘకాల పెట్టుబడికి కమర్షియల్ ప్రాపర్టీ ఎందుకు ముఖ్యం?

Are you looking for house!

commercial property అంటే ఏమిటీ?

commercial property అంటే ఏమిటీ: వ్యాపార అవసరాల కోసం ఉపయోగించే ప్రాపర్టీలను కమర్షియల్ ప్రాపర్టీ అంటారు. ఉదాహరణకు – షాపులు, ఆఫీసులు, మాల్స్, షోరూమ్స్, హోటల్స్, హాస్పిటల్స్ మొదలైనవి.వ్యాపారం, లేదా ఆదాయం పొందడం కోసం ఉపయోగించే భూమి లేదా భవనాలను కమర్షియల్ ప్రాపర్టీ అంటారు.వీటిలో  సాధారణంగా రెంటల్ ద్వారా  ఆదాయం (Rental Income), లీజ్ (Lease), లేదా వ్యాపార నిర్వహణ ద్వారా లాభాలు పొందవచ్చు.కమర్షియల్ ప్రాపర్టీ అనేది అధిక ఆదాయం, దీర్ఘకాల లాభాలు ఇచ్చే పెట్టుబడి అయినప్పటికీ, ఇందులో రిస్క్ఎక్కువ , పెద్ద  పెట్టుబడి తో కూడికున్నఅంశం  , మార్కెట్ అవగాహన చాల అవసరం. సరైన లోకేషన్, స్పష్టమైన లీజ్ ఒప్పందం ఉంటే – కమర్షియల్ ప్రాపర్టీ మీకు గోల్డెన్ ఇన్వెస్ట్‌మెంట్ కావచ్చు.మీ లక్ష్యం, బడ్జెట్, రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేసుకొని నిర్ణయం తీసుకుంటేనే కమర్షియల్ ప్రాపర్టీలో నిజమైన విజయం సాధించగలరు.రియల్ ఎస్టేట్ రంగంలో కమర్షియల్ ప్రాపర్టీ (Commercial Property) అనేది ఒక ముఖ్యమైన విభాగం.

commercial ప్రాపర్టీ లోని కొన్ని అంశాలు:

షాప్స్ & రిటైల్ స్పేస్….ఆఫీస్ బిల్డింగ్స్ / ఐటీ పార్క్స్….షాపింగ్ మాల్స్ & కమర్షియల్ కాంప్లెక్సులు….గోదాములు (Warehouses)….హోటల్స్ & రెస్టారెంట్స్….హాస్పిటల్స్ & క్లినిక్స్…ఇండస్ట్రియల్ యూనిట్స్ / ఫ్యాక్టరీలు మొదలైనవి .

రియల్ ఎస్టేట్ రంగంలో వీటి యొక్క ప్రాముఖ్యత:

భూమిని నమ్ముకున్నవారికి ఎప్పటికి నష్టం రాదు.సెంటుభూమి ఉన్న అవసరానికి ఉపయోగపడుతుంది అంటారు.అందుకే చాలామంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతారు.దీర్ఘకాలంలో స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే రాబడి మరిదేంట్లోను రాదని చాల సర్వేలు చెపుతున్నాయి. అయితే ఈ రంగంలో పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసికోవడం అంత సులభం కాదు.మార్కెట్లో ఉన్న ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే స్థిరాస్తి దీర్ఘకాలానికి అత్యంత సురక్షితం.స్వల్పకాలంలో ఒడిదొడుకులు తక్కువే. ఆర్థికమందం వంటి క్లిష్టపరిస్థితిలో కూడా ఇబ్బందిలు తక్కువే. అందుకే ఆర్థికంగా ఇబ్బందులు వున్న ఎంతో కొంత పొదుపుచేసి, సరదాలను సంతోషాలును పక్కన పెట్టి సొంత ఇల్లు ఏర్పాటు చేసికోవాలనికుంటారు చాల మంది.అయితే రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ లో పెట్టాలా లేదా కమర్షియల్ లో పెట్టుబడి పెట్టాలా అనే సందిగ్ధంలో వుంటారు చాల మంది.

రెసిడెన్సియల్ / కమర్షియల్ దేనిలో పెట్టుబడి ఉత్తమం :

ఈ ఐడియా అనేది ఆల్రెడీ ఉండడానికి ఒక సొంత ఇల్లు ఉండి,భవిష్యత్ అవసరాలకు దృష్టిలో ఉంచుకొని రెండో ఆస్తిపై పెట్టుబడి పెట్టాలనికున్నవారికే ఈ సమస్య ఎదురవుతుంది.రెండో ప్రాపర్టీ తీసికోవడం వల్ల రాబడి ఎంత వస్తుంది అన్నది గమినించాలి.ఏదయినా కమర్షియల్ ప్రాపర్టీ తీసికుంటే కిరాయి బాగా వస్తుంది చాల కొద్ది మంది మాత్రమే ఆలోసిస్తారు.రిస్క్ లేకుండా ఫ్లాట్,ఇల్లో తీసికుంటే సరిపోతుంది అనుకుంటారు.కానీ కమర్షియల్ ప్రాపర్టీ తీసికోవడం వలన నెలవారీ ఆదాయం మెరుగుపడుతుంది అని గుర్తుపెట్టుకోండి.

ఇల్లు కొంటె:commercial property అంటే ఏమిటీ

ఎంత ప్రైమ్ ఏరియాలో వున్నా ఇంటి అద్దె మరి ఎక్కువుగా రాదు.కొన్ని సార్లు ఒకటి రెండు నెలలు ఇల్లు కాళిగాను ఉండచ్చు.పైగా ఇంటిలో ఏ చిన్న మరమ్మతు చేయాలిసివచ్చిన బాధ్యత మీ పైనే ఉంటుంది.

కమర్షియల్ ప్రొపెర్టీ:

కాస్త పెట్టుబడి ఎక్కువ అయినా కమర్షియల్ ప్రొపెర్టీ కొనడం వలన యజమానికి కొంత అధిక లాభం చేకూరుతుంది అని చెప్పవచ్చు.కోటి రూపాయలు విలువైన కమర్షియల్ ప్రాపర్టీ పైన నెలకు అద్దె 50 వేలు వరకు రావచ్చు.అంటే ఏడాదికి 6లక్షలు రాబడి వస్తుంది.ఏ చిన్న పట్టణంలోనైనా దుకాణాలు ఏర్పాటు చేయవచ్చు.వారియొక్క వ్యాపారం క్లిక్ అయ్యిందో…వాళ్ళు కాళీ చేయరు,దింతో అద్దె ఇప్పటితో ఆగదు.ప్రతి సంవ్సతరం అద్దె పెరుగుతూనే ఉంటుంది. భవిషత్తులో రెట్టింపు లాభానికి అమ్మవచ్చు.

ఈ ప్రొపెర్టీ యొక్క లాభాలు:commercial property అంటే ఏమిటీ?

అధిక రెంటల్ ఆదాయం

రెసిడెన్షియల్ ప్రాపర్టీతో పోలిస్తే, కమర్షియల్ ప్రాపర్టీ నుంచి వచ్చే అద్దె చాలా ఎక్కువగా ఉంటుంది.ఒక మంచి లోకేషన్‌లో ఉన్న షాప్ లేదా ఆఫీస్ నెలకు స్థిరమైన ఆదాయం ఇస్తుంది.రెసిడెన్సియల్ రియల్ ఎస్టేట్ తో పోలిస్తే కమర్షియల్ రియల్ ఎస్టేట్ అధిక అద్దె ఆదాయాన్ని ఇస్తుంది.వాణిజ్య ఆస్తి నుండి వచ్చే సగటు అద్దె ఆదాయం ఆస్తి ధరలో 8-11 శాతం మధ్య ఉంటుంది.కమర్షియల్ ప్రాపర్టీ నుంచి వచ్చే ఆదాయం ఒక్కో ప్రాంతానికి మారుతూ ఉంటుంది.అద్దెల ద్వారా డబ్బు సంపాదించాలి అనుకుంటే ఇదే బెస్ట్ ఛాయస్.

ఈజీ డీలింగ్ అంటే ఏమిటీ?commercial property అంటే ఏమిటీ

వాణిజ్య ఆస్తిని అద్దెకు తీసికునే వారిలో బాగా స్థిరపడిన కంపెనీలు కూడా వున్నాయ్.కార్పొరేట్ క్లయింట్లతో వ్యవహరించడం ఎల్లప్పుడు సులభతరం అవుతుంది.నెలవారీ అద్దె వసూలకోసం వారిని వెంటాడి వెళ్లే సమస్య ఉండదు.పేరున్న బ్యాంకు లేదా కార్పొరేట్ క్లయింట్ అద్దెకు ఆస్తిని తీసికుంటే,ఆస్తికి డిమాండ్ పెరుగుతుంది.నెలవారీ అద్దె కూడా పెరుగుతుంది.

లీజ్ ఖర్చు ఎవరు భరించాలి.

ఆస్తిని లీజుకి తీసికున్న తరువాత,లీజుకి తీసికున్న వ్యక్తి ఆస్తిని సమకూర్చడానికి అయ్యే ఖర్చుని బరించాలి.ఆస్తిని పార్టీకి అప్పగించడం యజమాని విధి.అద్దెకు తీసికున్న వ్యక్తి ఆస్తిని సమకూర్చే బాధ్యతను తీసికుంటాడు.కమర్షియల్ ప్రాపర్టీలో సాధారణంగా 3, 5, 9 లేదా 15 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్స్ ఉంటాయి.దీంతో అద్దెదారు మారే అవకాశం తక్కువగా ఉంటుంది.

మెయింటెనెన్స్ బాధ్యత తక్కువ

చాలా కమర్షియల్ లీజుల్లో…మెయింటెనెన్స్….రిపేర్ ఖర్చులు…..ఇంటీరియర్ మార్పులు అద్దెదారుడే చూసుకుంటాడు. ఇది ఓనర్‌కు పెద్ద ప్లస్.మీరు మీ ఇంటికి సంబంధించి గ్రోసరీ ఆఫర్స్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి https://amzn.to/4p5fNfn 

రెంటల్ వృద్ధి (Rental Escalation)

ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి 5% – 10% అద్దె పెంపు ఒప్పందంలోనే ఉంటుంది.దీంతో ఆదాయం క్రమంగా పెరుగుతుంది.ఇది మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ (ROI).కమర్షియల్ ప్రాపర్టీ సాధారణంగా 8% – 12% వార్షిక రిటర్న్స్ ఇవ్వగలదు, కొన్ని ప్రైమ్ ఏరియాల్లో ఇంకా ఎక్కువ.మెట్రో సిటీలు, హైవేలు, ఐటీ హబ్‌ల దగ్గర ఉన్న కమర్షియల్ ప్రాపర్టీల విలువ కాలక్రమేణా ఎక్కువగా పెరుగుతుంది.చాలా బ్యాంకులు కమర్షియల్ ప్రాపర్టీపై లోన్లు ఇస్తాయి, ముఖ్యంగా రెంటల్ ఆదాయం ఉన్న ప్రాపర్టీలకు.

Best House construction
best home design tips

ఈ ప్రొపెర్టీ యొక్క నష్టాలు :commercial property అంటే ఏమిటీ?

పెట్టుబడి:

వాణిజ్య ఆస్తి కొనాలంటే పెట్టుబడి ఎక్కువుగా ఉంటుంది.రెసిడెన్షియల్ ప్రోపర్టీ కొనుగోలుతో పోలిస్తే,కమర్షియల్ ప్రొపెర్టీ సంపాదించడానికి ఎక్కువ ఖర్చు చేయాలి.అలాగే పన్నులు,జోనల్ నిబంధనలు, వాణిజ్య ఆస్తిని అద్దెకు తీసికొనే ఉప చట్టాలపై అవగాహన అవసరం.

రుణాలు:

రెండో ప్రోపర్టీకి కూడా బ్యాంకు లోన్ అవకాశం ఉంటుంది.ఇంటికి అయితే తక్కువ వడ్డీకే లభిస్తుంది.కమర్షియల్ ప్రోపర్టీకి వడ్డీరేటు కాస్త ఎక్కువుగా ఉంటుంది.ఇంటికి 85 శాతం వరకు రుణం తీసికోవచ్చు.అంతేకాకుండా ఆస్తి స్వభావం, పెట్టుబడిదారుడు పోఫైల్, రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం బట్టి రుణం అనేక సరుతులు,నియమాలతో మంజూరు చేస్తారు.

ప్రారంభ పెట్టుబడి ఎక్కువ commercial property అంటే ఏమిటీ?

కమర్షియల్ ప్రాపర్టీ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.షాప్ లేదా ఆఫీస్ కొనాలంటే పెద్ద మొత్తంలో మూలధనం అవసరం. రెసిడెన్షియల్ ప్రాపర్టీతో పోలిస్తే కమర్షియల్ ప్రాపర్టీని అమ్మడం కష్టం.కొనుగోలుదారులు తక్కువగా ఉంటారు.

వ్యాపార మాంద్యం ప్రభావం

ఆర్థిక మాంద్యం, మార్కెట్ డౌన్ అయినప్పుడు….షాపులు ఖాళీ కావచ్చు…రెంట్లు తగ్గవచ్చు…..లీజ్ రద్దు కావచ్చు.ఒక అద్దెదారు వెళ్లిపోయిన తర్వాత, కొత్త అద్దెదారు దొరకకపోతే నెలల తరబడి ఆదాయం లేకపోవచ్చు.

చట్టపరమైన క్లిష్టతలు

లీజ్ అగ్రిమెంట్స్,GST,కమర్షియల్ ట్యాక్స్,స్థానిక నిబంధనలు,ఇవి రెసిడెన్షియల్ ప్రాపర్టీ కంటే క్లిష్టంగా ఉంటాయి.

అధిక పన్నులు

కమర్షియల్ ప్రాపర్టీ లో , ప్రాపర్టీ ట్యాక్స్,GST, ఇన్‌కమ్ ట్యాక్స్,ఎక్కువగా ఉంటుంది.

మార్కెట్ పరిజ్ఞానం అవసరం

సరైన లోకేషన్, సరైన టైమింగ్, సరైన బిజినెస్ డిమాండ్ తెలుసుకోకుండా పెట్టుబడి పెడితే నష్టాలు వచ్చే అవకాశం ఉంది.భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాలు ఉన్న ప్రదేశమే ఎంచుకోండి.NH, SH, రింగ్ రోడ్డు దగ్గరలో ఉంటే మంచిది.అలాగే ప్రముఖ కాలేజీలు, హాస్పిటల్స్,ఇండస్ట్రియల్ జోన్, IT పార్క్ దగ్గర,ఈ లొకేషన్స్ లో పెట్టిన ప్లాట్ 5–10 ఏళ్లలో డబుల్ అవుతుంది.

ఎవరికీ  ప్రాపర్టీ సరిపోతుంది?commercial property అంటే ఏమిటీ?

దీర్ఘకాల పెట్టుబడి చేసే వారు…..స్థిరమైన ప్యాసివ్ ఇన్‌కమ్ కోరుకునేవారు…..రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్న వారు….మార్కెట్ అవగాహన ఉన్న ఇన్వెస్టర్లు కి సరిపోతుంది.

 property  కొనేముందు గమనించాల్సిన అంశాలు:

లోకేషన్ –అనేది చాల ఇంపార్టెంట్.ఆ లొకేషన్ పరిధిలో  ట్రాఫిక్, పార్కింగ్, బిజినెస్ డిమాండ్ ఎలా వుందో చూసికోవాలి….ఫ్యూచర్ డెవలప్‌మెంట్ – ఆ పరిధిలో మెట్రో, హైవే, ఐటీ హబ్ ఇలాంటివి ఎప్పుడైనా వస్తాయా/ రావా అని చూసికోవాలి…..లీజ్ అగ్రిమెంట్ – కాలం, అద్దె పెంపు నిబంధనలు తెలిసికోవాలి….టెనెంట్ ప్రొఫైల్ – బ్రాండెడ్ కంపెనీ అయితే మంచిది…..భవిష్యత్తులో అభివృద్ధి అవకాశాలు ఉన్న ప్రదేశమే ఎంచుకోండి.NH, SH, రింగ్ రోడ్డు దగ్గరలో ఉంటే మంచిది.

రెరా నిబంధనలు:commercial property అంటే ఏమిటీ?

రెరా చట్టం ప్రకారం,డెవలపర్లు తమ ప్రాజెక్టులను RERA లో కచ్చితంగా నమోదు చేసికోవాలి.ప్రాజెక్ట్ ప్లాన్స్,లేఔట్స్,ప్రాజెక్ట్ పూర్తి చేసే తేదీ వివరాలను ముందుగానే కొనుగోలుదారులకు తెలియచేయాలి.కాబట్టి ఆస్తులను కొనుగోలు చేయలని అనుకుంటే,కచ్చితంగా రెరా వెబ్సైటులో నిర్మాణంలో వున్నా ఆస్తి వివరాలను ముందుగానే తనిఖీ చేసుకోవాలి. లేదంటే నిపుణుల సలహా తీసికోవడం ఉత్తమం.RERA రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్లను మాత్రమే ఎంచుకోండి.RERA ద్వారా మీ పెట్టుబడి సురక్షితం.నిర్వాహకుడి డబ్బు దారి మళ్లించలేరు.సమయానికి పూర్తి చేయాలనే బాధ్యత ఉంటుంది.మోసాలు తగ్గుతాయి

NA (Non-Agriculture) Conversion తీసుకోవాలి:

భూమి వ్యవసాయ భూమి (Agriculture Land) గా ఉందా?అగ్రికల్చర్ ల్యాండ్‌ను లేయౌట్‌గా మార్చకముందు NA (Non-Agriculture) Conversion తీసుకోవాలి.NA లేకపోతే….భవిష్యత్తులో ఎలాంటి కట్టడాలు చేయలేరు.బ్యాంకు LOAN ఇవ్వదు.ప్రభుత్వ అధికారులు ఎప్పుడైనా భవనం కూల్చివేయవచ్చు.FMB/ అడంగల్ /Pahani /ROR వంటి Revenue Records చెక్ చేయండి.ఇవి గ్రామ పంచాయతీ / రెవెన్యూ డిపార్టమెంట్ రికార్డులు.ఇవి మీకు భూమి పై స్పష్టమైన హక్కు ఎవరిదో చెబుతాయి.

(EC – Encumbrance Certificate):

EC ద్వారా మీరు చెక్ చేయాల్సింది….భూమిపై ఏమైనా బకాయిలు ఉన్నాయా? (EC – Encumbrance Certificate)..ఈ భూమిపై ఏమైనా పాత రుణాలు ఉన్నాయా…లేదంటే ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా.ఎవరికైనా పూచీకత్తుగా పెట్టారా…యజమాని పేరు సరైనదా కాదా అని తెలిసికోవచ్చు.EC ని meeseva / registration office / online portals లో తీసుకోవచ్చు.

మీకు ప్లాట్ లోన్ కి సంబంధించి పూర్తి సమాసారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండిhttps://impresshomedesigners.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%9f%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8/?preview_id=2934&preview_nonce=3fbaca9925&post_format=standard&_thumbnail_id=2967&preview=true  

మా construction company సర్వీసెస్ :

*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును . మా phone number  ;7989312152 , 9989456907.

flats for sale
villas for sale