Double Bedroom Design in 10lakh ? 10lakhs లో double bedroom నిర్మాణము ఎలా :

Double Bedroom Design in 10lakh ? 10lakhs లో double bedroom నిర్మాణము ఎలా :

Double Bedroom Design in 10lakh: పక్కా ప్లాన్ తో ఇంటి నిర్మాణము మొదలు పెడితే 10lakh లో వందగజాలు లో డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించుకోవచ్చు. మధ్యతరగతి ప్రజలకు ప్రస్తుతము వున్నా ధరలతో సొంతఇంటి కళ అందని ద్రాక్ష అయింది. కాబట్టి ఇంటినిర్మాణం లో కొన్ని జాగ్రత్తలు తీసికొంటే పది లక్షలో మంచి ఇంటిని సొంతం చేసికోవచ్చు.నగరాల్లో చాల ప్రాంతాల్లో పాత ఇల్లును కూల్చేసి కొత్త ఇల్లును నిర్మించుకుంటున్నారు.

ఇంటీరియర్..ఫ్లోరింగ్ వంటి ఏర్పాట్లలో ఆడంబరాలికి పోకుండా ప్రణాళిక బద్దంగా నిర్మించు కుంటే ఈ ఇళ్ళను 10lakh లో పూర్తి చేయవచ్చు. సాధారణంగా ఇంటి నిర్మాణము అంటేనే కష్టంతో కూడుకున్న పని,  ఎంతో ఖరీదు అయినది..చాల సమయం వెంచించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ధరలను చూస్తే  డబల్ bedroom ఇల్లు నిర్మించాలి అంటే…కనీసం రూ.25 లక్షలు అవుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసికోవడం తప్పనిసరి.

జాగ్రత్తలు double bedroom design in 10lakh  :

ఇంటి నిర్మాణము సమయంలో అదనపు ఖర్చులు రాకుండా చూసికోవాలి. పూనాదిలు నుంచి స్లాబులు వరకు అంతా ప్రణాళికబద్దంగా జరగాలి. ఉదాహరణకు ఇంటి నిర్మాణము సమయంలో పునాదులు కోసం తీసిన మట్టిని పక్కనే పోయించుకుంటే పిల్లర్లు, పునాదులు పనులు పూర్తి అయినా వెంటనే పూడ్సికొనే అవకాశము ఉంటుంది.

అలాగే నిర్మాణము చేపట్టే మెస్ట్రీ, ఈ ఇల్లు పూర్తి అయ్యాకే మరో ఇంటి పనులు చేపట్టే విదంగా ఉండాలి. ఒకేసారి మూడు, నాలుగు ఇల్లు పనులు చేస్తున్నట్లు అయితే  కూలీలకు పనులు అప్పచెప్పి అవకాశము వుంది. దానివల్ల ఇంటి నిర్మాణం అనుకున్న సమయంలో అనుకున్న విదంగా పూర్తి కాదు.

ప్లానింగ్ ముఖ్యం :

ఇంటిని ముందుగా ఎటువంటి అవసరాలకి ఉపయోగిస్తామో ఒక అంచనాకి రావాలి. స్థలం రోడ్ వైపు ఉంటే భవిష్యత్తులో షాప్ పెట్టిందుకు అనువుగా ఉంటుందో లేదో చూసికోవాలి. భవిష్యత్తులో అదనపు అంతస్తులు వేసి ఇంటిని అద్దెకు ఇవ్వాలి అనుకుంటే అందుకు తగ్గట్టు నిర్మాణం చేసికోవాలి.  మీ అభిరుషికి తగ్గట్లు ఎన్ని bedrooms, బాత్రూమ్స్ రావాలి …వంటగది, పూజగది ఎటువైపు ఉండాలి…హాల్ సైజు, గాలి, వెలుతురు వచ్చేవిదంగా ప్రధానద్వారం, కిటికీలు ఎలావుండాలి అన్న వివరాలు ఆర్కిటెక్చర్ కి చెప్పి ప్లాన్ తీసికోవాలి.

వాస్తుపై నమ్మకం వుంటే వాస్తు శాస్త్ర నిఫుణుడిని సంప్రదించి ప్లాన్ చూపించి అభిప్రాయం తెలిసికోవాలి. స్పస్టమైన ప్లాన్ తో ఇంటి నిర్మాణానికి సిద్ధమవ్వాలి. ప్లాన్ పై పూర్తి అవగాహనా, నమ్మకం వచ్చిన తరువాత నిర్మాణంలోకి దిగాలి. ఒకసారి నిర్మాణం మొదలు పెట్టినాక ప్లాన్ లో ఎటువంటి మార్పులు చేయకుండా చూసికోవాలి.

ఆర్కిటెక్ట్ ఎంపిక :

ఇంటి నిర్మాణంలో ఆర్కిటెక్ట్ ఎంపిక చాల కీలకమైనది. సరైన ఆర్కిటెక్ట్ ను ఎంచుకోవడం వలన ఎన్నో లాబాలువుంటాయ్. క్వాలిటీ ఆర్కిటెక్ట్ నీ ఎంచుకోవడం వలన అందుబాటులో వున్నా స్థలాన్ని 100% వాడుకోవడమే కాకుండా కన్స్ట్రక్షన్ ఖర్చులు తగ్గిస్తాడు. కన్స్ట్రక్షన్ ఆలస్యం కావడంతో ఎక్కువుగా నిర్మాణ ఖర్చులు పెరుగుతాయి. అదే క్వాలిటీ గ్రేడ్ కాంట్రాక్టర్ నీ ఎంపిక చేసికుంటే అనుకున్న టైం లో నిర్మాణ పనులు పూర్తి చేసికోవచ్చు.

ఆర్కిటెక్ట్ , కాంట్రాక్టరుని ఎంచుకున్న తరువాత ఇద్దరకీ ప్రయోజనం కలిగేలా అగ్రిమెంట్ తప్పనిసరి. ఇంటి నిర్మాణం పూర్తి అయ్యేవరకు అడ్వాన్స్ అమౌంట్ తరువాత  ఎలాంటి ప్రెమెంట్స్ చేయకపోవడమే మంచిది. అలాగే అగ్రిమెంట్లో ఫీజ్ ఎంత ..మెటీరియల్ ఎవరు తెస్తారు…ఎప్పటిలోపు వర్క్ పూర్తి అవుతుంది..ఒకవేళ లేట్ అయితే ఫెనాలిటీ వేయడం వంటి అంశాలు కచ్చితంగా మెన్షన్ చేయాలి .

అనుమతులు :Double Bedroom Design in 10lakh:

ప్రభుత్వ అనుమతులు వున్న లేఔట్లలో ఇల్లు నిర్మించుకొనేఅందుకు మున్సిపాలిటీ, కార్పొరేషన్ కు దరఖాస్తు చేసికోవాలి. ప్రభుత్వ అనుమతులు ఉన్న లేఔట్ లలో రోడ్లు, విద్యత్, డ్రైనేజీ, మంచి నీటి సౌకర్యాలు ఉంటాయి. ఇంటి ప్లాన్, సెట్ బ్యాక్ అన్ని సక్రమంగా ఉంటే నెలరోజుల్లోనే అనుమతులు వస్తాయ్. డ్రైనేజీ గురించి ప్లాన్ లో ఉండాలి. విద్యుత్ కనెక్షన్, నీటి కనెక్షన్ ఇంటినిర్మాణం పూర్తి అయ్యాక ఇస్తారు.

ఈ ప్లాట్లలో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకు లనుంచి గృహ రుణం పొందవచ్చు. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే నిధులలో కనీసం 20-30 శాతమైనా సొంత పెట్టుబడి ఉండాలి. బ్యాంక్ కు చెల్లించే EMI కూడా పదేళ్లు లోపు ఉండేలా చూసీకోవాలి అంతకు మించితే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం వుంది. “అదే అక్రమ లేఔట్ లో ప్లాట్లు కొంటె ఎటువంటి సౌకర్యాలు వుండవు పర్మిషన్ రాదు అలాగే లోన్స్ కూడా రావు”.

2BHK House Construction Cost :

2BHK House Construction Cost :  Double Bedroom ఇల్లు కట్టుకోవడానికి మినిమం 100 గజాలు స్థలం ఉండాలి,  2025 లో 100 గజాలు లేదా 1000sft లో మనం ఇల్లు కట్టుకోవాలి అంటే  (20lakh ) వరకు అవుతుంది. అది మన ఇళ్ళు మనం కట్టుకున్న లేదంటే కాంట్రాక్టర్ కి ఇచ్చిన ,  అదే మనం కాంట్రాక్టర్ కి(మెటీరియల్ తో ) ఇచ్చినట్లు అయితే “SFT”  కి 2000/  charge చేస్తారు(cupboard work ఉండదు ).

no.1 క్వాలిటీ లో ఇల్లు కట్టించి ఇవ్వడానికి, అదే మెటీరియల్ మీరు చూసికొని ఓన్లీ labor and mastery  అయితే SFT కి  300/ to 350/ తీసికుంటారు. ఏరియా బట్టి మారవచ్చు. cupboard వర్క్ కి అదనంగా ఛార్జ్ చేస్తారు SFT 700 to 800/ charge చేస్తారు, అదే మోడరన్ గ డిజైన్ చేసికోవాలి అంటే 1500 to 2000/ వరకు అవుతుంది .https://amzn.to/4lid8hk

common expenses and petty expenses :

ఈ expenses అనేవి టోటల్ బడ్జెట్లో 10 to 15% ఉండవచ్చు అవి ఏంటి అంటే, బిల్డింగ్ పర్మిషన్ తెచుకోవాలి(no objection certificate ) ఇది village లో 5k to 10k ఉంటుంది, సిటీలో అయితే 30 to 50k వరకు ఉంటుంది , తరువాత గవర్నమెంట్ నుంచి power connection మరియు water connection కి పెర్మిషన్ తీసికోవాలి వీటికి 50k వరకు  అవ్వచ్చు, తరువాత ఇంజనీర్ లేదా సిద్దాంత్ ప్లాన్ కి 5k to 10k ఉంటుంది.

తరువాత స్థలం శుభ్రం చేసికొని భూమి పూజకి(శంకుస్థాపన ) 20k . septic tank 20k , మోటార్ కి 50k (hand pump 20k ), ముగ్గు వేసి గుంతలకి 20k . basement ఫిల్ చేయడానికి గ్రావెల్ డస్ట్ లేదా నేలమట్టి లేదా కొండ రాయ లేదా  ఇసుక ఉపయోగిస్తారు వీటికి సుమారుగా 50k అవుతుంది 

2BHK House Construction Cost :

సిమెంట్ :

సిమెంట్ 53grade లేదా 43గ్రేడ్ సిమెంట్ వాడుతారు ఇవీ సుమారుగా 350 to 400బాగ్స్ అవసరం ఉంటాయి ఇప్పుడు మార్కెట్ రేట్ one bag cost  300/ నుంచి స్టార్ట్ అవుతుంది ఏరియా బట్టి మారుతుంటుంది.సిమెంట్ కి అయ్యే ఖర్చు  400*300=120000/. అల్ట్రాటెక్ సిమెంట్ వాడితే చాల మంచిది 

SAND / ఇసుక :

ఇసుక అనేది 20units వరకు అవుతుంది ఒక యూనిట్(one tractor )  రేట్ ఇప్పుడు 2000/ వుంది అంటే 20*2000/=40000/ వరకు ఇసుక కాస్ట్ ఉంటుంది .ఇసుక అనేది మంచిదా లేదా అనేది చూసికోవాలి ఎక్కవ మట్టి మరియు రాళ్లు కలిసిన ఇసుక తెచ్చేస్తున్నారు దీని వలన గోడలు పగుళ్లు వచ్చేస్తాయి , మట్టి కలిసినట్లు అయితే బాగా జల్లిడించి వాడుకోవాలి .Double Bedroom Design in 10lakh

bricks / ఇటుక double bedroom design in 10lakh :

ఇప్పుడు బ్రిక్స్ లో చాల రకాలు వచ్చేశాయ్, ఇప్పుడు ఎర్ర ఇటుక గురించి చెప్పినట్లు అయితే 13000 ఇటుకలు సుమారుగా ఉండాలి one brick 10rs ఉంటుంది (మంచి ఇటుక అయితే) 2bhk house కి బ్రిక్ cost 13000*10=130000/ అదే సిమెంట్ ఇటుక అయితే 90000/ అవుతుంది .

ఐరన్ / ఇనుము :

ఐరన్ అనేది ఇంటికి వెన్నుఎముక లాంటిది, ఇల్లు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఐరన్ మంచి క్వాలిటీ తీసికోవాలి, TMT BAR ఐరన్ వాడాలి లోకల్ వి వాడకూడదు . ఐరన్ 5ton అవసరం ఉంటుంది one ton cost 70000/ఉంటుంది 5*70000=350000/.

concrete/పిక్కా :

40mm మరియు 20mm కలిపి 13యూనిట్స్ ఉండాలి ఒక యూనిట్ ధర 5000/ ఉంటుంది 13*5000=65000/, 40mm అనేది footings మరియు ఫ్లోరింగ్ కి ఉపాయాగిస్తారు , 20mm పిల్లర్స్ , స్లాబ్ ,భీమ్స్ కి ఉపయోగిస్తారు .Double Bedroom Design in 10lakh:

doors అండ్ windows :

వీటికి సుమారుగా 250000/ వరకు అవ్వచ్చు . ఒకప్పుడు చాల మంది డోర్స్ కి విండోస్ కి టేక్  వాడేవారు ఇప్పుడు మెయిన్ డోర్ కి టేక్ డోర్ తీసికొని మిగిలినవాటికి WPC డోర్స్ పెట్టుకుంటున్నారు విండోస్ కి UPVC పెట్టుకుంటూన్నారు లుక్ కోసం ఏమి పెట్టుకున్న ఐరన్ గ్రిల్ అనేది విండోస్ కి డోర్స్ కి పెట్టించికోవాలి . దొంగతనాలు జరగకుండా ఉండాలి అంటే .

ceiling:

2bhk house ceiling కి ప్లైన్ అయితే 50k అదే డిజైన్ అయితే 100000/ అవుతుంది . చాల మంది లుక్ కోసం లోపల gypsum ceiling పెట్టించుకుని బయట వరండాలో యూపీవీసీ ceiling చేయించుకుంటున్నారు , ఇప్పుడు లేటెస్ట్ మోడల్ 

ELECTRICAL / PLUMBING / PUTTY PAINT :

2BHK హౌస్ కి ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ కి మెటీరియల్ తో సుమారుగా 180000/ అవ్వవచ్చు అలాగే పుట్టి పెయింట్ కి 100000/వరకు అవుతుంది లోపల బయట .

tiles /granite /మార్బల్స్ :Double Bedroom Design in 10lakh:

వీటికి 150000 to 200000/ వరకు అవుతుంది .అలాగే plain cupboard 4lakh వరకు అవుతుంది అదే ప్లైవుడ్ cupboard వర్క్ కు 8lakh వరకు అవ్వచ్చు , తరువాత SS railing 30k , zinc pipe 15k , gate 50k , gas railing 20k వరకు అవ్వచ్చు .

labor mastery:

వీలు ఏరియా బట్టి SFT కి 350 to 400/ ఛార్జ్ చేస్తారు అంటే 350000 to 400000/ వరకు కూలీలు అవుతాయి అదే మాటేరియాలతో అయితే low cost SFT : 2000/ middle cost : 2300/ high cost SFT : 2500/ ఈ SFT AREA కొలతలు SLAB ఏరియా బట్టి తీసికుంటారు . 

మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకున్నపుడు మీరు దగ్గర వుండి కట్టించుకుంటే బెటర్ బిల్డర్ కి ఇచ్చే బదులు అలాయితే one or two lakh వరకు సేవ్ అవుతారు ఒకవేళ మీకు వీలు అవ్వనట్లు అయితే మంచి బిల్డర్ కి మీకు తెలిసిన వారికీ ఇచ్చి అగ్రిమెంట్ రాపించుకొని ముందుకు సాగవచ్చు .

ఇల్లు కట్టుకొనే విధానం step by step process :

* ముందుగా స్థలాన్ని(ఇల్లు కట్టుకున్నప్లేస్)  శుభ్రం చేసికోవాలి (క్లీనింగ్ ) ఆ తరువాతసాయిల్ 

soil test (Double Bedroom Design in 10lakh):

 “soil” test చేసికోవాలి 6′ to 20′ వరకు మట్టిని(layer కి layer కి ఎర్రమట్టి మరియు తెల్లమట్టి ) చెకరించి టెస్టుకి పంపించాలి. site కి చుట్టువైపులా లేదంటే site ki ముందు వెనుక భాగం వరకు మట్టిని చెకరించి test కి పంపించాలి . “soil test” ఎందుకుఅంటే రిపోర్ట్ వచ్చినాక రిపోర్ట్ బట్టి గోతులు ఎంతలోతు తీయాలి ఎంత వెడల్పు తీయాలి ఎంత ఎంత కాంక్రేట్ వేయాలి,ఏ ఏ కాంక్రెట్ వాడాలి, ఎంత  ఎంత rod లు ఉపయోగించాలి ఇలా ప్రతి పాయింట్ (పని గురించి ) “soil test ” పైనా ఆధారపడుతుంది . ఎన్ని ఫ్లోర్స్ ( stair లు ) కట్టుకోవచ్చు అనేది కూడా తెలుస్తుంది . రిపోర్ట్ బట్టి work అనేది start చేయాలి.

* “Siddhanth” లేదా “engineer’ దగ్గర ప్లాన్ తీసికోవాలి, తరువాత సైట్ మొత్తం(ఇల్లు కట్టుకున్న ప్లేస్ ) కొలతలు తీసికొని సున్నము తో మార్కింగ్ చేసికోవాలి( మూలమట్టం సరిచూసికోవాలి ఇది చాల ఇంపార్టెంట్ )    

శంకుస్థాపన చేయాలి తరువాత work అనేది start చేయాలి (అవుతుంది )

* footings కోసం సున్నం తో మార్కింగ్ చేసికొని గుంతలు తీయాలి (గుంతలు అనేవి 4’*5′ లేదా 5’*5′ లేదా 5’*6′ తీసికోవాలి అలాగే వీటి mat 4*4 సైజు లో ఉండాలి . కొలతలు(మార్కింగ్ ) అనేవి చాల జాగ్రత్తగా చూసికోవాలి ఒకటికి పదిసార్లు, అలాగే  మూలమట్టాలు సరిచూసికోవాలి ఇది చాల ఇంపార్టెంట్ .

* ఈ శాన్యం లో బోర్ (pump ) వేయించుకోవాలి .

సర్వీసెస్ :

*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .Renovation House Ideas
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును .