gypsum plastering? జిప్సం కాంక్రేటుతో ప్లాస్టరింగ్ ప్రయోజనాలు?
gypsum plastering:
gypsum plastering: అంటే –సిమెంట్, ఇసుక, నీరు కలిపి చేసే సంప్రదాయ ప్లాస్టరింగ్‌కు బదులుగా Gypsum Powder + Water మిశ్రమంతో గోడలు లేదా సీలింగ్‌లకు ప్లాస్టర్ చేస్తూవుంటారు.ఇళ్ల నిర్మాణం, అపార్ట్మెంట్లు, కమర్షియల్ బిల్డింగ్స్‌లో ఇప్పుడు సంప్రదాయ సిమెంట్ ప్లాస్టరింగ్‌కు బదులుగా Gypsum Plastering (జిప్సం ప్లాస్టరింగ్) విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. జిప్సం తయారీకి కావలిసిన కాల్షియం సల్పేట్ ను ఇరాన్ , ఒమన్ వంటి దేశాలనుంచి దిగుమతి చేసికుంటారు. తక్కువ సమయం, మంచి ఫినిష్, తక్కువ ఖర్చు వంటి కారణాల వల్ల జిప్సం ప్లాస్టర్ డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతోంది.ఇది వేగంగా ఎండిపోతుంది,మృదువైన (Smooth) ఫినిష్ ఇస్తుంది,పెయింటింగ్‌కు సిద్ధంగా ఉంటుంది.
జిప్సం కాంక్రేటుతో ప్లాస్టరింగ్:
ఇంటి నిర్మాణంలోనూ టెక్నాలజీ ప్రవేశించింది.అనేక రకాల కొత్త పోకడల్ని బిల్డర్స్ ప్రయత్నిస్తున్నారు.వాటిలో ఈ జిప్సం ప్లాస్టరింగ్ ఒకటి.లోపల గోడలకు సిమెంట్ ప్లాస్టరింగ్ స్థానంలో జిప్సం వాడుతున్నారు.కొత్త ప్రాజెక్టుల్లో ఎక్కువుగా దీన్నే వాడుతున్నారు.నది ఇసుక కొరత కారణంగా జిప్సం వైపు మొగ్గు చూపుతున్నారు.ఇంటి నిర్మాణంలో ప్లాస్టరింగ్,క్యూరింగ్ కి చాల సమయం పడుతుంది.అందుకే జిప్సం వైపు మొగ్గు చూపుతున్నారు.ఇసుక, సిమెంట్ సమపాళ్లలో వాడకపోవడం,వీటిలో నాణ్యత లోపించడం,సరిగ్గా క్యూరింగ్ చేయకపోవడం గోడలకు పగుళ్లు ఎక్కువగా వస్తున్నాయ్. జిప్సం తో ఈ సమస్యకు అడ్డుకట్ట వేయవచ్చు అని బిల్డర్స్ చెప్తున్నారు.మీరు మీ ఇంటికి సంబందించి గ్రోసరీ కోసం ఈ లింక్ పై క్లిక్ చేసి మంచి ఆఫర్స్ పొందండి. https://amzn.to/4qjM5V7
జిప్సం అంటే ఏమిటి?gypsum plastering
Gypsum అనేది సహజంగా లభించే ఒక మినరల్. దీని రసాయనిక పేరుCalcium Sulphate Dihydrate (CaSO₄·2H₂O).జిప్సం రాళ్లను ప్రాసెస్ చేసి(పగలగొట్టి) పౌడర్ రూపంలోకి మార్చిన తరువాత, నిర్మాణ రంగంలో ప్లాస్టరింగ్ కోసం ఉపయోగిస్తారు.Gypsum Plaster రకాలు(Plaster of Paris (POP),Natural Gypsum Plaster ,Synthetic Gypsum, Plaster Ready-Mix Gypsum Plaster )ఇందులో Ready-Mix Gypsum Plaster ఎక్కువగా వాడుతున్నారు.
జిప్సం కాంక్రేటు అంటే ఏమిటి?
జిప్సం ఆధారంగా తయారైన ప్లాస్టరింగ్ మెటీరియల్‌ను సాధారణంగా జిప్సం కాంక్రేటు అని కూడా అంటారు. ఇది సిమెంట్ కాంక్రేట్లా బరువుగా కాకుండా, తేలికగా ఉంటుంది.కొన్ని సంస్థలు ఇప్పటికే గృహ , వాణిజ్య నిర్మాణాల్లో జిప్సం ప్లాస్టరింగ్ ఉపయోగిస్తున్నారు .ప్రస్తుతం బిహార్ , ఒడిశా కార్మికులు ఈ పనిచేస్తున్నారు.
Gypsum Plastering చేసే విధానం (Step-by-Step)
ముందుగా గోడ ఉపరితలం సిద్ధం చేయాలి అంటే గోడపై దుమ్ము, ఆయిల్, లూజ్ పార్టికల్స్ తొలగించాలి.కాంక్రెట్ గోడ అయితే కొద్దిగా తడిగా ఉంచాలి.ఆ తరువాత జిప్సం మిశ్రమం తయారీ చేయాలి అది ఎలా అంటే…. శుభ్రమైన నీరు తీసికోవాలి నీటిలో జిప్సం పౌడర్ కలపాలి.మిక్సర్‌తో లంప్స్ లేకుండా బాగా కలపాలి.ఆ మిశ్రమాన్ని 5–10 నిమిషాల్లో ఉపయోగించాలి.ఆ తరువాత ప్లాస్టర్ ట్రోవెల్ లేదా స్పాటులాతో గోడపై అప్లై చేయాలి.సాధారణంగా 10–12 mm మందం సరిపోతుంది. లెవెలింగ్ & ఫినిషింగ్ అనేది స్మూత్ ఫినిష్ వచ్చేలా లెవెలింగ్ చేయాలి.20–30 నిమిషాల్లో సెట్ అయిపోతుంది.పెయింటింగ్‌కు సిద్ధం అయిపోతుంది.24 గంటల్లోనే పెయింట్ చేయవచ్చు.
ప్లాస్టరింగ్ ప్రయోజనాలు (Advantages)
తొందరగా పూర్తవుతుంది:
సిమెంట్ ప్లాస్టరింగ్‌లో 7–10 రోజులు క్యూయరింగ్ అవసరం.Gypsum ప్లాస్టరింగ్‌లో క్యూయరింగ్ అవసరంలేదు. సమయం ఆదా అవుతుంది. లేబర్ ఖర్చు తక్కువ ఉంటుంది.Gypsum Plastering ఖర్చు . ₹30 – ₹45 / Sq. ft (లేబర్ + మెటీరియల్) ఉంటుంది.బ్రాండ్, ప్రాంతం ఆధారంగా మారవచ్చు.జిప్సం ప్లాస్టర్ జీవితకాలం సరైన వాతావరణంలో 15–20 సంవత్సరాలు ఉంటుంది.
మంచి స్మూత్ ఫినిష్ వస్తుంది.
జిప్సం అనేది స్మూత్ ఫినిష్ ని ఇస్తుంది. వీటికి పుట్టీ అవసరం ఉండదు.Gypsum plaster మీద నేరుగా ప్రైమర్ వేసి పెయింట్ చేయవచ్చు.పెయింట్ చాలా బాగా అంటుతుంది. లగ్జరీ లుక్ వస్తుంది.పెయింట్ ఖర్చు తగ్గుతుంది.ఎందుకు అంటే పుట్టీ అవసరం లేకపోవడం వల్ల పెయింట్ వినియోగం ఎక్కువ వుండదు కాబట్టి.
తక్కువ క్రాక్ సమస్య ఉంటుంది.gypsum plastering
వీటిలో క్రాక్ సమస్య తక్కువ ఉంటుంది.సిమెంట్ ప్లాస్టర్‌లో ఎక్కువ హెయిర్ క్రాక్స్ వస్తాయి.జిప్సం ప్లాస్టర్‌లో క్రాక్స్ చాలా తక్కువ.సరిగ్గా అప్లై చేస్తే క్రాక్స్ రావు.నీటి వినియోగం కూడా చాల తక్కువ ఉంటుంది .సిమెంట్ ప్లాస్టరింగ్‌లో రోజూ నీరు పోయాలి(7 to 10 days ) . జిప్సంలో అలాంటిది లేదు. ఇది ఇది సేఫ్ & ఎకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణానికి అనుకలం.ఇవి తేలికయిన మెటీరియల్.భవనంపై అదనపు లోడ్ ఉండదు.ఎత్తైన భవనాలకు చాల అనుకూలంగా ఉంటుంది.
ఫైర్ రెసిస్టెంట్
జిప్సం అనేది ఫైర్ రెసిస్టెంట్. వీటికి అగ్నికి తట్టుకునే గుణం కలిగి ఉంటుంది.ఫైర్ సేఫ్టీ పెరుగుతుంది.జిప్సం అనేది థర్మల్ & సౌండ్ ఇన్సులేషన్ కలిగి ఉంటుంది అంటే గదిలో ఉష్ణోగ్రత నియంత్రణ కలిగి ఉంటుంది.బయటనుంచి శబ్దం కూడా లోపలికి అంతగా రాదు.ఉష్ణోగ్రతలను నిరోధిస్తుంది కాబట్టి బయటి కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువే ఉంటుంది.
Gypsum Plastering లోపాలు (Disadvantages)
తేమ ఉన్న ప్రదేశాలకు పనికిరాదు.అందుకే బాత్రూమ్….. టాయిలెట్…. బాల్కనీ…. బయట గోడలు….కిచెన్ వాష్ ఏరియా లలో ఈ ప్లాస్టరింగ్ వాడకూడదు.బయట గోడలకు సిమెంట్ ప్లాస్టర్ మాత్రమే మంచిది. నీటితో కరిగే స్వభావం ఎక్కువ కాబట్టి ఎక్కడ లీకేజ్ ఉంటే అక్కడ సమస్య ఉంటుంది.
ఎక్కడ Gypsum Plastering వాడాలి?
బెడ్రూమ్…..హాల్….లివింగ్ రూమ్….ఆఫీస్….షోరూమ్…. ఫాల్స్ సీలింగ్ లో వాడుకోవచ్చు.సమయాన్ని, ఖర్చును ఆదా చేస్తూ అద్భుతమైన ఫినిష్ కావాలంటే Gypsum Plastering అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పికోవచ్చు.సరైన ప్రదేశంలో వాడితే, జిప్సం ప్లాస్టర్ మీ ఇంటికి లగ్జరీ లుక్ + దీర్ఘకాలిక బలం ఇస్తుంది.(తేమ ఉన్న ప్రదేశాల్లో …. బయట గోడలకు కాకుండ).
జిప్సం కాంక్రేటుతో ప్లాస్టరింగ్ ప్రయోజనాలు :
*సిమెంట్ ప్లాస్టీరింగుకు 15 రోజులు పడితే జిప్సుంతో వారం రోజుల్లో చేయవచ్చు.
*జిప్సం తో చేస్తే క్యూరింగ్ అవసరం లేదు.
*సిమెంటుతో ఎక్కువ మందం చేయలేము,పగుళ్లు వస్తాయ్,పైగా రెండు సార్లు చేయాల్సి ఉంటుంది.మొదటిగా దొడ్డి ఇసుకతో తరువాత సన్న ఇసుకతో చేస్తారు.
*అదే జిప్సం తో ఒకేసారి ప్లాస్టరింగ్ చేసికోవచ్చు.
*సిమెంట్ ఇటుకులైతే 8-12 mm మందం,అదే మట్టి ఇటుకులకు 12-15mm మందం వరకు చేసికోవచ్చు.
*25 కిలోల బస్తా 20 చదరపు అడుగులకు సరిపోతుంది.
*ఉష్ణోగ్రతలను నిరోధిస్తుంది కాబట్టి బయటి కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువే ఉంటుంది.
*ఇంటిలోపల చూడడానికి చాల విశాలంగా అందంగా కన్పిస్తుంది.
*సిమెంట్ ప్లాస్టరింగ్ వలె గట్టిదనం ఎక్కువే.
*ఇటుకులకు ఒకసారి పడితే వదలదు.ఊడిపోవడం,పగుళ్లు,వంటి సమస్యలు రావు.
*జిప్సం తయారీకి కావలిసిన కాల్షియం సల్పేట్ ను ఇరాన్ , ఒమన్ వంటి దేశాలనుంచి దిగుమతి చేసికుంటారు.
*ప్రస్తుతం బిహార్ , ఒడిశా కార్మికులు ఈ పనిచేస్తున్నారు..
*కొన్ని సంస్థలు ఇప్పటికే గృహ , వాణిజ్య నిర్మాణాల్లో జిప్సం ప్లాస్టరింగ్ ఉపయోగిస్తున్నారు .
*ప్రపంచ వ్యాప్తంగా జిప్సం concrete మార్కెట్ వార్షికంగా ఎనిమిది శాతం చప్పున అభిరుద్ది చెందుతుంది అని గణాంకాలు చెప్తున్నాయి.
సిమెంట్ వాల్ ప్లాస్టరింగ్ అంటే ఏమిటి?
Cement Plastering అంటే సిమెంట్, ఇసుక, నీరు కలిపి తయారుచేసే మిశ్రమాన్ని (మోర్టార్) గోడ కి వేస్తారు.అలా గోడకి ఆ మిశ్రమాన్ని కొట్టి గోడని స్మూత్‌గా చేస్తారు. దీనివల్ల గోడలు సున్నితముగా,స్మూత్ గా,దృడంగా, సమానంగా ఉంటాయి. ప్లాస్టరింగ్ వల్ల వాతావరణ ప్రభావాల నుండి రక్షణ పొందవచ్చు. క్రాక్‌లను నివారించవచ్చు.పెయింటింగ్ చేసేటప్పుడు మంచి ఫినిషింగ్ వస్తుంది. గోడల యొక్క జీవితకాలాన్ని పెంచుకోవచ్చు.సిమెంట్ ప్లాస్టరింగ్ ద్వారా గోడలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. మంచి ప్లాస్టరింగ్ గనక చేస్తే అతి చిన్న చిన్న అసమానతలు కూడా కనిపించవు.
సిమెంట్ ప్లాస్టరింగ్ ప్రయోజనాలు:
గోడలకు బలం పెరుగుతుంది.క్రాక్స్ అనేవి రావు.పెయింటింగ్‌కు స్మూత్ ఫినిష్ ఇస్తుంది. భవనం ఎక్కువకాలం నిలుస్తుంది.ఇంటీరియర్ గోడలు అందంగా కనిపిస్తాయి. బయటి గోడల ఆయుష్షు పెరుగుతుంది.వర్షం పడిన లీకేజీ అనేది ఉండదు.
ప్లాస్టరింగ్‌కు ముందుగా చేయాల్సిన పనులు:
గోడలు స్మూత్‌గా రావాలంటే,లెవెలింగ్ మార్కింగ్ చేయాలి, ఆ తరువాత లెవెల్ ప్యాడ్లు పెట్టాలి.ఇటుక గోడ –బీమ్ సంధి(మధ్యలో) ప్రాంతాల్లో మెష్ బిగించడం మంచిది (అవసరమైతే).పాత గోడలకు క్రాక్స్ ఉన్నట్లు అయితే Welded mesh ఉపయోగించడం మంచిది.ప్లాస్టరింగ్‌కు ముందుగా గోడను శుభ్రంచేయాలి(దుమ్ము దూళి లేకుండా ). ఆ తరువాత గోడను నీటితో 2–3 గంటల పాటు బాగా తడపాలి. అప్పుడు ఆ మిశ్రమాన్ని గోడకు బాగా అంటుకునేలా చేస్తుంది.
క్యూయరింగ్ (Curing):
ప్లాస్టరింగ్ తర్వాత మినిమం 7 to 10 రోజులు క్యూయరింగ్ తప్పనిసరి.క్యూయరింగ్ వల్ల క్రాక్‌లు రాకుండా గోడలు కి బలం పెరుగుతుంది.సిమెంట్ గోడలకి బాగాపడుతుంది.వర్షకాలంలో ప్లాస్టరింగ్ చేయకూడదు.మీకు సిమెంట్ ప్లాస్టరింగ్ కోసం డిటైల్డ్ కావాలంటేhttps://impresshomedesigners.com/cement-wall-plastering%e0%b0%b8%e0%b0%bf%e0%b0%ae%e0%b1%86%e0%b0%82%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b0%b0/?preview_id=2821&preview_nonce=dc72a36631&post_format=standard&_thumbnail_id=2875&preview=true
POP Ceiling లో ఉన్న లోపాలు:
gypsum బోర్డ్ సీలింగ్‌తో పోలిస్తే POP వర్క్ కొంచెం నెమ్మదిగా జరుగుతుంది.Experienced Technician లేకపోతే ఫినిషింగ్ బాగా రాదు.చాలా తడి ఉన్న గదుల్లో POP సీలింగ్ కొద్దిమేర బలహీనమవుతుంది.సంవత్సరానికి ఒకసారి Paint చెయ్యడం మంచిది.సీలింగ్ తడి కాకుండా చూసుకోవాలి.లైట్లు పనిచేయకపోతే వెంటనే మార్చాలి. వాటర్ తగలకూడదు వాటర్ తగిలితే pop షీట్స్ పోతాయ్. వర్క్ అనేది slow గా అవుతుంటాది. చెదలు పట్టే ఛాన్సెస్ ఎక్కువ. ఓన్లీ ఇన్నర్ లోనే మాత్రమే వాడుతారు. వీటి లైఫ్ తక్కువ ఉంటుంది(5 to 8 years). వర్క్ చేసినప్పుడు రూమ్ లో దుమ్ము దూళి ఎక్కువ పడుతుంది. క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ.వీటి మెటీరియల్ క్రింద పడి ప్లేస్ కరాబ్ అవుతుంది.చాల జాగ్రత్త పాటించాలి .
మీ ఇంటికి సరిపోయే డిజైన్ ఎలా ఎంచుకోవాలి?
హాల్: లగ్జరీ, LED Cove, చాండెలియర్ డిజైన్ ఎంచుకోవాలి .
బెడ్రూమ్: సింపుల్, కామ్ షేడ్స్, ఇండైరెక్ట్ లైటింగ్ అయితే బాగుంటుంది .
కిచెన్: సూట్‌గా, Plain Ceiling అయితే చాల బాగుంటుంది .
కిడ్స్ రూమ్: ఫన్ ప్యాటర్న్స్ తో నింపేయాలి
షాప్స్ / ఆఫీస్: Bright, Minimal POP అయితే బెటర్ అది మీ అలోసన బట్టి ఉంటుంది .
మా construction company సర్వీసెస్ :
*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును . మా phone number ;7989312152 , 9989456907.

