tiles vs granite vs marble! Tiles vs Granite vs Marble – ఏది మంచిది? ఏది ఎక్కడ వాడాలి? వాటి price?

tiles vs granite vs marble! Tiles vs Granite vs Marble – ఏది మంచిది? ఏది ఎక్కడ వాడాలి? వాటి price?

tiles vs granite vs marble! Tiles vs Granite vs Marble – ఏది మంచిది? ఏది ఎక్కడ వాడాలి? వాటి price?
tiles vs granite vs marble! Tiles vs Granite vs Marble – ఏది మంచిది? ఏది ఎక్కడ వాడాలి? వాటి price?

tiles vs granite vs marble: 

tiles vs granite vs marble: ఇల్లు అంటేనే ఒక -పండగ. మనం ఎన్నో కలలు కని ఇల్లు కట్టుకుంటాము. మన ఇల్లు చాల బాగుండాలి అని అనుకుంటూఉంటాం.వీటికోసం చాల డబ్బులు ఖర్చు చేస్తూఉంటాం.ఇందులో ముక్యంగా  ఇంటి అందానికి ఫ్లోరింగ్ చాలా ముఖ్యం.ఇల్లు కట్టడం లోనైనా, రినోవేషన్ లోనైనా ఫ్లోరింగ్ అనేది చాల ఇంపార్టెంట్. ఇది ఇంటి లుక్‌ను, విలువను, హైజిన్‌ను, దారుఢ్యాన్ని నిర్ణయించేది. ఈ సందర్భంలో “టైల్స్”, “గ్రానైట్”, “మార్బుల్” అనే మూడు ప్రధాన ప్లోరింగ్ మెటీరియల్స్  ఎక్కువగా వాడుతారు. టైల్స్ తక్కువ ఖర్చుతో అందంగా ఉంటాయి, గ్రానైట్ బలంగా మరియు దీర్ఘకాలం నిలుస్తుంది, మార్బుల్ క్లాసిక్ లగ్జరీ లుక్కుకు ప్రసిద్ధి. మీ బడ్జెట్, ఆడ్జెస్ట్‌మెంట్ అవసరాన్ని బట్టి సరైనది ఎంచుకోవడం చాలా ముఖ్యం.ఈ మూడు మేటరియల్స్ వేరే వేరే లక్షణాలు,లుక్, ధర,మెయింటెనెన్స్‌ను కలిగి ఉంటాయి.

tiles యొక్క ఉపయోగాలు:

టైల్స్ అనేవి ఫ్యాక్టరీలో మనుషుల చేతి తయారీ చేసే (man-made) మెటీరియల్. ఇవి ప్రధానంగా రెండు రకాలుంటాయి. ఒకటి Ceramic Tiles ,రెండవది Vitrified Tiles (GVT/PGVT డిజైన్ టైల్స్).కలర్, ప్యాటర్న్ లలో డిజైన్స్ చాలా వేరైటీతో వస్తాయి (మార్బుల్ లాంటి డిజైన్స్ కూడా ఉంటాయి).వేరే వాటితో పోలిస్తే తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి తక్కువ బడ్జెట్ ఉన్నవారికి బెస్ట్.సులభంగా ఇన్స్టాల్ అవుతాయి. ఫిక్సింగ్ కూడా త్వరగా పూర్తవుతుంది. 2×2, 4×2, 4×4 ,4*6, 4*8….వంటి పెద్ద సైజులు అందుబాటులో ఉంటాయి.ఈ టైల్స్ గృహం, షాపులు, ఆఫీస్‌లకు బాగా సూట్ అవుతాయి.Maintenance-free . నేచురల్ మెటీరియల్ కాదు (నేచురల్ ఫీలింగ్ తక్కువ).గ్రానైట్/మార్బుల్ తో పోలిస్తే ప్రీమియం రిచ్ లుక్ రాదు.తక్కువ బడ్జెట్లో మోడరన్ లుక్ కావాలంటే టైల్స్ బెట్టర్.వాటితో పోలిస్తే వీటి లైఫ్ తక్కువ. శుభ్రం చేయడం ఈజీ.Bedrooms, Living rooms‌కి బెస్ట్.పెద్దగా maintenance అవసరం లేదు చాల తక్కువ.Budget-friendly Home కి Tiles Best Choice . జాయింట్స్‌లో dirt చేరితే grout replacement చేయాలి.వీటి లైఫ్ టైం 10–15 ఇయర్స్ ఉంటుంది.ఇందులో మాటీఫినిష్ , గ్లాసి ఫినిష్ రెండు వస్తాయ్.వాడికొలది ఫినిష్ పాతబడికొలది ఫినిష్ పోతుంది ఆ తరువాత టైల్స్ మార్చుకోవాలి.

Granite యొక్క ఉపయోగాలు :

గ్రానైట్ అనేది భూమి లోపల సహజంగా ఏర్పడే శిలరాశి (natural stone).అందుకే ఇది బలంగా, హీట్ రెసిస్టెంట్, స్క్రాచ్ ప్రూఫ్ గా ఉంటుంది.చాలా దృఢమైన రాయి.చాలా బలంగా ఉంటుంది (20–40 years life ఉంటుంది).ఖర్చు టైల్స్ కంటే ఎక్కువ.కలర్ & డిజైన్స్ టైల్స్ లో ఉన్నట్లు ఇందులో ఉండవు.స్క్రాచెస్ చాలా తక్కువగా కనిపిస్తాయి. వీటికి ఎప్పటికి అప్పుడు పాలిష్ చేయవచ్చు(కొత్త లుక్ కోసం), గ్లాసీ ఫినిష్ లుక్ ఉంటుంది. ఈ మెటీరియల్ Kitchen కౌంటర్ టాపులకు, బాత్రూమ్, స్టెయిర్‌కేస్, హాల్ ఫ్లోరింగ్‌కి ఎక్కువగా వాడతారు.వీటికి ఇన్స్టాల్ చేసేటప్పుడు మంచి సామర్థ్యం కలిగిన పనివారు కావాలి (cutting & fitting లో).గ్రానైట్ అనేది Heat-resistant, scratch-resistant ,ఇది Kitchen counters, stairs, bathrooms‌కి బెస్ట్,ధర టైల్స్ కంటే ఎక్కువ కానీ life ఎక్కువ.ఇది నేచురల్ స్టోన్ చాలా దృఢం(Strong + Long లైఫ్).Normal cleaning enough .పాలిష్‌ను 5–7 ఏళ్లకు ఒకసారి రిఫ్రెష్ చేస్తే కొత్తలా మారుతుంది.వీటి లైఫ్ టైం 20–40 ఇయర్స్.

Marbles యొక్క ఉపయోగాలు:tiles vs granite vs marble

ప్రత్యేకంగా ఇటాలియన్ మార్బుల్ అంటే రిచ్ లుక్, రాయల్ ఫినిష్, హోటల్-లెవెల్ ఇంటీరియర్ లుక్లో కనిపిస్తుంటుంది. మార్బల్స్అంటేనే రాయల్ లుక్ (Luxury finish).Premium Homes లో ఎక్కువగా వాడతారు.చాలా మెయింటెనెన్స్ కావాలి.ఖరీదు ఎక్కువ (ఇటాలియన్ మార్బుల్ చాలా ఖరీదైనది).మరకలు పడితే తీసేయడం కష్టం.వీటికి ఎప్పటికి అప్పుడు పాలిష్ చేయవచ్చు(కొత్త లుక్ కోసం).వీటికి ఇన్స్టాల్ చేసేటప్పుడు మంచి సామర్థ్యం కలిగిన పనివారు కావాలి (cutting & fitting లో).నేచురల్ స్టోన్(Soft & Premium లుక్).Royal finish ఇస్తుంది.Halls, luxury interiors‌కే బాగుంటుంది.Maintenance ఎక్కువ, stains easily (మరకలు) పడతాయి.Italian marble అయితే చాలా ఖరీదు.వీటి లైఫ్ టైం 15–25 ఇయర్స్.Regular polishing అవసరం.దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి.సీషన్ కి తగ్గట్టు వీటియొక్క temperature మారిపోతుంది. 

Common Mistakes People Make in Flooring:

Kitchenలో Marble వేసుకోవడం చేయరాదు. Stairs లో Tiles వాడకూడదు.Bathroomలో వరండాలో Glossy టైల్స్ వాడకూడదు(మాటీఫినిష్ లేదా ఏంటిస్కిడ్ టైల్స్ వాడాలి).“ఇవి ఎప్పుడూ చేయొద్దు!”.అలాగే కిచెన్లో Gloss టైల్స్ కానీ  White టైల్స్ వేయకూడదు, Marble అనేవి stove దగ్గర వేయకూడదు.

Room-by-Room Best Material :

Hall → Marble
Bedroom → Tiles
Kitchen → Granite
Bathroom → Anti-slip tiles.

మెటీరియల్/లేబర్ చార్జెస్ (2025 Base Market Rates):

Material Price Range per sq. ft
Tiles ₹45 – ₹150
Granite ₹90 – ₹300
Marble (Indian) ₹120 – ₹350
Italian Marble ₹350 – ₹1500+
(గమినిక : ప్రాంతం బట్టి & బ్రాండ్‌ బట్టి ధరలు మారుతాయి.)https://amzn.to/4a7XjqX

విట్రీపైడ్ టైల్స్ ప్రాముఖ్యత :

సొంతఇంటి కలను సాకారం చేసుకొనేందుకు ఎంతగా ఆసక్తి చూపుతామో….ఆ ఇంటిని మన అభిరుచులకు అనుగుణంగా మలుసుకోడానికి అంతే ప్రాధాన్యం ఇవ్వాలి.ఫ్లోరింగ్ విషయానికివస్తే గతంలో కేవలము సిమెంట్ ఫ్లోరింగ్ మాత్రమే చేసేవారు.ఆ తరువాత చాన్నాళ్లు పాటు మొజాయిక్ ఫ్లోరింగ్ కొత్తగా ఉండేది.క్లాస్ లుక్ కోసం పాలరాయి,మార్బల్స్ వాడేవారు.ప్రస్తుతము మార్కెట్లో రక రకాల టైల్స్ దొరుకుతున్నాయి. వాటిలో ఒకటి “విట్రీ పైడ్ టైల్స్” …ఇవి మన్నికతో పాటు ఇంటికి ప్రత్యేక శోభను తీసుకువస్తున్నాయి.ఇటీవల కాలములో మార్బల్స్ కి ప్రత్యామ్నాయంగా వీటినే ఎక్కువుగా వాడుతున్నారు.ఇందులో డిజిటల్,designer ,హెచ్ డి, ఇన్నోవేటివ్ రకాలు కొత్తగా ఆకట్టుకుంటున్నాయి. వీటిపై మార్బల్స్ మాదిరి మరకలు పడకపోవడం,రంగు మారకపోవడం వంటివి ఉంటాయి.తేమను నోరోదించడం వలన బాక్టీరియా చేరదు.వీటి నిర్వహణ కూడా చాల సులువు.

ఇంటికి ఫ్లోరింగ్ వేయిస్తున్నారా :

ఇంటిలో అడుగుపెట్టగానే ఇల్లు అందంగా కనిపించాలని చాలామంది ఫ్లోరింగ్ పైన ఎంతో కర్షు చేస్తారు.అయితే ఫ్లోరింగ్ కి మార్బల్స్ వాడడం కంటే టైల్స్ వాడడమే ఉపయోగకరంగా ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు.కళ్ళు చెదిరే అందం…సులభంగా శుభ్రం చేకుకోగలగడం మార్బల్స్ ప్రత్యేకత.కానీ కొన్నిసార్లు మార్బల్స్ మనకు కావలిసిన పరిమాణంలో దొరకకపోవచ్చు.ఒక్కోసారి ఇంటి విస్తరణానిబట్టి అవసరమైతే అక్కడున్న లాట్ మొత్తం తీసికోవాలిసి వస్తుంది.తరువాత మరికొంత అవసరం పడితే అదే డిజైన్లో ధొరకడం దాదాపు అసాధ్యమే.అందుకే కొన్ని పెద్ద పెద్ద ఇళ్లలో గది గదికొ రకంగా ప్లోరింగ్స్ కనిపిస్తూవుంటాయ్.అందుకే టైల్స్ మంచి ఎంపిక.వీటిని మెషిన్ పై తయారు చేస్తారు కాబట్టి కావలసినన్ని అందుబాటులో ఉంటాయి.కావలిసిన సైజు లో దొరికితాయ్.కార్యాలయాలు,షాపింగ్ మాల్,వంటివాటికి పెద్ద షీట్స్ ఉపయోగిస్తారు.ఇంటిలో అయితే ఓ మోస్తరు పరిమాణంలో ఉన్న వాటిని ఎంపిక చేసికోవచ్చు.

టైల్స్ ఇలా క్లీన్ చేయాలి :tiles vs granite vs marble

ఇల్లు నిర్మించుకున్న …రీ మోడెల్ చేయాలికున్న కీలకమైన అంశాలలో టైల్స్ ఎంపిక ఒకటి.మీరు ఎంచుకున్న టైల్స్ ఇంటి స్వరూపాన్ని మార్చివేసి సరికొత్త అనుభూతిని ఇస్తాయి.అయితే కొన్ని రోజుల తరువాత టైల్స్ మధ్య మురికి చేరుతుంది.ఎంత శుభ్రం చేసిన వదలదు.దీనికోసం కొన్ని టిప్స్ పాటించాలి అవి.టైల్స్ క్లీనుగా ఉంచేందుకు రోజు వ్యాక్యూమ్ చేయాలి.టైల్స్ మధ్య మురికిని క్లీన్ చేయడంలో వెనిగర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.అందుకోసం వెనిగర్, గోరువెచ్చని నీటిని మిక్స్ చేసికోవాలి.దీనిని స్ప్రే బాటిల్ లో పోసి టైల్స్ మధ్య మురికి పేరుకున్న చోట స్ప్రే చేయాలి. ఐదునిమాసాలు తరువాత స్క్రబ్ లేదా బ్రష్ తో రుద్దితే మురికి వదిలిపోయి ప్లోర్ శుభ్రాంగ అవుతుంది.నిమ్మరసం , బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సయిడ్ వంటివి కూడా టైల్స్ మధ్య రాసి శుభ్రం చేస్తే క్లీన్ చేయవచ్చు.

ఏ సీలింగ్ బెటర్ అనేది తెలిసికోవాలి అంటే ఈ లింక్ పైన క్లిక్https://impresshomedesigners.com/pop-ceiling-design-pop-ceiling-design-%e0%b0%8e%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%95%e0%b1%81-%e0%b0%9a%e0%b1%87%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%af%e0%b1%8b/?preview_id=2880&preview_nonce=7617852ff5&post_format=standard&_thumbnail_id=2912&preview=true

మా construction company సర్వీసెస్ :

*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును . మా phone number  ;7989312152 , 9989456907.

best construction services in vizag
best construction services in vizag? best interior design