Home loan vs Mortgage loan! హోమ్ లోన్ మరియు మార్ట్గేజ్ లోన్?ఏది బెటర్?

Home loan vs Mortgage loan! హోమ్ లోన్ మరియు మార్ట్గేజ్ లోన్?ఏది బెటర్?Are you looking for house!

Home loan vs Mortgage loan:

Home loan vs Mortgage loan:మన జీవితం లో ఇల్లు అనేది ఒక డ్రీం అని చెప్పికోవచ్చు. ఆ కలను నిజం చేసుకోవడానికి చాలా మంది బ్యాంకులు, ఆర్థిక సంస్థల చుట్టూ తిరిగుతుంటారు.ఆలా వారి సహాయాన్ని తీసుకుంటారు. అలాగే వ్యాపారం, విద్య, వైద్యం లేదా వ్యక్తిగత అవసరాల కోసం కూడా రుణాలు తీసుకుంటారు. ఈ సందర్భంలో ఎక్కువగా వినిపించే రెండు రకాల రుణాలు హోమ్ లోన్ మరియు మార్ట్గేజ్ లోన్. ఈ రెండు రుణాలు వినడానికి ఒకేలా అనిపించినా, వాటి ప్రయోజనం, విధానం, వడ్డీ రేట్లు, తిరిగి చెల్లించే విధానం మొదలైన వాటిలో చాలా తేడాలు కనిపిస్తాయి. ఇప్పుడు మనంహోమ్ లోన్ మరియు మార్ట్గేజ్ లోన్ మధ్య ఉన్న తేడాలను క్షున్నంగా తెలుసుకుందాం.

mortgage loan interest rate:

ఇ రోజుల్లో ఇంటి అవసరాలు, వ్యాపార విస్తరణ, పిల్లల విద్య, మెడికల్ ఖర్చులు లేదా ఇతర పెద్ద అవసరాల కోసం చాలా మంది మోర్ట్గాజ్ లోన్ (Mortgage Loan) తీసుకుంటున్నారు. ఒక ప్రాపర్టీని (ఇల్లు, ప్లాట్, ఫ్లాట్, కమర్షియల్ ప్రాపర్టీ) బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థకు తాకట్టు పెట్టి తీసుకునే లోన్‌ను మోర్ట్గాజ్ లోన్ అంటారు. ఈ లోన్‌లో అత్యంత కీలకమైన అంశం మోర్ట్గాజ్ లోన్ వడ్డీ రేటు. వడ్డీ రేటు ఎంత తక్కువగా ఉంటే, అంత తక్కువ EMI చెల్లించాల్సి ఉంటుంది.మోర్ట్గాజ్ లోన్ వడ్డీ రేటు అనేది మీరు బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్ మొత్తంపై ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన అదనపు చార్జ్. ఇది శాతం (%) రూపంలో ఉంటుంది.
ఉదాహరణ:
మీరు ₹30 లక్షల మోర్ట్గాజ్ లోన్ తీసుకుని, వడ్డీ రేటు 9% అయితే –ప్రతి సంవత్సరం మీరు ఆ మొత్తంపై 9% వడ్డీ చెల్లించాలి (EMI రూపంలో).మోర్ట్గాజ్ లోన్ వడ్డీ రేట్లు సాధారణంగా 8.5% నుండి 13% మధ్య ఉంటాయి.బ్యాంక్, NBFC, మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం వంటి అంశాలపై ఇది మారుతుంది.

మోర్ట్గాజ్ లోన్:

Home loan vs Mortgage loan

ఏదయినా ఆస్తిని తనఖా పెట్టి రుణం తీసుకుంటే దాన్ని mortgage లోన్ అంటారు.ఇలా మంజూరు అయినా సొమ్మును దేనికయినా వినియోగించుకోవచ్చు.రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైతే…తనకా పెట్టిన ఆస్తిని విక్రయించి రుణాన్ని రికవరీ చేసికుంటారు.మీరు మీ ఇంటి గ్రోసరీ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.https://amzn.to/4qeCsaC

మోర్ట్గాజ్ లోన్ ఫీచర్స్mortgage loan interest rate:

మోర్ట్గాజ్ లోన్ వినియోగంపై ఎలాంటి పరిమితి ఉండదు.కావాలంటే రుణగ్రహీత తన వ్యక్తిగత అవసరాలకు కూడా సొమ్మును వాడుకోవచ్చు.హోంలోన్ తో పోలిస్తే మోర్ట్గాజ్ లో మంజూరయ్యే రుణం తక్కువుగా ఉంటుంది.ఆస్తి విలువలో 60-70 శాతం మాత్రమే రుణ రూపంలో పొందవచ్చు.హోంలోన్ తో పోలిస్తే మోర్ట్గాజ్ లోన్ పై 1-3 శాతం వడ్డీరేటు ఎక్కువుగా ఉంటుంది.మోర్ట్గాజ్ లోన్ లో ప్రాసెసింగ్ రుసుము 1.5 శాతం వరకు ఉంటుంది.ఈ లోన్ తిరిగి చెల్లించడానికి గరిష్టంగా 15 ఏళ్ళు కాలపరిమితి మాత్రమే ఉంటుంది.ఎలాంటి పేపర్ వర్క్ లేకుండానే ఉన్న లోన్ పై టాప్ -అప్ లోన్ తీసికొనే వెసులుబాటు ఇందులో ఉంటుంది.

ఇల్లు తాకట్టు పెటుతున్నారా?జాగ్రత్త?

మధ్యతరగతి ప్రజలు అత్యవసర పరిస్థితిలు వచ్చినప్పుడు అప్పులు కోసం బ్యాంకులు చుట్టూ తిరిగితుంటారు.అయితే వీటిపై అవగాహనా లేకపోవడంతో ఫైనాన్స్ consultancy లు,దళారులను ఆశ్రయిస్తుంటారు.వీరి లోపాలు తెలిసికొని కొందరు మోసాలు చేస్తుంటారు.ప్రస్తుతం కొందరు ముఠాగా ఏర్పడి అమాయకాలనుంచి ఆస్తి పత్రాలు తీసికొని వారి పేరుతో సేల్ డీడ్,పవర్ అఫ్ అటార్నీ వంటివి చేయించుకుంటున్నారు.బాదితులకు కాస్త డబ్బు ఇచ్చి,ఆ పత్రాలతో ఆ ముఠాలు బ్యాంకులు నుంచి రుణాలు తీసికుంటున్నాయి.కానీ వారు సకాలంలో వాయిదాలు చెల్లించకపోవడంతో ఇంటికి వేలం వేస్తున్నట్లు నోటీసులు పంపిస్తారు,అప్పుడు బాదితులకు ఈ విషయం తెలిసి లబోదిబో మంటారు.కావున స్థిరాస్తి యజమానులు ఎవరికియైన పత్రాలు రాసిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాల వుంది.

మోసగాళ్లు ఏం చేస్తున్నారుఅంటే:

ఒక వ్యక్తికి డబ్బుఅవసరమైనప్పుడు.డబ్బు దొరకని పరిస్థిలో మోసకారి ఏజెంట్స్ సీన్లోకి వచేస్తుంటారు.వీరు కన్సెల్టెన్సీ వాళ్ళదగ్గరికి ఆ వ్యక్తిని తీసికెళ్తారు.ఇంటికి తనకపెటితే,అవసరమైన డబ్బు ఇస్తామని చెప్పి,ఇంటిని తమ పేరిట “పవర్ ఆఫ్ అటార్ని” చేయవలిసిందిగా అడుగుతారు.డబ్బులు అవసరం ఉండడంతో ఇంటియజమానులు అందుకు అంగీకరిస్తారు. ఒకసారి పవర్ ఆఫ్ అటార్నీ చేతికి వచ్చాక,వేరేవ్యక్తికి ఆ ఇంటిని అమ్మేస్తారు.సాధారణంగా ఆ ఇంటిని కొనుగోలు చేసేది ఆ కన్సెల్టాన్సీ లో పనిచేసే వారే ఉంటారు.ఇప్పుడు ఆ ఇంటిని కొంటున్నట్లు నాటకం ఆడేవారు బ్యాంకుకి సంప్రదించి లోన్ కి ప్రయత్నిస్తాడు.అన్ని పత్రాలు సమర్పించడం వలన బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది.ఒక వేల ఇందులో ఏవైనా ఇబ్బందిలు వుంటే ఆ ఇంటిని తనకా(mortgage) పెట్టి లోన్ తీసికుంటారు.ఇంటి యజమానికి కొంత డబ్బు ఇచ్చి మిగిలిన వారు సర్దుకుంటారు.రెండు , మూడు నెలలు వాయిదాలు కట్టి ఆ తరువాత ముఖం చాటేస్తారు.దీనితో బ్యాంకులు ఇంటికి నోటీసులు ఇవ్వడం.వేలం వేసేందుకు సిద్దపడతాయ్.అప్పుడే బాదితులు తాము మోసపోయినట్లు గ్రహిస్తారు.

మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి:

వ్యక్తిగత,తనఖా రుణాలు కోసం ప్రయత్నించేవారు ముందుగా బ్యాంకులను సంప్రదించాలి.అక్కడ పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసికున్నాక నిర్ణయం తీసికోవాలి.సిబిల్ స్కోర్,చెల్లింపులు చరిత్ర సరిగ్గా లేకపోతె ఏజెంట్స్ చెప్పిన మాటలు నమ్మవద్దు. తక్కువ సమయంలో అప్పు లబిస్తుంది అనే ఉద్దేశంతో అనధికార కన్సెల్టాన్సీ ల వద్దకు వెళ్ళవద్దు. రుణగ్రహీతలకు సహాయం చేసేందుకు బ్యాంకులు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుంటాయి.వారు బ్యాంకు కోసమే పనిచేస్తుంటారు. వీరికి ప్రత్యేకంగా consultancies అంటు వుండవు.రుణం అవసరం ఉన్నప్పుడు ఇలాంటివారిని సంప్రదించాలి.లేదా బ్యాంకుకి వెళ్లాలి.మీ ఆస్తిని ఎట్టిపరిస్థిలోనూ ఎవరకి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వకూడదు.కేవలం తనకకు ఉంచినట్లే పత్రాలు ఇవ్వాలి.బ్యాంకులు తనకా రుణం ఇస్తాయి.ఒకవేళ అదిసాధ్యం కాకపోతే “రివెర్స్ mortgage లోన్”తీసికోవచ్చు.ఒకవేళ మోసపోయాం అనుకుంటే వెంటనే స్థానిక పోలీసులకు పిర్యాదు చేయాలి.

టాపాప్ లోన్ ఎప్పుడు తీసికోవాలి:Home loan vs Mortgage loan:

ఇల్లు కొనాలంటే 90 శాతం మంది రుణాలపై ఆధారపడతారు.అయితే గృహాలకి రుణాలు ఇచ్చే బ్యాంకులు టపాప్ లోన్స్ కూడ మంజూరు చేస్తాయ్.ఇంటిని విస్తిరించడంతో పాటు,ఇంటిలో ఫర్నిచర్ కొనుగోలు,పిల్లలకు చదువులకు సంబంధించి ఫీజలు వంటి వాటికీ టాప్-అప్ లోన్స్ వాడుకోవచ్చు.ఒకేసారి డబ్బు అవసరం లేదు అనుకుంటే.టాప్-అప్ లోన్స్ లో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.దీనికి గృహరుణంతో పోలిస్తే కాస్త అధిక వడ్డీ ఉంటుంది.దీర్ఘకాలం వరకు అవసరమైనప్పుడే డబ్బు తీసికొనే వీలుంటింది,ఉపయోగించుకున్న మొత్తానికి వడ్డీ విధిస్తారు.కాబట్టి పెద్దగా భారం ఉండదు.

top-up loan ఇలా తీసికుంటే మేలు :

ఇల్లుకొనలంటే 90 శాతం మంది రుణాలపైనే ఆధారపడతారు.అయితే గృహాలకు రుణాలు ఇచ్చే బ్యాంకులు top-up లోన్స్ కూడా మంజూరు చేస్తుంటాయి.ఈ top-up లోన్ తీసికొనేముందు ప్రణాళికతో వ్యవహరించాలి.అప్పుడే లాభం చేకూరుతుంది. ఈ లోన్ తీసికొని,దాన్ని ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు వాడినప్పుడు ఆదాయపు పన్ను మినాయింపు లభిస్తుంది.కాబట్టి top-up రుణం తీసికున్నపుడు ఆ మొత్తాన్ని ఇంటి కొనుగోలు లేదా నిర్మాణానికి ఉపయోగించినట్లు రుజువు చేయాలి.దీనికి సంబందించిన రసీదులు,ఇతర పత్రాలు సమర్పించాలి.గృహరుణ వ్యవధి 20 ఏళ్లుంటే …top-up రుణనికి అదే 20 ఏళ్ళు ఉంటుంది.దీనివల్ల దీర్ఘకాల అప్పుతీర్సే వెసులుబాటు ఉంటుంది.మీకు అప్పుడు అప్పుడు డబ్బులు కావాల్సివస్తే top-up లో వుండే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యన్ని ఉపయోగించుకోవచ్చు.కొన్ని బ్యాంకులు గృహరుణం top-up పైన ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.దీని వడ్డీ గృహరుణం కన్న కాస్త ఎక్కువుగా,వ్యక్తిగత రుణంకన్నా తక్కువుగా ఉంటుంది.topup రుణం ఎంత ఇవ్వాలన్నది ఆదాయం,గృహ రుణం మొత్తం,తనకా పెట్టిన ఆస్తి,మార్కెట్ విలువ బట్టి ఆధారపడుతుంది.   

ఓపెన్ ఎండెడ్ మోర్ట్గాజ్ లోన్:Home loan vs Mortgage loan:

ఓపెన్ ఎండెడ్ మోర్ట్గాజ్ లోన్ ఆప్షన్ ఎంపిక చేసుకున్న రుణ గ్రహీత …ఒక రుణం పొందిన కొన్ని రోజుల తరువాత మరింత రుణం కావలని బ్యాంకును కోరవచ్చు.బ్యాంకు కూడా అందుకు సమ్మతిస్తుంది.సాధారణంగా ఇల్లు వంటి స్థిరాస్తిలు కొనుగోలు విషయంలో ఈ విధానం పనిచేస్తుంది.ఇల్లు కొనుగోలుకు మంజూరు చేసిన మొత్తం రుణం ఒకేసారి తీసికోకుండా మొదట అవసరం ఉన్నంత వరకు రుణం తీసికొని, భవిష్యత్తులో మరింత నిధులు అవసరం వున్నప్పుడు బ్యాంకుని సంప్రదించి అదనపు రుణం పొందడం దీని ముఖ్య ఉద్దేశం. 

open ended  మోర్ట్గాజ్ లోన్ ఉపయోగాలు:

అవసరం లేకపోయినా బ్యాంకు శాంక్షన్ చేసిన మొత్తం రుణాన్ని ఒకేసారి తీసికోవాలిసిన అవసరం ఉండదు.అలాగే అదనంగా వడ్డీ చెల్లించవలిసిన పని ఉండదు.అదే సమయంలో అవసరమైనప్పుడు వెంటనే కావాల్సినంత రుణం పొందవచ్చు.ఇందులో బ్యాంకులుకి కూడా ఎలాంటి నష్టం(రిస్క్) ఉండదు.ఎందుకంటే ఒక స్థిరాస్తి ఎలాగూ తనకాలో ఉంటుంది.పైగా దానివిలువ కొనుగోలు నాటినుంచి చూస్తే రోజులు గడుస్తున్నా కొద్దీ మరింత పెరుగుతుంది.అందుకే ముందే శాంక్షన్ చేసిన పూర్తి రుణం మొత్తాన్ని ఎన్నిదపాలుగా అయినా ఇచ్చేందుకు బ్యాంకుకు అభ్యన్తరం ఉండదు.

లోన్ చెల్లించిన డాక్యూమెంట్స్ ఇవ్వట్లేదా:

బ్యాంకులు,ఆర్థిక సంస్థలు లోన్ చెల్లించడం పూర్తి అయిన 30 రోజుల్లోగా స్థిర,చరాస్తులకు సంబంధించిన పత్రాలను రుణగ్రహీతకు తిరిగి ఇచ్చియాలని RBI (2003) కీలక ఆదేశాలు జారీచేసింది.రుణ గ్రహీతలు తమ స్థిర లేదా చరాస్తులకు సంబంధించిన పత్రాలను రుణం పూర్తిగా చెల్లించిన వెంటనే సంబందిత బ్యాంకు/సంస్థ కార్యాలయాలనుంచి తీసికోవాలి. ఒకవేళ రుణగ్రహీత అకాల మరణం పొందితే పాటించవసిన నియమ నిబంధనలు కూడా సంస్థలు పక్కాగా రూపొందించాలని RBI అదేశించింది.

RBI రూల్స్ ప్రకారం:

Home loan vs Mortgage loan

ఈ విధానాలు అన్నిటిని …సంస్థలు తమ వెబ్సైటు లో ఉంచాలని RBI తెలిపింది. ఒకవేళ 30 రోజుల్లోగా పత్రాలను ఇవ్వలేకపోతే…అందుకు గల కారణాలు తెలియజేస్తూ బ్యాంకులు కస్టమర్లకి సమాసారం ఇవ్వాలి.సరైన కారణాలు లేకుండా నిర్లక్ష్యం చేస్తే…రుణ గ్రహీతకు రోజుకు rs.5000 చప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.ఒకవేళ పత్రాలు కనపడకపోతే …వాటిని తిరిగిపొందేలా రుణగ్రహీతకు సహాయం చేయాలి.అలాగే వాటికి అయ్యే ఖర్చును బ్యాంకులు/సంస్థలు భరించాలి.దీనితో పాటు రోజుకి 5000 పరిహారం ఇవ్వాలి.

home loan process.

home loan process: ప్రతి ఒక్కరికి సొంతఇల్లు ఉండాలనేది ఒక కల.చాల మంది తమ కలలను సాకారం చేసికోవడానికి హోమ్ లోన్ ను ఆశ్రయిస్తారు.నిర్మాణము పూర్తి అయినా ఇల్లు కొనడానికి లేదా కొత్త ఇంటిని నిర్మించేందుకు మాత్రమే హోమ్ లోన్ మంజూరు చేస్తారు.రుణదాతలు ఆ ఇంటిని తనకా కింద పెట్టుకుంటారు.ఒకవేళ మనం రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైతే…ఇంటిని స్వాధీనపరుసుకొని సొమ్మును రికవరీ చేసికుంటారు. 

Home లోన్ ఫీచర్స్:

gated community flats for sale
the best flats for sale

హోంలోన్ ను ఇంటినిర్మాణం లేదా కొనుగోలుకు మాత్రమే వినియోగించాలి.ఇంటిని నిర్మాణం చేస్తున్న ప్రాంతంలో ఉన్న మార్కెట్ విలువలో 90 శాతం మొత్తాన్ని రుణము రూపంలో పొందవచ్చు.mortgage లోన్ తో పోలిస్తే హోమ్ లోన్ వడ్డీ రేటు తక్కువ.హోంలోన్ ప్రాసెసింగ్ రుసుము 0.8-1.2 శాతం మధ్యలో ఉంటుంది.దాదాపు 30 ఏళ్ల వరకు హోంలోనును తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంటుంది.

వీటిలో ఇవి మీకు తెలుసా:Home loan vs Mortgage loan:

సొంతంటి కల సాకారం చేసికోవాలని చాలామందికి ఉంటుంది.అందుకే బ్యాంకాలనుంచి రుణం తీసికొని ఆ కలను నెరవేర్చికుంటారు.అయితే లోన్ తీసుకొనే క్రమంలో…వడ్డీరేటును ఎంపిక చేసికున్నప్పుడు మనకు రెండు ఆప్షన్లు ఉంటాయి.అవే ఫిక్సడ్ రేట్,ఫ్లోటింగ్ రేట్.మరి ఈ రెండింటిలో ఏది తీసికుంటే బెటర్?వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి ఏది బాగా సెట్ అవుతుంది?ఇప్పుడు తెలిసికుందాం.

ఫిక్సడ్ రేట్స్:ఇంటికి సంబంధించి గ్రోసరీ కోసం https://amzn.to/4rczbbU

పేరులో ఉన్నట్లే ఈ ఎంపిక చేసికుంటే…వడ్డీరేటు ఎప్పటికి స్థిరంగానే ఉంటుంది.హోంలోన్ ప్రారంభంచినప్పటి నుంచి పూర్తిఅయ్యేవరకు EMI లో మార్పు వుండకూడదు అనుకునే వారికీ ఇది అనుకూలము.ఎందుకంటే RBI రెపోరేటులో ఏవైనా మార్పులు చేసిన…వాళ్లకేం ఎఫెక్ట్ కాదు. మార్కెట్ రేటుతో సంబంధం లేకుండా టెన్యూర్ పూర్తి అయ్యేవరకు ఒకటే వడ్డీరేటు వర్తిస్తుంది.

ప్రయోజనాలు:

హోంలోన్ EMI పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి ఇది ఆర్థిక నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది.ఇందులో ఏదయినా మార్పు సంభవిస్తే..మన బడ్జెట్ ప్రణాళిక దెబ్బతింటుంది.అయితే ఫిక్సిడ్ వడ్డీరేట్లు వల్ల EMI లలో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి బడ్జెటును యధావిధిగా నిర్వహించుకోవచ్చు.ఫ్యూచర్ ప్లాన్సకు కూడా ఎలాంటి ఆటంకం ఉండదు.ఫైనాన్స్ పై ఎక్కువ నియంత్రణను కలిగి ఉండవచ్చు.

నష్టాలు :

* ఫిక్సిడ్ వడ్డీరేట్లలో ఆర్థికభారం కాస్తఅధికంగానే ఉంటుంది.ఫ్లోటింగ్ వడ్డీరేట్లతో పోలిస్తే ఇందులో 1-2.5 శాతం అధిక వడ్డీ ఉంటుంది.

*లోన్ తీసికున్న తరువాత మార్కెట్లో వడ్డీరేట్లు తగ్గితే …రుణగ్రహీతలు ఆ రేటు కన్నా ఎక్కువగానే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

*గడువుకు ముందు లోన్ మొత్తం చెల్లించాలిన్న,ఇందులో నుంచి ఫ్లోటింగ్ వడ్డీరేటుకు మారాలన్న బ్యాంకులు రుసుములు విదిస్తాయి.

ఫ్లోటింగ్ వడ్డీరేటు:

ఫ్లోటింగ్ వడ్డీరేటుని వేరియబుల్ వడ్డీరేటు అని కూడా పిలుస్తారు.ఇది మార్కెట్ వడ్డీరేటుతో ముడిపడివుంది.బెంచుమార్క్ రేటులో ఏమైనా మార్పులు సంభవిస్తే…ఈ లోన్స్ పై వడ్డీరేట్లు సైతం మారుతాయి.RBI రెపోరేటు కూడా దీన్ని ప్రభావితం చేస్తుంది.కాలక్రమేనా వడ్డీరేట్లు తగ్గుతాయని ఆశించేవారు ఈ ఆప్షను ఎంపిక చేసికోవచ్చు.

 ప్రయోజనాలు:Home loan vs Mortgage loan:

*రెపోరేటు తగ్గితే నెలవారీ వాయిదాల నుంచి కొంత ప్రయోజనం పొందవచ్చు.

*రీఫైనాన్సు అవసరంలేకుండా మార్కెట్ రేటు తగ్గుదల ప్రయోజనాన్ని పొందవచ్చు.

*వడ్డీ రేట్లు తగ్గినప్పుడు EMI ల మొత్తాన్ని తగ్గించుకోకుండా…టెన్యూర్ ని తగ్గించుకున్నట్లు అయితే రుణం త్వరగా చెల్లించవచ్చు.వడ్డీ భారం కూడా తగ్గుతుంది.

వీటి  నష్టాలు:

Home loan vs Mortgage loan

ఇవి అప్పుడు అప్పుడు అస్థిరతకు గురువుతుంటాయ్.ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు వడ్డీ రేట్లు కూడా పెరగవచ్చు.దీనివల్ల నెలవారీ బడ్జెట్ స్వరూపం మారిపోతుంది.

 లోన్ ఫ్రీ -క్లోజ్ ఎలా చేయాలి:

బ్యాంకులో మనం హోంలోన్ తీసికుంటుంటాం.ఇదే సమయంలో ఎక్కువ రోజులు ఈఎంఐలు కట్టడం ఎందుకనే ఉద్దేశంతో చాల మంది ముందుగానే రుణం మొత్తం తిరిగి చెల్లించాలని చూస్తుంటారు.వీటినే లోన్ ఫ్రీ క్లోజర్ అంటారు.ఇందుకు కొన్ని బ్యాంకులు చార్జెస్ తీసికోకుండ అవకాశం కల్పిస్తాయి.వడ్డీభారం కూడా తగ్గే అవకాశం ఉంది.చార్జెస్ లేకుండా ముందుస్తు చెల్లింపులు చేసి లోను క్లోజ్ చేసికోవడం చాల మంచిది.

 ఫ్రీ -క్లోజ్ చేయాలంటే కొన్ని పద్ధతులు:

* మీ home లోను ముందుగానే క్లోజ్ చేయాలంటే ఈ విషయాన్ని బ్యాంకుకి లేఖ లేదా ఇమెయిల్ ద్వారా ఫ్రీ క్లోజ్ కి గల కారణాలు తెలపాలి.

* మీ house లోన్ మొత్తాన్ని ముందుస్తుగా చెల్లిస్తే,ఆ బ్యాంక్ నుంచి “నో-objection సర్టిఫికెట్(NOC)” తీసికోవాలి.భవిషత్తులో మీరు రుణం చెల్లించలేదు అని బ్యాంకులు మెలికలు పెడితే ఈ డాక్యుమెంట్ చూపించవచ్చు.

* మీ ఆస్తిపై మరొకరికి హక్కులు ఉంటే,తక్షణం దానిని తొలిగించుకోవాలి.దీని ద్వారా చట్టపరమైన సమస్యలు వుండవు.

* Home లోన్ మొత్తాన్ని ఫ్రీ క్లోజ్ చేసినాక,బ్యాంక్ మీ ఒరిజినల్ డాకుమెంట్స్ తిరిగి ఇచ్చేస్తుంది.వాటిని జాగ్రత్తగా పరిశీలించి జాగ్రత్తపరసాలి. 

లోన్ పూర్తి అయిందా? అయితే ఇవి మరిసిపోకండి:

ఇంటి నిర్మాణాలు చాల వరకు లోన్ తీసికొని చేపడతుంటారు.ఈ క్రమంలో తాము తీసికున్న లోన్ క్లోజ్ అయినతరువాత.. రుణ సంస్థకి ఇచ్చిన డాక్యూమెంట్స్ చాలామంది తిరిగి తీసికోరు.వాటితో ఇంకా పనిఏముందిలే అని అనుకుంటారు..కానీ వీటితో భవిషత్తులో సమస్యలు ఎదురుకోవలిసి వస్తుంది.

NOC (NO OBJECTION CERTFICATE):

* ప్రధానంగా బ్యాంకు నుంచి “NOC “సర్టిఫికెట్ తీసికోవాలి.ఈ సర్టిఫికెట్ మీ లోన్ పూర్తి అయ్యింది అని చెప్తుంది.ఇందులో మీ పేరు,ఊరు ,ఇతరవిషయాలు జాగ్రత్తగా పరిశీలించాలి.

ప్రాపెర్టీ ఒరిజినల్ డాక్యూమెంట్స్:

ఆ తరువాత మీ యొక్క “ప్రాపెర్టీ ఒరిజినల్ డాక్యూమెంట్స్”తీసికోవాలి.సెక్యూరిటీ కోసం మీరు బ్యాంకు కి ఇచ్చిన చెక్ లను కూడా తీసికోవడం మరిసిపోకండి.

రిజిస్టర్ నుంచి లీన్ టర్మినేషన్:

* ఫ్యూచర్ లో చట్టపరమైన సమస్యలు తలెత్తుకుండా ఉండడానికి “రిజిస్టర్ నుంచి లీన్ టర్మినేషన్” తీసికోవడం మరిసిపోవద్దు.

ఎన్ కంబెన్స్ సర్టిఫికెట్:buyer and builder agreement detailsకోసం https://impresshomedesigners.com/buyer-builder-agreement/

* “ఎన్ కంబెన్స్ సర్టిఫికెట్”కూడా తీసికోవడం మరిసిపోవద్దు.ఇది ఒక లీగల్ డాక్యుమెంట్.మీ ప్రొపెర్టీ home లోన్ కి సంబంధించి అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలు ఇందులోనే ఉంటాయి.

క్రెడిట్ రిపోర్టు:

* ముక్యంగా మీ క్రెడిట్ రిపోర్టులో లోన్ క్లోజ్ అయినట్లు వచ్చేంత వరకు బ్యాంకులను సంప్రదించాలి.మీ లోన్ ని పూర్తిగా చెల్లించిన తరువాత ఆవిషయాన్ని కచ్చితంగా “క్రెడిట్ బ్యూరో సంస్థ’ కి తెలియపరసాలి.

లోన్ ఇలా తీర్చేద్దాం:

సొంతఇంటి కలను నిజం చేసుకొనేందుకు చాలామంది హోంలోన్స్ తీసికుంటూవుంటారు.అయితే రేపో రేటు పెరగడం వంటి పలు కారణాలు వల్ల EMI లు పెరిగి,రుణం భారముఅవుతుంది.ఇలా కాకుండా వుండాలిఅంటే కొన్ని టిప్స్ పాటించాలి.

EMI పెoచుకోవడం:Home loan Mortgage loan:

* ఇంటి రుణాలకు చెల్లిస్తున్న వాయిదాలను ఏడాదికొకసారి మీ వీలుని బట్టి 5 శాతం వరకు పెంచుకోవాలి.ఆదాయం పెరిగింది అన్నప్పుడు ఇలా చేయడం వలన రుణ వ్యవధి తగ్గుతుంది.దీని వలన వడ్డీరేటు భారము తగ్గుతుంది.

* వాయిదాలు పెంచుకోవడం ఇబ్బంది అనుకుంటే అసలు మొత్తంలో ఏడాదికి 5శాతం చెల్లించేలా ప్రయత్నించాలి. దీనివల్ల 20 ఏళ్ళున్న రుణ వ్యవధి 12 ఏళ్ళలోనే పూర్తి అవుతుంది.

* రుణ వ్యవధి పెరుగుతుంది అనుకున్నప్పుడు 10శాతం Emi పెంపు,ముందుస్తు చెల్లింపులు ద్వారా వ్యవధి పెరగకుండా చూసికోవచ్చు.

* ఎప్పటికి అప్పుడు మీ బ్యాంకు లేదా రుణ సంస్థ నుంచి గృహరుణానికి సంబంధించి వివరాలు తెలిసికోవడం ముఖ్యం. దీనివల్ల  చెల్లింపు చేయడం సులభము అవుతుంది.

లోన్ EMI భారంగా అనిపిస్తుందా:

సొంతఇంటి కళను నిజం చేసికోవాలనికునే వారిలో చాలామంది హోంలోన్ తీసికుంటారు.అయితే కొందరు నెల నెల EMI కట్టడంలో పలు ఇబ్బందిలు ఎదురుకుంటారు.20-30ఏళ్ళు వరకు ప్రతి నెల ఇంత మొత్తం కట్టాలంటే కాస్త ఇబ్బందనే చెప్పాలి.అయితే Emi తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్ పాటించాలి.అవి ఏంటిఅంటే.

ఏంక్వైరి:

హోంలోన్ తీసికొనేముందు అన్ని బ్యాంకులు,ఫైనాన్స్ సంస్థలు,ఎంత వడ్డీరేటుని ఆఫర్ చేస్తున్నాయో తెలుసుకోండి. వాటిలో ఏది తక్కువకి ఇస్తుందో చూసి లోన్ తీసికోండి.

క్రెడిట్ స్కోర్:

లోన్ అప్లై చేయగానే బ్యాంకులు ముందుగా చూసేది క్రెడిట్ స్కోర్.ఇది ఎంత ఎక్కువుగా ఉంటే వడ్డీరేటు అంత తక్కువుగా బ్యాంకులు ఆఫర్ చేస్తుంటాయి.కాబట్టి మీరు తీసికున్న లోన్ల Emi లు,క్రెడిట్ కార్డు బిల్లులు,ఇతర పెమెంట్స్ ఏమున్నా కచ్చితంగా చెల్లించాలి.

tenure:

లోన్ tenure ఎక్కువకాలం సెలెక్ట్ చేసుకుంటే ప్రతి నెల చెల్లించే Emi భారం తక్కువుగా ఉంటుంది.కాబట్టి మీ ఆదాయం బట్టి మీ పై భారం పడకుండా ఉండేలా Emi ఎంచుకోండి.  

డౌన్ పేమెంట్:

Emi తక్కువుగా ఉండాలంటే మీరు హోంలోన్ కోసం మొదట్లో ఎక్కువ డబ్బులు చెల్లించాలి.మీ వద్ద డబ్బులు వుంటే లోన్ లో ఎక్కువ మొత్తాన్ని ముందుగానే చెల్లించండి.అలాగే ఎప్పుడైనా డబ్బులు అందినప్పుడు ముందుగానే చెల్లించవచ్చు. వీటివల్ల Emi భారంతో పాటు వడ్డీ కూడా తగ్గుతుంది.అయితే బ్యాంక్లో “ఫ్రీ క్లోజర్” చార్జెస్ ఎలా ఉన్నాయో తెలిసికొని ముందుఅడుగు వేయాలి.grocery offers https://amzn.to/4pmQoOA

ఆఫర్లు:

కొన్ని బ్యాంకులు,ఫైనాన్స్ సంస్థలు పండుగ సీజన్ లో లేదా ఏదోఒక టైములో స్పెషల్ ఆఫర్స్ అందిస్తుంటాయ్.ఈ సమయంలో సాధారణ వడ్డీ రేట్లు కంటే ఇంకా తక్కువ రేటుకే వడ్డీరేట్లు అందిస్తుంటాయి.కాబట్టి వాటిని జాగ్రత్త గా పరిశీలించి ఎంచుకోవాలి.

వేరేబ్యాంక్ ఆఫర్:

Home loan vs Mortgage loan

ఒక బ్యాంకులో హోంలోన్ తీసికున్న తరువాత,వేరే బ్యాంకులు ఏవైనా తక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేస్తామంటే వెంటనే వాటికీ మారిపోండి. అప్పుడు మీపై అదనపు భారం తగ్గుతుంది.వడ్డీ కూడా తక్కువ పడుతుంది,కాకపోతే ట్రాన్స్ఫర్ ఛార్జెస్ గురించి ముందుగానే తెలిసికోవాలి.

హోంలోన్ తీసికొనేముందు తెలిసికోవాలిసినవి:

సొంతిల్లు కలిగి ఉండడం ప్రతి ఒక్కరి కల.ఈ కలను నెరవేర్సికునేందుకు మెజారిటీ జనాలు ఎంచుకునే ఆప్షన్ హోంలోన్.అయితే దానికి ముందు కొన్ని విషయాలు గురించి తెలిసికోవడం ముఖ్యం.

అవసరమైన పత్రాలు:

హోంలోన్ పొందడానికి నెలవారీగా మీరు పొందే ఆదాయానికి సంబందించిన అన్ని పత్రాలు సమర్పించాలి. ఉద్యోగస్తులు అయితే గత మూడు నెలల పే స్లిప్పులు,బ్యాంకులో మీ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి ఫామ్ 26ఏఎస్ సమర్పించాలి.

EMI గురించి తెలిసికోవాలి:

హోంలోన్ తీసికున్న తరువాత మంత్లీ EMI కట్టేందుకు అవసరమైన ఆదాయ మార్గాలున్నాయా అన్నది చెక్ చేసుకోవాలి. వాయిదాలు సులువుగా చెల్లించడానికి తక్కువ EMI ను ఎంచుకోవాలి.మీరు తక్కువ మొత్తంలో లోన్ తీసికుంటే ఈజీగా తిరిగి చెల్లించవచ్చు.పెద్ద మొత్తంలో హోంలోన్ తీసికుంటే చెల్లించడానికి చాల కాలం పడుతుంది.అలాగే వీలైనంత ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టేలా చూసికోవాలి.

ఫ్రీ అప్రూవ్డ్ లోన్:

కొన్ని బ్యాంకులు మీకు హోంలోన్ పై ఫ్రీ approved ఆఫర్ ఆప్షన్ ఇస్తాయి.ఇలాంటి పరిస్థితిల్లో మీరు ముందు గృహ రుణం పొందిన తరువాత,.అదే బడ్జెట్ లో ఇల్లు వెతుక్కోవడం బెటర్.

అర్వ్హతలు:

ఏ బ్యాంకు ఐనా లోన్ ఇవ్వాలనికున్నప్పుడు సంబంధిత వ్యక్తికి గల అర్వ్హత లను చెక్ చేస్తుంది.,కాబట్టి రుణ గ్రహీత తన వయస్సు ఆధారంగా బ్యాంకు వెబ్సైటు లో లోన్ పరిమితి చెక్ చేసికొని…ఆ తరువాత అప్లై చేసికోవాలి.దీని వల్ల చాల సమయం ఆదా అవుతుంది.

ఫ్రీ పేమెంట్ చార్జీలు:https://amzn.to/4rczbbU

హోంలోన్ తీసుకుంటున్నప్పుడు బ్యాంకుకు…రుణ గ్రహీత ఫ్రీ పేమెంట్ చార్జిస్ చెల్లించాల్సి ఉంటుంది.కాబట్టి ముందుగానే బ్యాంకర్ తో ఫ్రీ పేమెంట్ చార్జీలు విషయమై చర్చించుకోవడం ఉత్తమం.

వీటిలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్Home loan vs Mortgage loan:

* ఇంటి రుణాలకు చెల్లిస్తున్న వాయిదాలను ఏడాదికొకసారి మీ వీలుని బట్టి 5 శాతం వరకు పెంచుకోవాలి.ఆదాయం పెరిగింది అన్నప్పుడు ఇలా చేయడం వలన రుణ వ్యవధి తగ్గుతుంది.దీని వలన వడ్డీరేటు భారము తగ్గుతుంది.

* వాయిదాలు పెంచుకోవడం ఇబ్బంది అనుకుంటే అసలు మొత్తంలో ఏడాదికి 5శాతం చెల్లించేలా ప్రయత్నించాలి. దీనివల్ల 20 ఏళ్ళున్న రుణ వ్యవధి 12 ఏళ్ళలోనే పూర్తి అవుతుంది.

* రుణ వ్యవధి పెరుగుతుంది అనుకున్నప్పుడు 10శాతం Emi పెంపు,ముందుస్తు చెల్లింపులు ద్వారా వ్యవధి పెరగకుండా చూసికోవచ్చు.

* ఎప్పటికి అప్పుడు మీ బ్యాంకు లేదా రుణ సంస్థ నుంచి గృహరుణానికి సంబంధించి వివరాలు తెలిసికోవడం ముఖ్యం. 

* ఫిక్సిడ్ వడ్డీరేట్లలో ఆర్థికభారం కాస్తఅధికంగానే ఉంటుంది.ఫ్లోటింగ్ వడ్డీరేట్లతో పోలిస్తే ఇందులో 1-2.5 శాతం అధిక వడ్డీ ఉంటుంది.

*లోన్ తీసికున్న తరువాత మార్కెట్లో వడ్డీరేట్లు తగ్గితే …రుణగ్రహీతలు ఆ రేటు కన్నా ఎక్కువగానే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

*గడువుకు ముందు లోన్ మొత్తం చెల్లించాలిన్న,ఇందులో నుంచి ఫ్లోటింగ్ వడ్డీరేటుకు మారాలన్న బ్యాంకులు రుసుములు విదిస్తాయి.

*రెపోరేటు తగ్గితే నెలవారీ వాయిదాల నుంచి కొంత ప్రయోజనం పొందవచ్చు.

*రీఫైనాన్సు అవసరంలేకుండా మార్కెట్ రేటు తగ్గుదల ప్రయోజనాన్ని పొందవచ్చు.

*వడ్డీ రేట్లు తగ్గినప్పుడు EMI ల మొత్తాన్ని తగ్గించుకోకుండా…టెన్యూర్ ని తగ్గించుకున్నట్లు అయితే రుణం త్వరగా చెల్లించవచ్చు.వడ్డీ భారం కూడా తగ్గుతుంది.

* మీ home లోను ముందుగానే క్లోజ్ చేయాలంటే ఈ విషయాన్ని బ్యాంకుకి లేఖ లేదా ఇమెయిల్ ద్వారా ఫ్రీ క్లోజ్ కి గల కారణాలు తెలపాలి.

* మీ house లోన్ మొత్తాన్ని ముందుస్తుగా చెల్లిస్తే,ఆ బ్యాంక్ నుంచి “నో-objection సర్టిఫికెట్(NOC)” తీసికోవాలి.

* మీ ఆస్తిపై మరొకరికి హక్కులు ఉంటే,తక్షణం దానిని తొలిగించుకోవాలి.దీని ద్వారా చట్టపరమైన సమస్యలు వుండవు.

* Home లోన్ మొత్తాన్ని ఫ్రీ క్లోజ్ చేసినాక,బ్యాంక్ మీ ఒరిజినల్ డాకుమెంట్స్ తిరిగి ఇచ్చేస్తుంది.వాటిని జాగ్రత్తగా పరిశీలించి జాగ్రత్తపరసాలి.

మీకు ప్లాట్ లోన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.https://impresshomedesigners.com/wp-admin/post.php?post=2934&action=edit

మా construction company సర్వీసెస్ :

*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ , duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును . మా phone number; 7989312152, 9989456907.

flats for sale