Interlocking bricks, size and price! House Interlocking bricks price details in Telegu:
Interlocking bricks size and price:ఇంటర్ లాకింగ్ బ్రిక్స్, ఈ బ్రిక్స్ మనలో చాల మందికి తెలియకపోవచ్చు. కానీ విదేశాల్లో ఈ టెక్నాలజీని ఎక్కువుగా వాడుతున్నారు.అలాగని ఇది విదేశి టెక్నాలజీ కాదు. ఈ పద్ధతి మనదేశంలో పూర్వము దేవాలయాలు నిర్మించునప్పుడునుంచి వుంది. ఈ టెక్నాలజీ తో నిర్మించే గోడలకు పెద్దగా సిమెంట్ వాడవలిసిన పని లేదు. వీటిలో బ్రిక్స్ కి బ్రిక్స్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది దానిద్వారా ఒకటికి ఒకటి పట్టుకొని ఉంటాయి(రైలుకు , రైలు పట్టాలకు ఎలా కనెక్టింగ్ ఉంటుందో అలా వీటిలో కనెక్టింగ్ ఉంటుంది).మీ ఇంటికి కావలసిన గ్రోసిరి కోసం ఈ లింక్ పైన క్లిక్ చేయండి. https://amzn.to/4n6nSAv
ఇంటర్ లాకింగ్ బ్రిక్స్ గురించి మీకు తెలుసా:
పూర్వం సిమెంట్ అందుబాటులో లేని కాలంలోనే ఇలాంటి పద్దతిలో రాళ్లతో దేవాలయాలు నిర్మించారు.అలా నిర్మించిన ఆలయాలు ఇప్పటికి చెక్కు చెదరకుండ ఉన్నాయి.ఈ పాతకాల పద్ధతి నే ఇప్పుడు మళ్ళీ ఈ ఇంటర్ లాకింగ్ టెక్నాలజీ గా వాడుతున్నారు.ప్రస్తుతము మెటీరియల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమములో ఇంటర్ లాకింగ్ టెక్నాలజీ వైపు ఎక్కువుగా మొగ్గు చూపుతున్నారు. ఈ టెక్నాలజీ ఇప్పుటికే కేరళ, తమిళనాడు,బెంగుళూరు, కోయంబత్తూరు ఇలా చాల చోట్ల ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఇప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఈ టెక్నాలజీ అభిరుద్ది చెందుతుంది.
ఎలా తయారు చేస్తారు:
మొదట ఇటుకులు తయారికి సిమెంట్, రోబో శాండ్, ప్లైయాష్ ,6mm కంకర. వీటిఅన్నిటిని తగిన నిష్పత్తిలో కలుపుతారు. ఇందుకోసం మిక్సింగ్ మిషన్ వాడుతారు.స్థిరత్వం కోసం నీరు జోడిస్తారు. ఆ తరువాత మిశ్రమాన్ని ఇంటర్ లాకింగ్ బ్రిక్ యంత్రం లో వేస్తారు. ఈ యంత్రం మొత్తం మిశ్రమాన్ని కావలిసిన ఇటుక ఆకారం పరిమాణం లో కుదిస్తుంది.ఆ తరువాత తయారియైన బ్రిక్ ని 10డేస్ వరకు (మినిమం 1వీక్ ) ఎండబెట్టాలి. ఈ సమయంలో ఇంటర్ లాకింగ్ బ్రిక్స్ బలపడి, స్థిరత్వాన్ని పొందుతాయి, అలా పూర్తిగా గట్టిపడినాక ఉపయోగించుకోవాలి.
ఈ బ్రిక్స్ సురక్షితమేనా :
ఇంటర్ లాకింగ్ బ్రిక్స్ తో నిర్మించిన ఇల్లు ప్రమాణాలు, నిబంధనలకు అనుగుణంగా నిర్మిస్తే సురక్షితమే. అలాగే నిర్మాణ నాణ్యత, పునాది, డిజైన్, మెయింటనెన్స్ వంటి విషయాలపై ఇది ఆధారపడి ఉంటుంది.
వీటి ప్రయోజనాలు :
ఇంటర్ లాకింగ్ డిజైన్ లో నిర్మించిన ఇల్లు భారీ గాలులు,భూకంపాలు , వర్షాలు సహా అనేక ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. వీటివల్ల నిర్మాణ ప్రక్రియ వేగంగా, ఖర్చు తక్కువ అవుతుంది. అలాగా ఇవి గోడలు వేడిని తగ్గిస్తాయి. వీటితో నిర్మాణము పర్యావరానికి అనుకూలంగ ఉంటాయి.ఇంటర్ లాకింగ్ డిజైన్ వల్ల పగుళ్లు మరియు నిర్మాణ సమస్యలు పెద్దగా వుండవు.ఎప్పటికి అప్పుడు మరమ్మతులు చేయవలిసిన ఫని ఉండదు. అగ్ని ప్రమాదాలు జరగకుండా కాపాడుతాయి.
ప్రతికూలతలు:
ఇంటర్ లాకింగ్ ఇటుకులు ఏ డిజైన్ లో ఉండాలో మనం ముందుగానే నిర్ణయించుకోవాలి. లేదంటే మనకు కావలసిన డిజైన్ లో ఇల్లు నిర్మించుకోవడం చాల కష్టం. అలాగే ఏదయినా మరమ్మతు చేయవలిసి వస్తే ఇంటి గోడల్లో ఉన్న బ్రిక్స్ విడదీసే ప్రక్రియ ఎక్కువ సమయం పడుతుంది. అలాగే ఈ పద్దతిలో ఇల్లు నిర్మించాలి అనుకుంటే నైపుణ్యము కలిగిన కార్మికలు అవసరం. అన్ని ప్రాంతాల్లో ఈ ఇటుకలు సులభంగా అందుబాటులో వుండవు. మీరు ఈ పద్దతిలో ఇంటి నిర్మాణం చెపట్టాలి అనుకుంటే నిపుణులు సలహా తీసికోవడం మంచిది.
ఇంటర్‌లాకింగ్ ఇటుకల ప్రయోజనాలు:Interlocking bricks, size and price:
ఇసుక మరియు సిమెంట్ :
* ఇసుక, సిమెంట్ అవసరం లేకుండ ఇంటిని నిర్మించవచ్చు.
temperature:
*ఇవి temperature restricted (వేరే బ్రిక్స్ తో పోలిస్తే temperature అనేది 5to 6degrees variation చూపిస్తుంది).
క్యూరింగ్:
*వేరే బ్రిక్స్ తో పోలిస్తే క్యూరింగ్ కూడా అంత అవసరం ఉండదు.
fillers:
*without fillers G +2 వరకు construction చేసికోవచ్చు,..సింగల్ ఫ్లోర్ కి fillers అవసరం లేదు.
*earthquake(భూకంపము) వచ్చిన తట్టుకోకలవు.
ecofriendly :
* ఈ ఇంటర్ లాకింగ్ ecofriendly (పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగదు…పర్యావరణానికి అనుకూలము…ఇందులో ఎటువంటి రసాయనాలు కలపరు).
dismantling:
*మనం ఎప్పుడైనా విరగగొట్టాలి అనుకుంటే ఒక బ్రిక్ తీస్తే అన్ని బ్రిక్స్ సింపుల్ గా వచ్చేస్తాయి, అవే వేరే బ్రిక్స్ అయితే ఇరుగుపోతాయ్.
ప్లాస్టరింగ్:
*ప్లాస్టరింగ్ చేయనవసరం లేదు …అలా అని క్రాక్స్ కూడా రావు.
strength:
*ఈ ఇంటర్ లాకింగ్ బ్రిక్స్ rich గా ఉంటాయి ,..బలంగా ఉంటాయి,…అందంగా ఉంటాయి.
interlocking bricks, size and price:
size :
ఇవి మనకు ఎక్కువ 6″ అండ్ 9″ size లో దొరికితాయ్. వీటికి ISI మార్క్ ఉంటుంది…చూసికొనికోవాలి లేదంటే వీటిలో డూప్లికేట్ బ్రిక్స్ కూడా ఉంటాయి. అలాగే వీటి sizes 2″, 4″, 6″, 8″, 9″ లో కూడా ఉంటాయి.
price :
వీటి కాస్ట్ వచ్చేసి 2″ = 26rs ….4″=46rs …6″=65rs…8″=85rs….9″=95rs వరకు ఉంటాయి. ఇవి మన స్టేటులో అయితే అనంతపురం లో దొరికితాయ్.
పరిచయం:
మన దేశంలో నిర్మాణ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇళ్లు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ బిల్డింగ్‌లు నిర్మించడానికి కొత్త కొత్త టెక్నాలజీలు, పదార్థాలు వస్తున్నాయి. ఇటుకల వాడకం శతాబ్దాల నుండి కొనసాగుతున్నా, ఇటీవల కాలంలో “interlocking bricks” అనే కాన్సెప్ట్ ప్రత్యేక ప్రాధాన్యత సంపాదించుకుంది.
ఇవి సాధారణ ఇటుకలకంటే వేరుగా ఉంటాయి. ఒకదానితో ఒకటి తాళం-చావి (lock-key) సిస్టమ్‌లా కలిసిపోతాయి. అందువల్ల సిమెంట్, మోర్టార్ ఎక్కువగా అవసరం లేకుండా గోడలు నిర్మించవచ్చు. పర్యావరణానికి హితంగా ఉండడం, తక్కువ ఖర్చుతో పని పూర్తి చేయగలగడం వీటి ప్రధాన విశేషాలు.
ముగింపు
ఇంటర్‌లాకింగ్ ఇటుకలు అనేవి ఆధునిక కాలంలో “తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి అనుకూలంగా, బలంగా” ఇళ్లు నిర్మించడానికి ఒక అద్భుతమైన పరిష్కారం. సాధారణ ఇటుకలతో పోలిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సరైన నాణ్యత, లభ్యత అనే అంశాలను దృష్టిలో పెట్టుకుని వాడితే మరింత మంచిది.
సాధారణ ఇటుకలతో పోల్చితే ఇంటర్‌లాకింగ్ ఇటుకల మధ్య తేడా
| అంశం | సాధారణ ఇటుకలు | ఇంటర్‌లాకింగ్ ఇటుకలు |
|---|---|---|
| తయారీ విధానం | కాల్చడం ద్వారా | ప్రెస్ ద్వారా |
| ఖర్చు | ఎక్కువ | తక్కువ |
| పర్యావరణ ప్రభావం | ఎక్కువ కాలుష్యం | పర్యావరణహితం |
| నిర్మాణ బలం | సగటు | ఎక్కువ |
| మోర్టార్ అవసరం | ఎక్కువ | తక్కువ |
| అందం | ప్లాస్టర్ అవసరం | సహజ అందం |
LAND MEASUREMENTS / UNIT CONVERSION / భూమి కొలతలు/STANDARD CONVERSION /BUILDING MEASUREMENTS :
1 m =39 .97 inch
1 feet =12 inch
1inch = 25 .4 mm
1foot =౦.3048 m
1yard =౦.9144 m
1m =3 .28 ft
1mm =౦.394 inch
1 m =100 cm
1 m =1000 mm
1 cm =10mm
1 inch =2 .54 cm
1 yard =3 feet
1 m =1 .096yard
1hector =2 .47acre
1ground =2400sqft
1square =100sqft
1unit =100cu .ft -2 .83cm
1mile =1 .6093km
1newton =0 .10kg
1feet =12 “=12 *2 .54 =30 .48cm =౦.3048m .
1yard =3 ‘ or 9sqfeet =3 *30 .48 =91 .44cm
1yard =36 ” or 1sqyard =9feet
1gunta =121sqyard
1gunta =121 *9 =1089sqfeet =2 .5cents
1acre =100cents =40guntalu
1acre =40 *121sqyard =4840sqyard
1acre =4840 *9sqfeet =43 ,560sqfeet
1acre =605 అంకణాలు
1ankam =8sqyards or 72sqfeets
1cent =48 .4 inch .yards =435 .65 feet’s
1000sqft =111 .111 sq yard =2 .29cents =13 .88 అంకం
100sqyard =900sqfeet =9units =2 .07 cents =12 .5 అంకణాలు =0.8guntalu.
*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును .
హౌస్ నిర్మాణానికి మొత్తం ఖర్చు (Summary):
| విభాగం | సుమారు ఖర్చు (1000 SFT) |
|---|---|
| ఫౌండేషన్ & స్ట్రక్చర్ | ₹6,00,000 – ₹7,00,000 |
| గోడలు & మేసనరీ | ₹4,00,000 – ₹5,00,000 |
| రూఫ్ & కాంక్రీట్ | ₹4,00,000 – ₹4,50,000 |
| డోర్లు & విండోలు | ₹2,00,000 – ₹2,50,000 |
| ప్లంబింగ్ & ఎలక్ట్రికల్ | ₹1,50,000 – ₹2,00,000 |
| ఫ్లోరింగ్ & టైల్స్ | ₹1,50,000 – ₹2,00,000 |
| పెయింటింగ్ | ₹1,50,000 – ₹2,00,000 |
| ఇంటీరియర్స్ (ఆప్షనల్) | ₹3,50,000 – ₹5,00,000 |
| మొత్తం | ₹24 – ₹30 లక్షలు
|

