what is land mutation? Land mutation meaning?

what is land mutation? Land mutation meaning?

what is land mutation:మ్యుటేషన్ ముఖ్య ఉద్దేశం ఆస్తికి తామే నిజమైన వారసులము అని తెలియజేస్తుంది.సులభంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి తన భూమిని అమ్మినా, బహుమతిగా ఇచ్చినా, లేదా వారసత్వంగా ఇంకొకరికీ వచ్చినా, ఆ కొత్త యజమాని పేరును ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయడాన్ని మ్యూటేషన్ అంటారు.అంటే, ఒక వ్యక్తి నుండి మరొకరికీ భూమి హక్కులు మారినప్పుడు, ఆ మార్పు రెవెన్యూ రికార్డుల్లో (Adangal, 1-B Register, Pattadar Passbook మొదలైనవి) నమోదు చేయడాన్ని మ్యూటేషన్ అంటారు.

Land mutation meaning:

భూమి అనేది మనిషి జీవితంలో అత్యంత విలువైన ఆస్తి. ఒక వ్యక్తి సంపద, గౌరవం, భవిష్యత్తు అన్నీ భూమిపైనే ఆధారపడి ఉంటాయి. భూమి కొనుగోలు, అమ్మకం, బహుమతి, వారసత్వం వంటి సందర్భాల్లో భూమి యాజమాన్యం మారుతుంది. ఈ యాజమాన్యం మార్పు ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో నమోదు కావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనే భూమి మ్యూటేషన్ (Land Mutation) అంటారు.

సాధారణంగా చెప్పాలంటే – భూమి మ్యూటేషన్ = ప్రభుత్వ భూమి రికార్డుల్లో కొత్త యజమాని పేరు నమోదు చేయడం.ఇది చేయకపోతే, భూమి నిజమైన యజమాని ఎవరో రికార్డుల్లో చూపించబడదు. తద్వారా పన్నులు చెల్లించడం, రుణం పొందడం, భూమిని అమ్మడం వంటి పనుల్లో ఇబ్బందులు వస్తాయి.

మీ స్థలానికి మ్యుటేషన్ ఎందుకు :

రియాల్టీలో స్థలాలు అమ్మకాలు,కొనుగోళ్లు సర్వసాధారణం.ఇలా కొన్న భూములు, ఇళ్లను మనం రిజిస్టర్ ఆఫీసులో తగిన ఫీజు చెల్లించి రెజిస్ట్రేషన్ చేసికొని,సేల్ డీడ్ తీసికొని వెళ్ళిపోతాం.అసలు సమస్య అక్కడే మొదలు అవుతుంది.ఏదయినా ఒక ఆస్తిని కొనుగోలు చేసిన వ్యక్తి “రెజిస్ట్రేషన్ తో పాటు రికార్డుల్లో పేరు మార్షుకోవడం ముఖ్యం”. దీనికోసం గ్రామాల్లో అయితే పంచాయతీ రికార్డుల్లో, నగరాలు,పట్టణాల్లో కార్పొరేషన్, మున్సిపల్ కార్యాలయాల్లో తమ పేరుపై నమోదు చేసికోవాలి.వ్యవసాయ,వ్యవసాయేతర భూములు కొనుగోళ్లు,అమ్మకాలు కు సంబంధించి ల్యాండ్ రెవిన్యూ రికార్డు ఒకటి ఉంటుంది.అందుకే ఎవరైనా ఆస్థి కొనుగోళ్లు చేస్తే వెంటనే మ్యుటేషన్ కి దరఖాస్తు చేసికోవాలి.అప్పుడే రెవిన్యూ రికార్డుల్లో అమ్మినవారి పేరు తొలిగి,కొన్నవారి పేరు మీదకు ఆస్తి బదిలీ అవుతుంది.ఇలా చేయడం వల్ల “EC ,ఆక్యూపెన్సీ సర్టిఫికెట్” లో మీ పేరు చేరుతుంది.అప్పుడు ఎలాంటి ఇబ్బంది వుండదు.

 మ్యుటేషన్ దరఖాస్తు చేసికొనే విధానం :

ప్రస్తుతం ఆస్తిని కోనుగోలు చేసిన, వారసత్వం గా పొందిన,బహుమతి గా వచ్చినా,పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా కొన్న మ్యుటేషన్ తప్పనిసరి.ఇటీవల రెజిస్ట్రేషన్ శాఖ వారే మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.అలా మ్యుటేషన్ చేసికొనువారు వెంటనే దరఖాస్తు చేసికోవాలి.భవిష్యత్తులో ఆస్తులు విక్రయాలు జరపాలంటే మ్యుటేషన్ పత్రాలు తప్పనిసరి.కరెంటు, వాటర్ వంటివి కావాల్సి వస్తే ఇవి దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది.

కావలిసిన పత్రాలు :

దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు లో ఆస్తి మ్యుటేషన్ దరఖాస్తుతో పాటు,సేల్ డీడ్, స్టాంప్ పేపర్ పై ఈ ఆస్తి తనదే అని ద్రువికరిస్తూ స్టాంప్ పేపర్ పై అఫిడవిట్, ఆధార్ కార్డు,ఆస్తిపన్ను రశీదు,వీలునామా లేదా వారసత్వ ధ్రువీకరణ పత్రం,యజమాని మరణిస్తే మరణ ధ్రువీకరణ పత్రం కలిపి జత చేసి మీ స్థానిక తహసీల్దార్, సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో మ్యుటేషన్ పెట్టుకోవాలి.రెవెన్యూ అధికారులు భూమి రికార్డులను క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు.కొన్నిసార్లు ప్రజా నోటీసు ఇస్తారు – ఎవరికైనా అభ్యంతరం ఉంటే తెలియజేయమని.తహసీల్దార్ పరిశీలించి ఆమోదిస్తారు.కొత్త యజమాని పేరుతో Adangal, 1-B రికార్డులు అప్‌డేట్ అవుతాయి. కొత్త పాస్‌బుక్ / టైటిల్ డీడ్ వస్తుంది.

ఎంత ఛార్జి వుంటుందిwhat is land mutation:

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆస్తి విలువలో 0.1% ఛార్జి చెల్లిస్తే మీ ఆస్తి పత్రాలను పరిశీలించి 15-30రోజుల్లో మ్యుటేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తారు.భూమి మ్యూటేషన్ కోసం పెద్దగా ఖర్చు ఉండదు. సాధారణంగా మీ Seva ఫీజులు + చిన్న ప్రాసెసింగ్ ఛార్జీలు మాత్రమే ఉంటాయి

మ్యూటేషన్ ఎందుకు అవసరం? :

పన్నులు పాత యజమాని పేరుతో చెల్లించాల్సి వస్తుంది.రుణం పొందడంలో ఇబ్బంది అవుతుంది.భూమి అమ్మేటప్పుడు కొనుగోలుదారులు నమ్మకం చూపరు.భవిష్యత్తులో చట్టపరమైన వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది.భూమి మ్యూటేషన్ అనేది సాధారణమైన కానీ అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. భూమిని కొనుగోలు చేసిన ప్రతిసారి, లేదా వారసత్వం ద్వారా భూమి పొందిన ప్రతిసారి మ్యూటేషన్ చేయడం వల్ల భూమి హక్కులు మీ పేరుతో స్పష్టంగా నమోదు అవుతాయి. ఇది భవిష్యత్తులో ఏ వివాదాలు లేకుండా, చట్టబద్ధంగా మీ ఆస్తి హక్కులను కాపాడుతుంది.

మ్యూటేషన్ యొక్క ప్రయోజనాలు

ప్రభుత్వ రికార్డుల్లో మీ పేరు స్పష్టంగా ఉంటుంది.భూమిపై మీ హక్కులు చట్టబద్ధంగా నిరూపించుకోవచ్చు.పన్నులు, రుణాలు, లావాదేవీలు సులభతరం అవుతాయి.వారసత్వ హక్కులు రక్షించబడతాయి.భూమి వివాదాలు తగ్గుతాయి.

LR &LM అంటే ఏమిటి ?

Land Registration = భూమి లావాదేవీని చట్టబద్ధం చేయడం

Land Mutation = ఆ లావాదేవీని రెవెన్యూ రికార్డుల్లో అప్‌డేట్ చేయడం

భూమి కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా మ్యూటేషన్ కూడా చేయడం చాలా అవసరం. ఇది భవిష్యత్తులో సమస్యలు లేకుండా భూమి హక్కులను రక్షిస్తుంది.

ఆన్‌లైన్ మ్యూటేషన్ సౌకర్యం

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో Mee Seva / Dharani పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మ్యూటేషన్ అప్లై చేసే అవకాశం ఉంది. ఇది ప్రజలకు సమయం, డబ్బు ఆదా చేస్తుంది.

మ్యూటేషన్ అవసరమయ్యే సందర్భాలు

  1. భూమి కొనుగోలు / అమ్మకం (Sale / Purchase)

    • ఎవరైనా భూమి కొనుగోలు చేస్తే, రిజిస్ట్రేషన్ తర్వాత మ్యూటేషన్ తప్పనిసరి.

  2. గిఫ్ట్ డీడ్ (Gift Deed)

    • ఒకరు తన భూమిని బహుమతిగా ఇస్తే, ఆ వ్యక్తి పేరుతో మ్యూటేషన్ చేయాలి.

  3. వారసత్వం (Inheritance)

    • తల్లిదండ్రులు లేదా బంధువుల నుండి వచ్చిన భూమి వారసుల పేరుతో అప్‌డేట్ చేయాలి.

  4. కోర్టు ఆర్డర్ (Court Order)

    • భూమి వివాదం కోర్టులో పరిష్కారం అయి, హక్కులు మారితే మ్యూటేషన్ తప్పనిసరి.

  5. Partition (విభజన)

    • కుటుంబ సభ్యుల మధ్య భూమి విభజన జరిగితే, ప్రతి ఒక్కరి పేరుతో మ్యూటేషన్ చేయాలి.


మ్యూటేషన్ అవసరం ఎందుకుwhat is land mutation?

  •  యాజమాన్య హక్కుల రక్షణ – మీరు నిజమైన యజమాని అని ప్రభుత్వ రికార్డులు చూపిస్తాయి.

  •  పన్నులు చెల్లించడం సులభం – మీ పేరుతో రికార్డులు ఉన్నప్పుడు ట్యాక్స్ చెల్లించడం సులభం.

  •  భూమి అమ్మడం / రుణం పొందడం సులభం – బ్యాంకులు, కొనుగోలుదారులు మీ పేరును రికార్డుల్లో చూడగానే నమ్మకం కలుగుతుంది.

  •  వారసత్వ హక్కులు – భూమి మీకు చట్టబద్ధంగా వచ్చింది అని నిరూపించుకోవచ్చు.

  •  వివాదాలు నివారించడం – రికార్డులు క్లియర్‌గా ఉంటే భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు రావు.


భూమి రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ మధ్య తేడా

అంశం Land Registration (భూమి రిజిస్ట్రేషన్) Land Mutation (భూమి మ్యూటేషన్)
ప్రక్రియ భూమి లావాదేవీని Sub-Registrar Officeలో నమోదు చేయడం కొత్త యజమాని పేరును Revenue Recordsలో అప్‌డేట్ చేయడం
పత్రం Sale Deed / Gift Deed / Partition Deed Adangal, 1-B Register, Pattadar Passbook
చట్టపరమైన ప్రాముఖ్యత లావాదేవీ చట్టబద్ధతను నిర్ధారిస్తుంది రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్యం చూపిస్తుంది
ఎక్కడ జరుగుతుంది Sub-Registrar Office తహసీల్దార్ కార్యాలయం / MeeSeva
తప్పనిసరితనం తప్పనిసరి (Mandatory) ముఖ్యమైనది (Legal validity కోసం సిఫారసు చేయబడింది)

*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును.

*మీరు  వైజాగ్ చుట్టుపక్కల open plots , flats , commercials , villas , duplex houses , independent houses కొనాలన్నా  అమ్మాలన్న మాకు సంప్రదించండి  

*We Construct your Dream House/ Villa/apartment/development in Vizag And Vizianagaram and Srikakulam  surrounding  pls contact;7989312152

*Premium Quality Constructions For Duplex, Villas, Individual Houses, Apartments & Developments With Modern Interiors In Vizag  contact me ; 7989312152.

Real Estate Marketing Tips And Strategy :

*రియల్ ఎస్టేట్ persons కి stability,  patience,  time sense ముక్యంగా ఉండాలి ఏజెంట్ అనేవాడు సేల్స్ ఆఫీసర్ జాబ్ లా కాకుండా ఒక guide,  ఒక coach, ఒక advisor. ఒక ఫ్రెండ్ వలె ఉండాలి  అప్పుడే మీ మీద  ట్రస్ట్ ఉంటుంది. మీరు మీ ఇంటికి సంబందించి ఎటువంటి వస్తువులు తీసికోవాలన్న ఈ లింక్ పై క్లిక్ చేయండి మంచి డిస్కౌంట్ పొందవచ్చుhttps://amzn.to/4jvZ824 

* ఎప్పుడకి అప్పుడు upgrade అవుతుండాలి (knowledge పెంచుకోవాలి )  మొహమాటం ఉండకూడదు తెగింపు మాట థైర్యం ఉండాలి 

*మంచి రోజులు తెలిసికోవాలి permanent అడ్రెస్స్,.. permanent mobile number ఉండాలి    

* rules/ regulations తెలిసికోవాలి [ VUDA /DTCP /GP /HMT అంటే ఏమిటి వీటి రూల్స్ ] అలాగే RERA అంటేఏమిటి     

*సైట్ కి చుట్టువైపులా వున్నా ప్రాజెక్ట్స్ వాటి rates ఆ సైట్ details తెలిసికొని వాటికంటే మన సైట్ గొప్పతనం ఏంటి అనేది  చెప్పాలి

*enquiry వస్తే lead గా generate చేయాలి తరువాత site visit కి తీసికొనివెళ్ళి close చెయ్యాలి తరువాత  sale agreement  తీసికొని registration చేయంచాలి 

*ప్రతి investment లో రిస్క్ ఉంటుంది వీటిలో మాత్రమే రిస్క్ ఉండదు bank interest తో చూసికున్న చాల బెటర్ కాబట్టి ఏజెంట్ అనేవాడు ఇవన్నీ కస్టమర్ కి చెప్పాలి .

Traditional marketing:

ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ bus stands, railway station, shopping malls, door to door, offices ….ఇలా వీటిదగ్గర pomp Lates పంచేవారు అలాగే  tv  మరియు రేడియో కి యాడ్స్ ఇచ్చేవారు highway side పెద్ద పెద్ద banners కట్టేవారు ఇదంత traditional market  ఇప్పుడుకూడా చేస్తున్నారు కానీ అప్పుడు అంత అడావుడి ఇప్పుడు కనిపించడం లేదు కారణం ఒకప్పుడు జనాలు online (social media) లో ఉండేవారు కాదు కాబట్టి మనం customer ని వెతికేవాలం ఇప్పుడు అంత ట్రెండ్ మారిపోయింది సెల్ ఫోన్ వున్నా ప్రతిఒక్కరు online లో వుంటున్నారు కాబట్టి ఇప్పుడు customer ని మనం వెతకానవసరం లేదు కస్టమర్ మనకు వెతుకుంటూ వస్తున్నారు కాబట్టి మనం కూడా online market ని ఎంచుకోవాలి 

flats for sale
villas for sale

Online Marketing:

online market అంటే ముందుగా గుర్తు వచ్చేది digital marketing మీకు digital మార్కెటింగ్ తెలిసివుండాలి లేదా తెలిసిన వారిని పెట్టుకోవాలి ఇందులో చూసికుంటే ముందుగా social media marketing తరువాత గూగుల్ ads, email marketing, SEO, you tube marketing, blogging, website, google map  ఇలా అన్నింటిలోనూ post లు పెట్టాలి  అలాగని traditional market చేయవద్దు అని కాదు ఇప్పుడున్న computation కి online మరియు offline రెండు చేయాలి  ముందుగా మనకు ఒక website ఉండాలి మనం చేసే service ని ఈ  website లో ఉంచాలి వీటి ద్వారా మన బ్రాండ్ ని ప్రమోట్ చేసికోవాలి అలాగే social మీడియా లో(fb, Instagram, twitter ,టెలిగ్రామ్, you tube,  link din…..)    డైలీ constant గా పోస్ట్ చేయాలి .

అలాగే videos  మంచి కోలిటీ లో తీసి అప్లోడ్ చేయాలి అలాగే just Dial, magic Brick, 99 acres, housing finance, Facebook marketing ….ఇలా కొన్ని classified sites లోన కూడాను డైలీ post లు పెట్టాలి అప్పుడే మనం అనుకున్న టార్గెట్ fulfill చేయవచ్చు అయితే ఇందులో కొన్ని paid ఉంటాయి కొన్ని ఫ్రీ ఉంటాయి దాని బట్టి మనం కష్టబడాలి అప్పుడే ఫలితం దక్కుతుంది.