POP Ceiling Design? POP Ceiling Design ఎందుకు చేయాలి? ప్రయోజనాలు ఏమిటి?
POP Ceiling Design:
POP Ceiling Design:
ఇంటి అందాన్ని కొత్త స్థాయికి తీసికొనివెళ్ళడం లో సీలింగ్ (Ceiling) ఒకటి. గదిలోకి ప్రవేశించిన వెంటనే కళ్ల ముందుకొచ్చేది సీలింగ్‌నే. అందుకే ప్రస్తుత కాలంలో నూతన ఇళ్ళలో, కార్యాలయాల్లో, షాపుల్లో, హాలులో, బెడ్రూమ్లో, కిచెన్‌లో, హోటల్ గదుల్లో కూడా POP Ceiling Designs విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి.
POP సీలింగ్ అంటే Plaster of Paris తో రూపొందించే ఫాల్స్ సీలింగ్. ఇది ఇంటీరియర్ డిజైన్‌లో అత్యంత ముఖ్యమైన భాగంగా మారిపోయింది. దీని ద్వారా మీ గది లోపల ఒక కళ/అందం వస్తుంది , లైటింగ్ ఎఫెక్ట్స్ అద్భుతంగా కనిపిస్తాయి, మరియు గది పూర్తిగా మోడ్రన్ లుక్‌లోకి మారుతుంది.మీ ఇంటి సామాగ్రికోసం https://amzn.to/3JTDitw
మన ఇంటికి ceiling design ఎందుకు చేయించాలి :
ఇంటీరియర్ డిజైన్ లో సీలింగ్ ప్రధానమైనది. కాబట్టి సరైన సీలింగ్ కి మంచి డిజైన్ చేయించుకున్నట్లు అయితే మీ ఇంటికి మరింత అందం వస్తుంది. ప్రస్తుతం అందరు ఇళ్లలో ఫాల్స్ సీలింగ్ ని ఏర్పాటు చేయించుకుంటున్నారు. ఇవి గదిని ఆహ్లదభరిత వాతావరణాన్ని కల్పిస్తాయి. నచ్చిన సీలింగ్ ఏర్పాటు చేసికోవడం వలన మనసు, శరీరానికి స్వాంతన కలుగుతుంది.
దీన్ని వాడడం వలన పైకప్పు విశాలంగా వున్నా భావన కలుగుతుంది. వీటిలో అనేక రకాలు వున్నాయ్. pop, జిప్సం, చెక్క, పీవీసీ, మెటల్, అద్దాలు, ఫైబర్, ఫాబ్రిక్, సింథటిక్ ఇలా అనేక మేటరియల్స్ తో ఫాల్స్ సీలింగ్ ఏర్పాటు చేసికోవచ్చు. అయితే ఏంతో ముచ్చటపడి చేయించుకున్న ఫాల్స్ సీలింగ్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. అంటే పగుళ్లు రావడం, ఊడిపోవడం వంటివి జరుగుతాయి, దీని వల్ల ఇంటి అందం దెబ్బతింటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసికోవాలి .
POP అంటే ఏమిటి?POP Ceiling Design ఎందుకు చేయాలి:
POP (Plaster of Paris) అనేది జిప్సం (Gypsum) అనే రాయి నుండి తయారయ్యే తెల్లని పౌడర్.ఇది నీటితో కలిపితే మెత్తని పేస్ట్‌లా మారి మోడల్ చేయడానికి, డిజైన్ చేయడానికి అనువుగా ఉంటుంది. కొన్ని నిమిషాల్లో ఇది బలంగా గట్టి అవుతుంది.తక్కువ బరువు. మృదువైన ఫినిషింగ్.ఎక్కడికైనా మోడల్ చెయ్యగలిగే మెత్తదనం.POP సీలింగ్ గది మొత్తం లుక్‌ను లగ్జరీ ఫినిష్‌తో మార్చేస్తుంది.లైటింగ్స్కి POP Ceiling పూర్తిగా అనుకూలం(LED Strip లైట్స్, Spot లైట్స్,Cove లైట్స్,Warm / Cool లైట్స్).POP సీలింగ్ వలన గది లోపలి శబ్దం తగ్గుతుంది.హోమ్ థియేటర్ రూమ్స్‌కు చాలా మంచిది. ఎటువంటి ఎలక్ట్రిక్ వైర్లు, AC Pipes, CCTV Wires గది బయట కనిపించకుండా POP లోపల దాచేయవచ్చు.ఫాల్స్ సీలింగ్ వలన రూఫ్ నుండి వచ్చే వేడి తగ్గి గది చల్లగా ఉంటుంది.మీరు ఏ డిజైన్ కోరుకున్నా POP లో చేయవచ్చు.(రౌండ్స్క్వేర్,కార్నిష్,మల్టీ లేయర్,3D ప్యాటర్న్స్).
POP Ceiling లో ఉన్న లోపాలు:
gypsum బోర్డ్ సీలింగ్‌తో పోలిస్తే POP వర్క్ కొంచెం నెమ్మదిగా జరుగుతుంది.Experienced Technician లేకపోతే ఫినిషింగ్ బాగా రాదు.చాలా తడి ఉన్న గదుల్లో POP సీలింగ్ కొద్దిమేర బలహీనమవుతుంది.సంవత్సరానికి ఒకసారి Paint చెయ్యడం మంచిది.సీలింగ్ తడి కాకుండా చూసుకోవాలి.లైట్లు పనిచేయకపోతే వెంటనే మార్చాలి. వాటర్ తగలకూడదు వాటర్ తగిలితే pop షీట్స్ పోతాయ్. వర్క్ అనేది slow గా అవుతుంటాది. చెదలు పట్టే ఛాన్సెస్ ఎక్కువ. ఓన్లీ ఇన్నర్ లోనే మాత్రమే వాడుతారు. వీటి లైఫ్ తక్కువ ఉంటుంది(5 to 8 years). వర్క్ చేసినప్పుడు రూమ్ లో దుమ్ము దూళి ఎక్కువ పడుతుంది. క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ.వీటి మెటీరియల్ క్రింద పడి ప్లేస్ కరాబ్ అవుతుంది.చాల జాగ్రత్త పాటించాలి .
మీ ఇంటికి సరిపోయే డిజైన్ ఎలా ఎంచుకోవాలి?
హాల్: లగ్జరీ, LED Cove, చాండెలియర్ డిజైన్ ఎంచుకోవాలి .
బెడ్రూమ్: సింపుల్, కామ్ షేడ్స్, ఇండైరెక్ట్ లైటింగ్ అయితే బాగుంటుంది .
కిచెన్: సూట్‌గా, Plain Ceiling అయితే చాల బాగుంటుంది .
కిడ్స్ రూమ్: ఫన్ ప్యాటర్న్స్ తో నింపేయాలి
షాప్స్ / ఆఫీస్: Bright, Minimal POP అయితే బెటర్ అది మీ అలోసన బట్టి ఉంటుంది .
POP Ceiling Designs రకాలు
Simple POP Ceiling:
ఈ ceiling సులభమైన, క్లాసిక్ లుక్ ని ఇస్తుంది .హాల్, బెడ్రూమ్కి ఇది బెస్ట్.
Double Layer POP Ceiling:
ఈ ceiling రెండు లేయర్లతో తయారు చేసే స్టైలిష్ మోడల్ లుక్ ని ఇస్తుంది .లైటింగ్ చాలా బాగా సెటప్ అవుతుంది.
Dual Color POP Ceiling:
White Classic POP Ceiling అనేది ఎప్పటికీ క్లాసిక్ లుక్ ఇచ్చేది.
-
White + Gold
-
White + Grey
-
Cream + Brown
Floating / Cove POP Ceiling:
సీలింగ్ తేలుతున్నట్టు కనిపిస్తుంది.LED Strip Light లు అద్భుతంగా కనిపిస్తాయి.
POP With Wooden Combination:
మాడెర్న్ హోమ్‌లలో POPతో పాటు వుడ్ ప్యానెల్స్ కూడా పెడతారు.
POP 3D Ceiling:
3D Patterns: Wave, Flower, Circle, Swirl, Geometric.అందమైన లగ్జరీ లుక్.
Hall POP Ceiling:
లివింగ్ రూమ్ కోసం ప్రత్యేక మోడల్స్: Round Center Design, LED Cove Design, Border Lighting, Chandelier POP Design.
Bedroom POP Ceiling:
రిలాక్స్డ్ లుక్ కోసం: Warm LED Lights, Minimal Curved POP, Starry Night Ceiling.
బెడ్రూమ్ కు పర్ఫెక్ట్:
-
Sky Blue
-
Baby Pink
-
Mint Green
Kitchen POP Ceiling:
సింపుల్, ప్లెయిన్, Cleanable డిజైన్స్ అయితే బాగుంటుంది .
Kids Room POP Ceiling:
కార్టూన్ షేప్స్, క్లౌడ్ షేప్, స్టార్ లైట్ సీలింగ్ ఉంటే లుక్ బాగుంటుంది .
POP Ceiling నిర్మాణం ఎలా చేస్తారు?
సీలింగ్(రూమ్ wise ) మొత్తం కొలతలు తీసికోవాలి. అల్యూమినియం / ఐరన్ ఛానెల్స్ ఫ్రేమ్ బిగించాలి. POP + నీరు = Smooth Paste తయారు చేస్తారు.ముందుగా చానెల్స్ బిగించి తరువాత ఎలక్ట్రికల్ వైరింగ్ చేయాలి. తరువాత షీట్స్ బిగించి వేస్తారు .మీరు ఎంచుకున్న నమూనాని ఫ్రేమ్ మీద అప్లై చేస్తారు.Completeగా ఆరడానికి 2–3 రోజులు పడుతుంది. (Primer + పెయింట్) Matte / Gloss / Texture ఏదైనా పెయింట్ చేయవచ్చు.
ఉపయోగించే మెటీరియల్స్:
Plaster of Paris పొడి. వాటర్, Iron / GI చానెల్స్, Screws & నెయిల్స్, Fiber టేప్, Primer ,పెయింట్ , LED లైట్స్ ,Joint కాంపౌండ్.
LED Cove Lights
గోడల చుట్టూ వెలిగే లైట్. మోడ్రన్ హౌస్‌లలో ఎక్కువగా వాడతారు.
Spot Lights
స్టడీ రూమ్, హాల్, కిచెన్ కోసం బెస్ట్.
Chandelier + POP
సెంటర్లో చాండెలియర్ పెడితే లగ్జరీ లుక్.
RGB Lights
కిడ్స్ రూమ్, గేమ్ రూమ్‌లకు మంచివి.
ఎంతో ఖర్చు అవుతుంది?
thickness నెస్ బట్టి రేట్ పెరుగుతుంది. ముందుగా చానెల్స్ బిగించి తరువాత ఎలక్ట్రికల్ వైరింగ్ చేయాలి. తరువాత షీట్స్ బిగించి వేస్తారు.
₹50 – ₹55 per sq. ft (plain Design)
₹90 – ₹150 per sq. ft (Simple Design)
₹150 – ₹250 per sq. ft (Double Layer)
₹250 – ₹350 per sq. ft (3D / Designer Ceiling)
Extra కాస్ట్స్: LED Strip Lights , Spot Lights , Chandelier, Special Paint.
POP Ceiling Design ఎందుకు చేయాలి? ప్రయోజనాలు ఏమిటి?
*మనకి నచ్చిన shapes డిజైన్ చేసికోవచ్చు. రూమ్ కి చల్లదనం ఇస్తుంది. తేమకి తట్టుకొనే సామర్థ్యం ఎక్కువ. simple designs కోసం ఇవి బాగుంటాయి.తక్కువ ఖర్చు ఉంటుంది. work అనేది slow గా నడుస్తుంది. మనకు నచ్చిన డిజైన్ మరియు నచ్చిన కలర్స్ వేసికోవచ్చు అలాగే మార్షికోవచ్చు. చాల strong ఉంటుంది. ఇది ఫైర్ రెస్ట్రిక్షన్ ని కలిగి ఉంటుంది. వీటి చానెల్స్ వలన స్లాబ్ కి బరువు పడుతుంది.
సీలింగ్ తో పాటు చేయించే పనులు :
wiring: 1 square ఎలక్ట్రికల్ box లు ఉండాలి. lighting : ceiling lights, స్పాట్ లైట్స్(అందం కోసం గోడమీద పడేవి ), రూప్ లైట్స్ (ప్రొఫైల్ లైట్స్ ), జూమర్ (మధ్యలో పెద్ద లైట్ ). putty/ప్రైమర్ /paint ఈ వర్క్స్ చేయించాలి.
ఫాల్స్ సీలింగ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది :
సరైన ప్లానింగ్ లేకపోవడం ఫాల్స్ సీలింగ్ ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం. ఉన్న ప్లేసుని బట్టి లే అవుట్ ను పూర్తిగా ప్లాన్ చేయాలి. యుటిలిటీస్, లైట్ పిక్చరు వంటివి ఎక్కడ ప్లేస్ చేయాలిఅనేదాన్ని ముందుగానే ప్లాన్ చేసికోవాలి. అలాగే కొలతలు అనేవి ఫాల్స్ సీలింగ్ ఏర్పాటు చేసే ప్రాంతపు అంత ఒకటికి పదిసార్లు సరిచూసికోవాలి ఎందుకంటే మెటీరియల్ ఆర్డర్ చేయడానికి, ఇన్స్టాల్లేషన్ చేయడానికి కొలతలు చాల ముఖ్యం.
ఫాల్స్ సీలింగ్ ఏర్పాటులో నాణ్యత లేని పదార్దాలు వాడడం వలన సీలింగ్ కుంగిపోవడం, రంగు మారిపోవడం వంటివి జరుగుతాయి. తేమను ఎక్కువుగా తీసికొని త్వరగా పాడుఅయిపోయే అవకాశం వుంది. అలాగే ఫాల్స్ సీలింగ్ ఏర్పాటు చేసేటప్పుడు వెంటిలేషన్ ఉండేటట్లు సరిచూసికోవాలి. గాలి ప్రసరణకు వీలుగా ఉండేలా చూసికోవాలి ఎందుకంటే తేమ చేరకుండా ఉంటుంది .
ఫాల్స్ సీలింగ్ ఇన్స్టలేషన్ లోపాలు :
ఫాల్స్ సీలింగ్ సరిగ్గా ఇన్స్టాల్ చేయకపోవడం వల్ల సీలింగ్ ఎగుడు దిగుడుగా, గాప్స్ తో కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎంచుకున్న మెటీరియల్ బట్టి మంచి ఎక్స్పీరియన్స్ వున్నా వారితో చేయించుకోవాలి. సీలింగ్ మొత్తం పూర్తియైన తరువాత ఫినిషింగ్ సరిగ్గా ఇవ్వాలి. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. సీలింగ్ డిజైన్ సరిగ్గా వుందా లేదా, పెయింట్ ఎలా వేశం అన్నవాటిని పరిశీలించుకోవాలి.
ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు సరైన కొలతలు తీసికోవాలి. లైటింగ్, వెంటిలేషన్, ఏ మెటీరియల్ వాడుతామో అనేది ఫైనల్ చేయాలి. అలాగే నాణ్యమైన వస్తువులను ఉపయోగించాలి తేమ రాకుండా ఉండడం కోసం. ఫైర్ రెసిస్టెంట్ పదార్దాలను వాడాలి. అలాగే మంచి ఎక్స్పీరియన్స్ వర్కర్స్ ని నియమించుకోవాలి.
వెంటిలేషన్ కోసం HVAC ( హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్) ను వినియోగించండి. గాలి ప్రసరణ ఉండేటట్లు చూసికోవాలి. సీలింగ్ ఇన్స్టాల్ చేసే సమయంలో ఏవైనా సమస్యలు వున్నాయ్ ఏమో ఒకటికి పదిసార్లు చూసికోవాలి అలాగే వెంటనే ప్రాబ్లెమ్ సాల్వ్ చేసికోవాలి.
నిర్మాణాత్మక సమస్యలు :
ఫాల్స్ సీలింగ్ కి అవసరమైనంత ఎత్తులో గది సీలింగ్ ఉందోలేదో చెక్ చేసికోవాలి. ప్రస్తుతము వున్నా ఇంటి సీలింగ్ అదనపు బరువుకి సిద్ధంగా ఉందొ లేదో అన్నది ముందుగా చెక్ చేసికోవాలి అవసరం అనుకుంటే మంచి ఇంటీరియర్ డిజైన్ చేసేవారిని సంప్రదించడం మంచిది.
సరైన ఫైర్ రేటింగ్ ఉన్న సీలింగ్ మెటీరియల్ ఎంచుకోవాలి. భద్రత నిబందనాలికి అనుగునంగా ఉండేలా చూసికోండి. అలాగే కలర్స్ విషయం లో చాలా జాగ్రత్త వహించాలి. సీలింగ్ లైట్ కలర్ వుండేలా చూసికోవాలి అప్పుడే గది విశాలంగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఎక్కువ రంగులు వేసిన సీలింగ్ అంత బాగుండదు.
మా construction company సర్వీసెస్ :
*మేము అపార్ట్మెంట్ నిర్మాణములు మరియు డెవలప్మెంట్ ,ఇండిపెడెంట్ ఇల్లు వాస్తు
ప్రకారంగా NO .1 క్వాలిటీగా కట్టి ఇవ్వబడును .
*15 ఇయర్స్ అనుభవంతో గ్రూప్ హౌసెస్ ,విల్లాస్ ,duplex houses ,ఇండిపెడెంట్
హౌసెస్,(మెటీరియల్ తో అయినా /మెటీరియల్ లేకుండా అయినా ) ఇంజినీర్
పర్యవేక్షణలో వాస్తు ప్రకారం నిర్మాణము చేసి ఇవ్వబడును .
* అలాగే మోడరన్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇవ్వబడును .
* మినీ home థియేటర్ డిజైన్ చేసి ఇవ్వబడును . మా phone number ;7989312152 , 9989456907.

