POP False Ceiling Design | PVC False Ceiling Design:
pop false ceiling design: ఇంటీరియర్ డిజైన్ లో సీలింగ్ ప్రధానమైనది. కాబట్టి సరైన సీలింగ్ కి మంచి డిజైన్ చేయించుకున్నట్లు అయితే మీ ఇంటికి మరింత అందం వస్తుంది. ప్రస్తుతం అందరు ఇళ్లలో ఫాల్స్ సీలింగ్ ని ఏర్పాటు చేయించుకుంటున్నారు. ఇవి గదిని ఆహ్లదభరిత వాతావరణాన్ని కల్పిస్తాయి. నచ్చిన సీలింగ్ ఏర్పాటు చేసికోవడం వలన మనసు, శరీరానికి స్వాంతన కలుగుతుంది.
దీన్ని వాడడం వలన పైకప్పు విశాలంగా వున్నా భావన కలుగుతుంది. వీటిలో అనేక రకాలు వున్నాయ్. pop, జిప్సం, చెక్క, పీవీసీ, మెటల్, అద్దాలు, ఫైబర్, ఫాబ్రిక్, సింథటిక్ ఇలా అనేక మేటరియల్స్ తో ఫాల్స్ సీలింగ్ ఏర్పాటు చేసికోవచ్చు. అయితే ఏంతో ముచ్చటపడి చేయించుకున్న ఫాల్స్ సీలింగ్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. అంటే పగుళ్లు రావడం, ఊడిపోవడం వంటివి జరుగుతాయి, దీని వల్ల ఇంటి అందం దెబ్బతింటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసికోవాలి అవి
వాల్ పేపర్ సీలింగ్ :
ప్రస్తుతము వాల్ పేపర్స్ మార్కెట్లో అనేక డిజైన్లలో ఎవరీ ఇష్టానికి తగ్గట్లు వారికీ అతి తక్కువు ఖర్చు లోనూ దొరికి తున్నాయి. వాల్ పేపర్ అనేది సీలింగ్ కి మంచి అందాన్ని ఇస్తుంది, మనం ఎంచుకున్న డిజైన్స్, కలర్స్ , మోడల్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చాల డిమాండ్ వుంది వాల్ పేపర్ సీలింగ్ కీ చాల మంది ఇంటికి వాల్ పేపర్ సీలింగ్ పెట్టించుకుంటున్నారు.
పెయింటెడ్ సీలింగ్ pop false ceiling design:
ఇతర సీలింగ్ లతో పోలిస్తే పెయింటెడ్ సీలింగ్ కి ఖర్చు తక్కువ. అవసరాన్ని బట్టి కలర్ మార్చుకొనే సౌకర్యం ఉంటుంది. మన ఇష్టానికి తగ్గట్టు మన కంటికి ఆకట్టుకునే డిజైన్స్ వేసికోవచ్చు. ఎప్పటికి అప్పుడు మనకి నచ్చినట్లు డిజైన్స్ మార్చికోవచ్చు.

మిర్రర్ సీలింగ్ :
మిర్రర్ సీలింగ్ ఏర్పాటు చేయడం వలన గది రిఫ్లెక్ట్ అయి స్థలం పెద్దగా, విలాసవంతంగా కనిపిస్తుంది. అయితే దీని ఇన్స్టాలేషన్ విషయం లో జాగ్రత్త పడాలి , లేదంటే పగిలే అవకాశం వుంది, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మిర్రర్ టైల్స్ ని మీరు కూడా సులువుగా ఇన్స్టాల్ చేసికోవచ్చు. అలాగే లుక్ పరంగా చాల బాగుంటుంది.
ఉడెన్ సీలింగ్ pop false ceiling design:
ఇప్పుడున్న పరిస్థితిలో మంచి డిమాండ్ వున్నది ఉడెన్ సీలింగ్. ఈ సీలింగ్ వలన చలి, వేడినుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే లుక్ పరంగా చాల బాగుంటుంది. అలాగే ఉడెన్ సీలింగ్ అనేది బయట నుంచే వచ్చే శబ్దాలను అరికట్టుతుంది. కాకపోతే ఉడెన్ సీలింగ్ ఖర్చు ఎక్కువ. ఉడెన్ సీలింగ్ మాదిరిగానే pop, జిప్సమ్ సీలింగ్ కూడా మంచి డిమాండ్ ఉన్నవే .
ఫాల్స్ సీలింగ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది :
సరైన ప్లానింగ్ లేకపోవడం ఫాల్స్ సీలింగ్ ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం. ఉన్న ప్లేసుని బట్టి లే అవుట్ ను పూర్తిగా ప్లాన్ చేయాలి. యుటిలిటీస్, లైట్ పిక్చరు వంటివి ఎక్కడ ప్లేస్ చేయాలిఅనేదాన్ని ముందుగానే ప్లాన్ చేసికోవాలి. అలాగే కొలతలు అనేవి ఫాల్స్ సీలింగ్ ఏర్పాటు చేసే ప్రాంతపు అంత ఒకటికి పదిసార్లు సరిచూసికోవాలి ఎందుకంటే మెటీరియల్ ఆర్డర్ చేయడానికి, ఇన్స్టాల్లేషన్ చేయడానికి కొలతలు చాల ముఖ్యం.
ఫాల్స్ సీలింగ్ ఏర్పాటులో నాణ్యత లేని పదార్దాలు వాడడం వలన సీలింగ్ కుంగిపోవడం, రంగు మారిపోవడం వంటివి జరుగుతాయి. తేమను ఎక్కువుగా తీసికొని త్వరగా పాడుఅయిపోయే అవకాశం వుంది. అలాగే ఫాల్స్ సీలింగ్ ఏర్పాటు చేసేటప్పుడు వెంటిలేషన్ ఉండేటట్లు సరిచూసికోవాలి. గాలి ప్రసరణకు వీలుగా ఉండేలా చూసికోవాలి ఎందుకంటే తేమ చేరకుండా ఉంటుంది .
ఫాల్స్ సీలింగ్ ఇన్స్టలేషన్ లోపాలు :
ఫాల్స్ సీలింగ్ సరిగ్గా ఇన్స్టాల్ చేయకపోవడం వల్ల సీలింగ్ ఎగుడు దిగుడుగా, గాప్స్ తో కనిపిస్తుంది. కాబట్టి మీరు ఎంచుకున్న మెటీరియల్ బట్టి మంచి ఎక్స్పీరియన్స్ వున్నా వారితో చేయించుకోవాలి. సీలింగ్ మొత్తం పూర్తియైన తరువాత ఫినిషింగ్ సరిగ్గా ఇవ్వాలి. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. సీలింగ్ డిజైన్ సరిగ్గా వుందా లేదా, పెయింట్ ఎలా వేశం అన్నవాటిని పరిశీలించుకోవాలి.
లైటింగ్ :pop false ceiling design
ఫాల్స్ సీలింగ్ లో మెయిన్ పార్ట్ లైటింగ్. దీనిని సరిగా ఇన్స్టాల్ చేయకపోవడం వలన నీడలు, లైటింగ్ సరిగ్గా కనిపించకపోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి ఒకటికి పది సార్లు సరిచూసికోవాలి అలాగే మంచి నిపుణులు తో వర్క్ చేపించాలి.
అకౌస్టిక్స్ :
శబ్దాన్ని నిరోధించడానికి ఫాల్స్ సీలింగ్ లో అకౌస్టిక్స్ వాడుతారు. వీటిని సరిగ్గా ఇన్స్టాల్ చేయకపోవడం వలన గదిలో రీసౌండ్ వచ్చే అవకాశం వుంది. అందుకే అకౌస్టిక్ కలిసి వున్న సీలింగ్ మెటీరియల్ వాడాలి లేదంటే అకౌస్టిక్ పానెల్స్ వాడాలి.
లోపాలు సరిచేయడం :
ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు సరైన కొలతలు తీసికోవాలి. లైటింగ్, వెంటిలేషన్, ఏ మెటీరియల్ వాడుతామో అనేది ఫైనల్ చేయాలి. అలాగే నాణ్యమైన వస్తువులను ఉపయోగించాలి తేమ రాకుండా ఉండడం కోసం. ఫైర్ రెసిస్టెంట్ పదార్దాలను వాడాలి. అలాగే మంచి ఎక్స్పీరియన్స్ వర్కర్స్ ని నియమించుకోవాలి.
వెంటిలేషన్ కోసం HVAC ( హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్) ను వినియోగించండి. గాలి ప్రసరణ ఉండేటట్లు చూసికోవాలి. సీలింగ్ ఇన్స్టాల్ చేసే సమయంలో ఏవైనా సమస్యలు వున్నాయ్ ఏమో ఒకటికి పదిసార్లు చూసికోవాలి అలాగే వెంటనే ప్రాబ్లెమ్ సాల్వ్ చేసికోవాలి. 
నిర్మాణాత్మక సమస్యలు :
ఫాల్స్ సీలింగ్ కి అవసరమైనంత ఎత్తులో గది సీలింగ్ ఉందోలేదో చెక్ చేసికోవాలి. ప్రస్తుతము వున్నా ఇంటి సీలింగ్ అదనపు బరువుకి సిద్ధంగా ఉందొ లేదో అన్నది ముందుగా చెక్ చేసికోవాలి అవసరం అనుకుంటే మంచి ఇంటీరియర్ డిజైన్ చేసేవారిని సంప్రదించడం మంచిది.
సరైన ఫైర్ రేటింగ్ ఉన్న సీలింగ్ మెటీరియల్ ఎంచుకోవాలి. భద్రత నిబందనాలికి అనుగునంగా ఉండేలా చూసికోండి. అలాగే కలర్స్ విషయం లో చాలా జాగ్రత్త వహించాలి. సీలింగ్ లైట్ కలర్ వుండేలా చూసికోవాలి అప్పుడే గది విశాలంగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఎక్కువ రంగులు వేసిన సీలింగ్ అంత బాగుండదు.
cost :pop false ceiling design
2bhk house ceiling కి ప్లైన్ అయితే 50k అదే డిజైన్ అయితే 100000/ అవుతుంది . చాల మంది లుక్ కోసం లోపల gypsum ceiling పెట్టించుకుని బయట వరండాలో యూపీవీసీ ceiling చేయించుకుంటున్నారు , ఇప్పుడు ఇది లేటెస్ట్ మోడల్. అలా మీరు ఎన్ని రూమ్స్ కి ఫాల్స్ సీలింగ్ చేసికొంటారో ఏవిధమైనటువంటి డిజైన్ చేసికుంటారో దాన్నిబట్టి అమౌంట్ calculation చేసికోవాలి.


